New Broadband Plan: మూడు నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్ - సూపర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్!
Excitel Rs 499 Plan: రూ.499 ధరకే 300 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్, ఓటీటీ కంటెంట్‌లకు యాక్సెస్‌ను ఎక్సిటెల్ అనే కంపెనీ అందిస్తుంది. ఆ ప్లాన్ లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.
Excitel New Broadband Plan: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలే కాకుండా బ్రాడ్‌బ్యాండ్ కంపెనీలు కూడా. కానీ వీటన్నింటి మధ్య తక్కువ ధరకు ఎక్కువ ప్రయోజనాలను అందజేస్తున్న ఒక కంపెనీ ప్రవేశించింది. ఈ కంపెనీ పేరు ఎక్సిటెల్. కస్టమర్ల కోసం కంపెనీ ఓ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద కంపెనీ మూడు నెలల పాటు ఉచిత ఇంటర్నెట్, 18 రకాల ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ ద్వారా కంపెనీ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే
ఎక్సిటెల్ కొత్త రూ.499 మంత్లీ ప్లాన్
ఎక్సిటెల్ కొత్త ప్లాన్ ధర నెలకు రూ.499గా ఉంది. మీరు తొమ్మిది నెలల పాటు ఇంటర్నెట్ ఉపయోగిస్తే మీకు మూడు నెలల ఉచిత ఇంటర్నెట్ లభిస్తుంది. అలాగే మీరు 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను, 150 కంటే ఎక్కువ ఛానెల్‌లను చూడవచ్చు. 300 ఎంబీపీఎస్ వేగంతో మీరు ఇంటర్నెట్ యాక్సెస్ చేయవచ్చు. ఈ ఆఫర్ ప్రస్తుతం యాక్టివ్‌గానే ఉంది.
ఈ ఆఫర్‌లో మీరు అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్, సన్‌నెక్స్ట్, ఆహా వంటి 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ పొందుతారు. ఈ ఆఫర్ కింద, కంపెనీ కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ ప్లాన్‌తో, మీరు ఉచిత లైవ్ టీవీ ఛానెల్స్, ఉచిత స్మార్ట్ టీవీ లేదా హెచ్‌డీ ప్రొజెక్టర్‌ను కూడా పొందుతారు. ఈ ఆఫర్ 35 కంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది.
రెండు కొత్త ప్లాన్‌లను లాంచ్ చేసిన ఎక్సిటెల్
ఎక్సిటెల్ ఈ నెల ప్రారంభంలో బిగ్ స్క్రీన్ ప్లాన్ పేరుతో రెండు కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌ల ధర రూ.1,299, రూ.1,499గా ఉంది. ఈ ప్లాన్‌ల్లో వినియోగదారులు హై స్పీడ్ ఇంటర్నెట్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, ఉచిత లైవ్ టీవీ ఛానెల్స్, ఉచిత స్మార్ట్ టీవీ లేదా హెచ్‌డీ ప్రొజెక్టర్‌లను పొందుతారు. ఈ ఆఫర్ కూడా 35 కంటే ఎక్కువ నగరాల్లో అందుబాటులో ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?