అన్వేషించండి

Vivo T3 Ultra Vs Vivo T3 Pro: ఈ 5జీ స్మార్ట్​ ఫోన్లలో ఏది బెస్ట్​​, ధర ఎంత? ఫీచర్ల పూర్తి వివరాలివే

వివో.. T సిరీస్‌లో విడుదల చేసిన టీ3 ప్రోకు మంచి ఆదరణ రావడంతో.. తాజాగా టీ3 అల్ట్రా 5జీని దేశీయ మార్కెట్​లోకి రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్​ ఫోన్‌లలో ఏది కొనుగోలు చేయాలి?  ఏది బెటర్ ఓ సారి చూద్దాం.

ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ వివో తమ యూజర్స్​ను అలరించేందుకు సరికొత్త మోడల్ ఫోన్లను మార్కెట్​ల్లోకి విడుదల చేస్తోంది. అలా గత నెలలో T సిరీస్‌లో విడుదల చేసిన టీ3 ప్రోకు మంచి ఆదరణ రావడంతో రీసెంట్​గా టీ3 అల్ట్రా 5జీని దేశీయ మార్కెట్​లోకి రిలీజ్ చేసింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో  ఏఐ ఫీచర్లను జోడించి మార్కెట్​లోకి వదిలింది.

అయితే ఈ రెండు స్మార్ట్​ ఫోన్‌లలో ఏది కొనుగోలు చేయాలి?  ఏది బెటర్ అనే దానిపై యూజర్స్​లో చాలా మందికి చిన్న గందరగోళం ఏర్పడే వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ఏది బెటర్, దేనీ ఫీచర్స్​ ఎలా ఉన్నాయి? వంటి పూర్తి సమాచారం ఈ కథనంలో మీకు అందిస్తున్నాం. ఇందులో డిస్‌ప్లే,  కెమెరా సెటప్, ప్రాసెసర్, బ్యాటరీ, ధరతో పాటు పూర్తి వివరాలను ఉన్నాయి.

వివో టీ3 అల్ట్రా 5జీ ఫోన్​ ప్రారంభ ధర రూ.28,999.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ పేమెంట్‌తో అయితే  రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. రూ. 3 వేల ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.  లునార్‌ గ్రా, ఫ్రాస్గ్‌ గ్రీన్‌ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. వివో టీ3 ప్రో 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ అయితే రూ. 24,999కు దొరుకుతుంది. ఎమరాల్డ్ గ్రీన్, శాండ్‌స్టోన్ ఆరెంజ్ రంగులలో ఇది అందుబాటులో ఉంది.

వివో టీ3 అల్ట్రా 5జీ  6.78 ఇంచ్​ త్రీడి కర్వ్‌డ్‌ అమోలెడ్‌ 1.5K  డిస్‌ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్‌ రేట్.  వివో టీ3 ప్రో 6.67 అంగుళాల కర్వ్డ్ డిస్‌ప్లే.  120 Hz రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 4500 బ్రైట్​నెస్​ను ఇస్తుంది.

వివో టీ3 అల్ట్రా 5జీ  8జీబీ+ 128జీబీ, 8జీబీ+ 256జీబీ, 12జీబీ+ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీని కలిగి ఉంది.  ర్యామ్‌ను 24జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. వివో T3 ప్రో ఫోన్ 8జీబీ + 128జీబీ, 8జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లలో  లభిస్తుంది.

వివో టీ3 అల్ట్రా 5500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ఫోన్‌ 80W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వివో టీ3 ప్రో  5,500mAh  కెపాసిటీతో పని చేస్తుంది. ఇది కూడా 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్​ను సపోర్ట్‌ చేస్తుంది.

వివో టీ3 అల్ట్రా 5జీ, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌14తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్‌ ఉపయోగించారు. వివో టీ3 ప్రో  స్మాప్​డ్రాగన్​ 7 జనరేషన్​ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది కూడా ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్​ ఓఎస్​ 14 సాఫ్ట్‌వేర్‌తో నడుస్తుంది.

వివో టీ3 అల్ట్రా 5Gలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఉంది.  దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్​ను కలిగి ఉంది. ఇంకా ఈ ఫోన్‌ యూఎస్‌బీ 2.0 పోర్ట్‌, బ్లూటూత్‌ 5.3, వైఫై5కు సపోర్ట్‌ చేస్తుంది. వివో టీ3 ప్రో   ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్​ను కలిగి ఉంది. ఇది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అల్ట్రా గేమ్ మోడ్, 2000 Hz క్విక్ టచ్ ప్యాటర్న్ రెడ్, 4డీ గేమ్ వైబ్రేషన్ వంటి వాటిని సపోర్ట్‌ చేస్తుంది.

వివో టీ3 అల్ట్రాలో డ్యూయెల్ రియర్ కెమెరా  ఉంది.  వెనకవైపు 50ఎంపీ సోనీ IMX921 ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ రియర్‌ కెమెరా ఉంది. ముందువైపు సెల్ఫీ కోసం 50ఎంపీ కెమెరా ఉంటుంది.  ఏఐ ఎరేజర్‌, ఫొటోల క్వాలిటీ పెంచేందుకు, ఎడిట్‌ చేసేలా ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. వివో టీ3 ప్రోలో కూడా డ్యూయెల్ కెమెరా సెటప్‌ ఉంది.  ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వంటివి  ఉన్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Embed widget