![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Unlimited Data Plan: రూ.398 పెడితే చాలు - ఎంత డేటా అయినా వాడచ్చు - ఎన్ని సినిమాలైనా చూడచ్చు - సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్!
బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది.
![Unlimited Data Plan: రూ.398 పెడితే చాలు - ఎంత డేటా అయినా వాడచ్చు - ఎన్ని సినిమాలైనా చూడచ్చు - సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్! BSNL Rs 398 Plan to Give Unlimited Data Check Benefits Unlimited Data Plan: రూ.398 పెడితే చాలు - ఎంత డేటా అయినా వాడచ్చు - ఎన్ని సినిమాలైనా చూడచ్చు - సూపర్ ప్రీపెయిడ్ ప్లాన్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/16/3c1b6fea62f779c8f6a52a166ce7d132_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మీరు రోజూ ఎక్కువ డేటా ఉపయోగిస్తారా? ఎంత రీచార్జ్ చేసినా సరిపోవట్లేదా? అయితే ఈ బీఎస్ఎన్‌ఎల్ ప్లాన్ మీకోసమే. ఎందుకంటే ఏ టెలికాం నెట్‌వర్క్ అందించని ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. అదే బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్.
బీఎస్ఎన్ఎల్ రూ.398 అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. అంతే ఎంత డేటాను అయినా ఉపయోగించవచ్చన్న మాట. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఇంక మరే అదనపు లాభాలు ఈ ప్లాన్ ద్వారా లభించవు.
రూ.400లోపు అన్‌లిమిటెడ్ డేటాను అందించే ప్రత్యేకమైన ప్లాన్ మార్కెట్లో ఇదొక్కటే ఉంది. దీంతోపాటు ఎన్నో ప్రత్యేకమైన ప్లాన్లు బీఎస్ఎన్ఎల్‌లో ఉన్నాయి. కానీ 4జీ లేకపోవడం బీఎస్ఎన్ఎల్‌కు పెద్ద మైనస్‌గా మారింది. 2021లో ప్లాన్ టారిఫ్‌లు పెంచని ఏకైక టెలికాం బీఎస్ఎన్ఎలే.
2022 చివరినాటికి 4జీని, 2023లో 5జీ లాంచ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ అన్నీ ప్లాన్‌కు తగ్గట్లు జరిగితే బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సర్వీసులను కూడా అందించనుంది. అప్పుడు ప్రైవేట్ కంపెనీలకు దీటుగా బీఎస్‌ఎన్ఎల్ పోటీలోకి రాగలదు. ప్రస్తుతం 5జీ సొల్యూషన్స్ కోసం జియో, ఎయిర్‌టెల్ కూడా ఎదురుచూస్తున్నాయి. మీరు నివసించే ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్పీడ్ బాగుంటే ఇది మీకు బెస్ట్ ప్లాన్ అవుతుంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)