Best Camera Phones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే - ఇన్‌ఫీనిక్స్ నుంచి పోకో దాకా!
Best Camera Smartphones Under Rs 15000: రూ.15 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ 5 ఫోన్లు చూసేయండి!
Best Camera Smartphones Under Rs 15K: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో కొత్త ఫోన్ కొనే వారు ఎవరైనా చెప్పే మొదటి రిక్వైర్‌మెంట్ కెమెరాలే. అన్ని ధరల విభాగాల్లో మంచి కెమెరాలు ఉన్న ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కెమెరాలు కూడా మన జీవితంలో భాగంగా మారిపోయాయి. ప్రస్తుతం మనం రూ.15 వేలలోపు బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏం ఉన్నాయో చూద్దాం.
ఇన్‌ఫీనిక్స్ నోట్ 30 5జీ (Infinix Note 30 5G)
108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఈ ఫోన్ ధర రూ.14,999గా ఉంది. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, ఏఐ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీలను ఇందులో అందించారు.
రియల్‌మీ 11ఎక్స్ 5జీ (Realme 11X 5G)
దీని ధర రూ.14,299గా ఉంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ పొర్‌ట్రెయిట్ లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
ఇన్‌ఫీనిక్స్ హాట్ 30 5జీ (Infinix Hot 30 5G)
ఈ ఫోన్ ధరను రూ.12,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో కూడా వెనకవైపు రెండు కెమెరాలనే అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఇన్‌ఫీనిక్స్ అందించింది.
మోటో జీ54 5జీ (Moto G54 5G)
దీని ధర రూ.13,999గా ఉంది. ఈ ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందించారు. సెల్ఫీలు తీసుకోవడానికి 32 మెగాపిక్సెల్ కెమెరా ముందువైపు చూడవచ్చు. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ కూడా ఇందులో ఉండటం విశేషం.
పోకో ఎక్స్5 5జీ (Poco X5 5G)
పోకో బ్రాండెడ్ బడ్జెట్ కెమెరా ఫోన్ కావాలంటే ఇది బెస్ట్. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను పోకో అందించడం విశేషం.
మరోవైపు రియల్‌మీ నోట్ 50 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే ఫిలిప్పీన్స్‌లో లాంచ్ అయింది. రియల్‌మీ లాంచ్ చేసిన మొదటి నోట్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లే అందించారు. రియల్‌మీ నోట్ 50 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. రియల్‌మీ నోట్ 50 ఫోన్ ధరను ఫిలిప్పీన్స్‌లో 3,599 ఫిలిప్పీన్స్ పెసోలుగా (సుమారు రూ.6,000) నిర్ణయించారు. ఇది 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర. మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!