By: ABP Desam | Updated at : 07 Mar 2022 05:32 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
అసుస్ 8జెడ్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. (Image: Asus)
Asus 8Z India Sale: అసుస్ 8జెడ్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 5.9 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై అసుస్ 8జెడ్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌ను అందించారు.
అసుస్ 8జెడ్ ధర, ఆఫర్లు (Asus 8Z Price)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.42,999గా నిర్ణయించారు. హారిజన్ సిల్వర్, ఆబ్సీడియన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ఐదు శాతం అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ లభించనుంది. అంటే రూ.2,000 వరకు తగ్గింపు లభించనుందన్న మాట.
అసుస్ 8జెడ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Asus 8Z Features)
అసుస్ 8జెడ్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత జెన్‌యూఐ 8 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్‌గా ఉంది. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఎన్‌టీఎఫ్ఎస్ ఫార్మాట్‌లో హెచ్‌డీడీ ద్వారా స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం ఉంది. మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్‌ను ఇందులో అందించలేదు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్‌ను అందించగా... దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్363 సెన్సార్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు సోనీ ఐఎంఎక్స్663 కెమెరాను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్/నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఇందులో అందించారు. అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇందులో ఉంది. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా... బరువు 169 గ్రాములుగా ఉంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Realme Pad X: రూ.15 వేలలోనే రియల్‌మీ ట్యాబ్లెట్ - భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ - ఎలా ఉందో చూశారా?
iPhone 14 Series: ఐఫోన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్ - చైనా మళ్లీ ముంచేసిందిగా!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Breaking News Live Updates: జాతీయ రాజకీయాల్లో మార్పు తథ్యం : సీఎం కేసీఆర్
PM Modi Hyderabad Tour: కేసీఆర్‌పై ప్రధాని మోదీ హాట్ కామెంట్స్- తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని జోస్యం
YSRCP Bus Yatra : బస్సుల్లోనే మంత్రులు - యాత్రలో కిందకు దిగేందుకు నిరాసక్తత !
CM KCR Meets Devegowda : మాజీ ప్రధాని దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ, జాతీయ రాజకీయాలపై చర్చ!