(Source: ECI/ABP News/ABP Majha)
Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!
యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల విషయంలో శాంసంగ్ క్లియర్‌గా లీడర్ స్థానంలోనే ఉంది. 2019లోనే శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్ల ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే త్వరలోనే యాపిల్ నుంచి శాంసంగ్ పోటీని ఎదుర్కునే అవకాశం ఉంది. అయితే యాపిల్ నేరుగా ఫోల్డబుల్ ఫోన్లు కాకుండా మొదట నోట్‌బుక్, ట్యాబ్లెట్స్‌ల్లో ఫోల్డబుల్ డివైస్‌లు రానున్నాయి.
2024లో యాపిల్ ఫోల్డబుల్ జర్నీని స్టార్ చేయనుందని శాంసంగ్‌కు సమాచారం వచ్చిందని వార్తలు వస్తున్నాయి. దక్షిణ కొరియాలో ఐఫోన్లు వాడే వినియోగదారులు శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్లకు మారుతున్నారని సర్వేలో తేలింది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2025 నాటికి 80 శాతం పెరుగుతుందని అంచనా.
2024లో ఫోల్డబుల్ ఐప్యాడ్ లాంచ్ కానుందని గతంలోనే వార్తలు వచ్చాయి. ఫోల్డబుల్ ఫోన్ కంటే ముందే ఫోల్డింగ్ ట్యాబ్లెట్ లాంచ్ చేయడం ద్వారా మార్కెట్‌ను తెలుసుకోవాలని యాపిల్ ప్లాన్ చేసినట్లు ఉంది. దీని కారణంగా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉండాలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది.
యాపిల్ మొదటి ఫోల్డబుల్ ఫోన్ ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. దీని ధర 2,500 డాలర్లుగా ఉండనుందని సమాచారం. అంటే మనదేశ కరెన్సీలో రూ.2 లక్షల వరకు ఉంది. ప్రస్తుతం ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ హైఎండ్ వేరియంట్ ధర 1,599 డాలర్లుగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఫోల్డబుల్ ఐఫోన్ ధర చాలా భారీగా ఉండనుందని చెప్పవచ్చు.
2022లో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ స్మార్ట్ ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా 1.6 కోట్ల యూనిట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్ ఎంత పెరుగుతుందో తెలుసుకోవచ్చు. కాబట్టి త్వరలోనే యాపిల్ కూడా ఈ మార్కెట్లోకి వస్తుందనుకోవచ్చు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram
View this post on Instagram