(Source: ECI/ABP News/ABP Majha)
Amazon Prime Video Ads: రేపటి నుంచి ప్రైమ్ వీడియోలో యాడ్స్ - డబ్బులు కట్టి కూడా యాడ్స్ చూడాలా బ్రో!
Amazon Prime Video: కొన్ని దేశాల్లో అమెజాన్ ప్రైమ్ ఉపయోగించే వారికి యాడ్స్ డిస్‌ప్లే కానున్నాయి.
Amazon Prime Video Plans: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు కంపెనీ యూజర్లకు ఫాస్ట్ డెలివరీ, ఆఫర్ సేల్స్‌కు ఎర్లీ యాక్సెస్, ప్రైమ్ వీడియో మొదలైన అనేక రకాల సౌకర్యాలను అందిస్తుంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ యూజర్ల విషయంలో మాత్రం పెద్ద మార్పు చేస్తోంది. రేపటి నుంచి అంటే జనవరి 29వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వినియోగదారులు ప్రైమ్ వీడియో కంటెంట్ స్ట్రీమ్ చేసేటప్పుడు యాడ్స్‌ను కూడా చూడటం ప్రారంభిస్తారు. అమెజాన్ వీడియో కంటెంట్‌ను మరింత విస్తృత పరచడానికి, ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించడానికి, దానిని మెరుగుపరచడానికి ఈ మార్పు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ప్రస్తుతం ఈ మార్పు భారతదేశంలో ఇంకా అమలులోకి రాకపోవడం విశేషం. రేపటి నుంచి అమెరికా, బ్రిటన్, జర్మనీ, కెనడాలో అమెజాన్ ప్రైమ్ ఉపయోగించే వారికి యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. ఆ తర్వాత ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, మెక్సికో, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలలో కూడా ప్రారంభమవుతుంది.
సబ్‌స్క్రిప్షన్ ధరలో మారిందా?
అమెజాన్ ప్రస్తుతం ప్లాన్‌ల సబ్‌స్క్రిప్షన్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే వినియోగదారులు యాడ్ ఫ్రీ కంటెంట్‌ను యాక్సెస్ చేయాలనుకుంటే అదనంగా 2.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత $14.99 నెలవారీ ప్లాన్ ధర $17.98 అవుతుంది అంటే మనదేశ కరెన్సీలో రూ. 1,494 అవుతుందన్న మాట. ఇది మనదేశంలో అమెజాన్ ప్రైమ్ వార్షిక సబ్‌స్కిప్షన్ ధర. యాడ్స్ ఫ్రీ కంటెంట్‌ని యాక్సెస్ చేయాలనుకునే వినియోగదారులు అమెజాన్ వెబ్‌సైట్‌కి వెళ్లి ప్రీ-ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.
అమెజాన్ ప్రైమ్‌కు సభ్యత్వం పొందడం ద్వారా వినియోగదారులు సేమ్ డే డెలివరీ, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ గేమింగ్, క్యాష్‌బ్యాక్, ప్రైమ్ రీడింగ్ ప్రయోజనాలను పొందుతారు. భారతదేశంలో అమెజాన్‌కు సంబంధించి నాలుగు ప్లాన్‌లను అందిస్తోంది.
1. రూ.299 ప్లాన్ - ఇది నెలవారీ ప్లాన్
2. రూ.599 ప్లాన్ - ఇది మూడు నెలల ప్లాన్
3. రూ.1,499 ప్లాన్ - ఇది వార్షిక ప్లాన్
4. రూ.799 ప్లాన్ - ఇది అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ (వ్యాలిడిటీ ఒక సంవత్సరం)
అమెజాన్ మినీ టీవీ ఫ్రీనే...
అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు మినీ టీవీ సేవలను కూడా అందిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఈ సర్వీసు ఉచితం. ఇందులో మీరు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, రొమాన్స్, కామెడీ మొదలైన వాటికి సంబంధించిన షోలను ఉచితంగా చూడవచ్చు.
మరోవైపు రియల్‌మీ నోట్ 50 స్మార్ట్ ఫోన్ ఫిలిప్పీన్స్‌లో ఇటీవలే లాంచ్ అయింది. రియల్‌మీ లాంచ్ చేసిన మొదటి నోట్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లేను కంపెనీ అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై రియల్‌మీ నోట్ 50 పని చేయనుంది. గతేడాది లాంచ్ అయిన రియల్‌మీ సీ51 తరహాలోనే ఈ స్మార్ట్ ఫోన్‌లో కొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!