News
News
X

Amazon iQOO Offer: ఈ 5జీ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్.. ఏకంగా రూ.5 వేల వరకు తగ్గింపు!

అమెజాన్‌లో ఐకూ 7 స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించారు.

FOLLOW US: 

ఐకూ తన 7 సిరీస్ ధరను భారీగా తగ్గించింది. ఏకంగా రూ.5 వేల వరకు దీని ధర తగ్గడం విశేషం. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐకూ 7 ధర
ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.31,990గా ఉండగా, ఇప్పుడు రూ.29,990కు తగ్గింది. అమెజాన్ కూపన్ అప్లై చేస్తే మరో రూ.3,000 తగ్గింపు లభించనుంది. ఇక 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,990 నుంచి రూ.31,990కు తగ్గింది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,990 నుంచి రూ.33,990కు తగ్గించారు. ఈ వేరియంట్లపై కూడా రూ.3,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. సాలిడ్ ఐస్ బ్లూ, స్టార్మ్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 

ఐకూ 7 ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ ఆపరేటింగ్ సిస్టంపై ఐకూ 7 పనిచేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. ఐకూ 7 రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉండగా, టచ్ శాంప్లింగ్ రేట్ 300 హెర్ట్జ్‌గా ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9 శాతంగా ఉంది. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌పై ఐకూ 7 పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను కంపెనీ ఇందులో అందించింది.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్598 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఐకూ 7లో ఉన్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అందించారు.

ఐకూ 7 బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 66W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ స్మార్ట్ ఫోన్ సపోర్ట్ చేయనుంది. జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 5జీ, 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించారు. ఐకూ 7 మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 196 గ్రాములుగానూ ఉంది.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 17 Jan 2022 02:57 PM (IST) Tags: Amazon Great Republic Sale iQOO 7 Offer iQOO 7 Price Cut iQOO Offer iQOO 7 Price Drop iQOO Amazon Offer Amazon Great Republic Sale Offer

సంబంధిత కథనాలు

Moto G72: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ ఫోన్ - అదిరిపోయే కెమెరా మొబైల్ లాంచ్ చేసిన మోటో!

Moto G72: రూ.15 వేలలోపే 108 మెగాపిక్సెల్ ఫోన్ - అదిరిపోయే కెమెరా మొబైల్ లాంచ్ చేసిన మోటో!

Lava Blaze 5G: ఇదీ ఇండియన్ బ్రాండ్ అంటే - దేశంలోనే అత్యంత 5జీ ఫోన్ లాంచ్ చేసిన లావా!

Lava Blaze 5G: ఇదీ ఇండియన్ బ్రాండ్ అంటే - దేశంలోనే అత్యంత 5జీ ఫోన్ లాంచ్ చేసిన లావా!

Covidfitbit: ఈ స్మార్ట్ వాచ్ చాలా స్పెషల్ - కోవిడ్ ను కూడా గుర్తించగలదు!

Covidfitbit: ఈ స్మార్ట్ వాచ్ చాలా స్పెషల్ - కోవిడ్ ను కూడా గుర్తించగలదు!

Oneplus Nord Watch: వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌లో 105 స్పోర్ట్స్ మోడ్స్ - అఫీషియల్‌గా ప్రకటించిన కంపెనీ

Oneplus Nord Watch: వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌లో 105 స్పోర్ట్స్ మోడ్స్ - అఫీషియల్‌గా ప్రకటించిన కంపెనీ

Spam Calls: స్పామ్ కాల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? జస్ట్ ఇలా చేస్తే మళ్లీ రావు!

Spam Calls: స్పామ్ కాల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? జస్ట్ ఇలా చేస్తే మళ్లీ రావు!

టాప్ స్టోరీస్

KCR National Party Live Updates: భారత్ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్, సాయంత్రం 4 గం.కు కేసీఆర్ ప్రెస్ మీట్

KCR National Party Live Updates: భారత్ రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్, సాయంత్రం 4 గం.కు కేసీఆర్ ప్రెస్ మీట్

KCR TRS Party: 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ ఇక తెరమరుగు, నేషనల్‌ హైవే ఎక్కిన కారు - గల్లీ టూ ఢిల్లీకి ప్రయాణం

KCR TRS Party: 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ ఇక తెరమరుగు, నేషనల్‌ హైవే ఎక్కిన కారు - గల్లీ టూ ఢిల్లీకి ప్రయాణం

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

Godfather Movie Review - 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?

The Ghost Review: ది ఘోస్ట్ రివ్యూ: ఘోస్ట్‌గా నాగార్జున హిట్ కొట్టారా?