News
News
వీడియోలు ఆటలు
X

Airtel New Prepaid Plans: కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్ - పూర్తిగా నెల వ్యాలిడిటీ - ఉచితంగా అమెజాన్ ప్రైమ్ కూడా!

ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ రెండు కొత్త ప్లాన్లు లాంచ్ చేసింది. అవే రూ.296, రూ.319 ప్రీపెయిడ్ ప్లాన్లు.

FOLLOW US: 
Share:

ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. అవే రూ.296, రూ.319 ప్లాన్లు. వీటిలో రూ.296 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా... రూ.319 ప్లాన్ వ్యాలిడిటీ పూర్తిగా ఒక నెల. జియో మనదేశంలో రూ.259 ప్లాన్‌ను లాంచ్ చేసిన అనంతరం ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను లాంచ్ చేయడం విశేషం. 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కనీసం ఒక్కటైనా అందుబాటులో ఉండాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఎయిర్‌టెల్ రూ.296 ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇక డేటా లాభాల విషయానికి వస్తే... మొత్తంగా 25 జీబీ డేటాను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. రోజువారీ పరిమితి లేదు.

ఎయిర్‌టెల్ రూ.319 ప్లాన్ లాభాలు
ఇక ఎయిర్‌టెల్ రూ.319 వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తున్నారు. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ 2 జీబీ డేటా అయిపోతే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది.

ఈ రెండు ప్లాన్లతో 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ కూడా లభించనుంది. దీంతోపాటు అపోలో 24×7 సర్కిల్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. దీంతోపాటు వింక్ మ్యూజిక్‌కు ఉచిత యాక్సెస్, ఉచిత హలో ట్యూన్స్ కూడా లభించనున్నాయి.

గత వారం రిలయన్స్ జియో రూ.259 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. దీని వ్యాలిడిటీ ‘కాలెండర్’ నెలగా ఉంది. దీని ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లభించనున్నాయి. వీటితో పాటు జియో యాప్స్‌కు యాక్సెస్ కూడా లభించనుంది.

ట్రాయ్ ఆదేశాల మేరకు వొడాఫోన్ ఐడియా కూడా రూ.327, రూ.337 ప్లాన్లను లాంచ్ చేసింది. వీటిలో రూ.327 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా, రూ.337 ప్లాన్ వ్యాలిడిటీ 31 రోజులుగా ఉంది. ఈ రెండు ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందించనున్నారు. ఇక రూ.327 ప్లాన్ ద్వారా 25 జీబీ, రూ.337 ప్లాన్ ద్వారా 28 జీబీ డేటాను అందిస్తున్నారు. వీటితో పాటు వీఐ మూవీస్, టీవీ యాప్‌కు యాక్సెస్ లభించనుంది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

Published at : 04 Apr 2022 04:14 PM (IST) Tags: Airtel Airtel New Plans Airtel New Prepaid Plans Airtel Rs 296 Plan Airtel Rs 319 Plan Airtel New Prepaid Plans Launched

సంబంధిత కథనాలు

BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!

BGMI: బీజీఎంఐ ప్లేయర్స్‌కు గుడ్ న్యూస్ - ఎప్పటి నుంచి వస్తుందో తెలిపిన కంపెనీ!

iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

iQoo Neo 8: ఐకూ నియో 8 వచ్చేసింది - రూ.30 వేలలోపే - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

BGMI: పబ్జీ (బీజీఎంఐ) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ - బ్యాన్ ఎత్తేశారా?

BGMI: పబ్జీ (బీజీఎంఐ) ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ - బ్యాన్ ఎత్తేశారా?

టాప్ స్టోరీస్

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

YS Jagan In Delhi: నీతి ఆయోగ్‌ 8వ పాలకమండలి సమావేశంలొ సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలివే

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక, వెంటనే ప్రమాణ స్వీకారం

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

NTR centenary celebrations : తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !

NTR centenary celebrations :  తొలి ఎన్నికల్లో ఎన్టీఆర్ సాధించిన విజయాల విశేషాలు ఇవిగో !