By: ABP Desam | Published : 21 Aug 2021 08:58 PM (IST)|Updated : 21 Aug 2021 08:58 PM (IST)
మహేంద్ర సింగ్ ధోనీ
నెల రోజుల ముందు నుంచే IPL సందడి మొదలైంది. ఇప్పటికే పలు జట్ల ఆటగాళ్లు UAE చేరుకున్నారు. క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ సెషన్లలో కూడా పాల్గొంటున్నారు. అన్ని జట్ల కంటే ముందు IPL - 2021 మిగిలిన సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ UAE చేరుకుంది. ఇప్పటికే ఆ జట్టు కరోనా జాగ్రత్తల నడుమ వరుస ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటోంది.
తాజాగా ప్రాక్టీస్ సెషన్లో ధోనీ పాల్గొన్న ఓ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న ధోనీ బంతిని సిక్సర్‌గా మలిచాడు. వీలైనన్ని ఎక్కువ బంతుల్ని బౌండరీ దాటించేందుకే ధోనీ ప్రయత్నిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీ సిక్సర్ వీడియో చూసిన నెటిజన్ల ఆనందానికి హద్దుల్లేవు. ధోనీ బ్యాట్ టు ఫాం, ధన్ ధనా ధన్ ధోనీ, ధోనీ ధన్ ధనా ధన్ అంటూ తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Also Read: Mohammed Siraj: హైదరాబాద్ కా షాన్... భాగ్యనగరంలో మహ్మద్ సిరాజ్ భారీ కటౌట్... వీడియో, ఫొటోలు వైరల్
ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసే వీడియోలను ప్రతి రోజూ చెన్నై సూపర్ కింగ్స్ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. సురేశ్ రైనా, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ చాహర్ తదితర ఆటగాళ్లు వార్మప్ సెషన్లో ఫుట్ బాల్ ఆడుతూ కనిపించారు.
LSG Vs RR: లక్నోపై రాజస్తాన్ ఘనవిజయం - రెండో స్థానానికి రాయల్స్ - పోటీ ఇవ్వలేకపోయిన సూపర్ జెయింట్స్!
LSG Vs RR: సమిష్టిగా రాణించిన రాజస్తాన్ బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకుండా భారీ స్కోరు - లక్నో టార్గెట్ ఎంతంటే?
CSK Vs GT Result: టేబుల్ టాప్ దిశగా గుజరాత్ - చెన్నై ఏడు వికెట్లతో ఘనవిజయం!
LSG Vs RR Toss: టాప్-2 కోసం పోరాటం - టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రాజస్తాన్!
CSK Vs GT: దారుణంగా విఫలమైన చెన్నై బ్యాటింగ్ దళం - వికెట్లున్నా షాట్లు కొట్టలేక - గుజరాత్ టార్గెట్ ఎంతంటే?
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?
NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ