By: ABP Desam | Updated at : 21 Aug 2021 08:02 PM (IST)
మహ్మద్ సిరాజ్
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో భారత్ ఘన విజయంలో కీలకపాత్ర పోషించిన హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్‌కు నగరవాసులు బ్రహ్మరథం పడుతున్నారు. రెండో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లో (4/94, 4/32) కలిపి మొత్తంగా 8 వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. ఈ పర్యటనలో సిరాజ్‌లో అభిమానులు కొత్తదనం చూశారు. వికెట్ తీసిన సమయంలో నోటిపై వేలు వేసుకుని చూపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలపై పలువురు పలు విధాలుగా కూడా స్పందించారు.
Siraj is a Superstar, Miyan getting all the love from the cricket fans. pic.twitter.com/aKG9l00181
— Johns. (@CricCrazyJohns) August 19, 2021
దీంతో కొద్ది రోజుల పాటు సిరాజ్ సెలబ్రేషన్స్ పై విమర్శలు వచ్చాయి. అప్పుడు ఆ విమర్శలపై సిరాజ్ స్పందించాడు. తన గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు, తన వల్ల ఏమీ కాదని అన్న వాళ్లను నోరు మూసుకో అన్నట్లుగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లు అతడే స్వయంగా ఓ మీడియా సమావేశంలో వివరించాడు. పలు చోట్ల ఈ సెలబ్రేషన్స్ కి నెగిటివ్ టాక్ వస్తే మాత్రం ఏంటి... మన సిరాజ్ ప్రదర్శనకు భాగ్యనగర వాసులు ఫిదా అయిపోయారు. సాధారణంగా ఎవరైనా పెద్ద సూపర్ స్టార్ల సినిమాలు విడుదలైనప్పుడు వారికి సంబంధించిన భారీ కటౌట్లు థియేటర్లు, పలు చోట్ల పెట్టి అభిమానులు సందడి చేస్తుంటారు.
Also Read: IPL: కోహ్లీ RCB జట్టులో ముగ్గురు కొత్త ఆటగాళ్లు... ఎవరి స్థానాల్లో ఎవరంటే?
ఇప్పుడు సిరాజ్‌కి అదే గౌరవం దక్కింది. హైదరాబాద్ పాత బస్తీలో ఓ మూడంస్థుల భవనానికి సిరాజ్ నోటి పై వేలు వేసుకుని సెలబ్రేషన్స్ చేసుకునేట్టు ఉన్న భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కటౌట్‌కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ' హైదరాబాద్ కా షాన్, సిరాజ్ కంగ్రాట్స్, సిరాజ్ ఈజ్ సూపర్ స్టార్, హైదరాబాద్ రజనీకాంత్' అంటూ క్యాప్షన్ జత చేశారు.
ఐదు టెస్టు మ్యాచ్‌ల్లో భాగంగా భారత్ X ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు లీడ్స్ వేదికగా ఈ నెల 25న ప్రారంభంకానుంది. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రా అవ్వగా, రెండో టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
MI vs SRH: లక్కు హిట్‌మ్యాన్ వైపే! టాస్ ఓడిన కేన్ మామ!
Tilak Varma: ట్విటర్లో తిలక్ వర్మ ట్రెండింగ్- సన్నీ గావస్కర్ సెన్సేషనల్ కామెంట్స్
IPL Playoffs Scenarios: ఆర్సీబీకి హార్ట్ అటాక్ తెప్పించిన పంత్ సేన! 'జస్ట్' ఓడిపోతే ప్లేఆఫ్స్‌కు LSG, RR!
SRH vs MI: సన్‌రైజర్స్ ఇయ్యాల గెలిస్తే బతికుంటరు! లేదంటే ఇంటికొస్తరు!
PBKS Vs DC Highlights: టాప్-4కు ఢిల్లీ క్యాపిటల్స్ - కీలక మ్యాచ్‌లో పంజాబ్‌పై విజయం!
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Karate Kalyani : కలెక్టర్ ఎదుట హాజరైన కరాటే కల్యాణి - పాప దత్తతపై యూటర్న్ !
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
LICIPO Memes : ఎల్ఐసీ షేర్లపై అతిగా ఆశలు పెట్టుకున్న వారికి షాక్ - ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి