అన్వేషించండి

US Open 2023: బోపన్న అన్‌స్టాపబుల్ - గ్రాండ్‌స్లామ్ చరిత్రలోనే కొత్త రికార్డు - మహిళల సింగిల్స్‌లో కోకో గాఫ్ సంచలనం

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ - 2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్న సరికొత్త చరిత్ర లిఖించాడు.

US Open 2023: భారత వెటరన్ టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న  యూఎస్ ఓపెన్‌లో అప్రతీహాత విజయాలతో సాగుతూనే సరికొత్త చరిత్ర సృష్టించాడు. 43 ఏండ్ల వయసులో  ఫైనల్ చేరిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు.  టెన్నిస్‌లో ఓపెన్ ఎరా  యుగం మొదలయ్యాక   గ్రాండ్‌స్లామ్ ఓపెన్ ఫైనల్ అత్యంత పెద్ద వయస్కుడిగా బోపన్న సరికొత్త చరిత్ర సృష్టించాడు.  బోపన్నకు ఇది  రెండో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం.

గురువారం రాత్రి  న్యూయార్క్‌లోని  లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియం వేదికగా జరిగిన  పురుషుల డబుల్స్‌ సెమీస్‌లో రోహన్ బోపన్న తన ఆస్ట్రేలియన్ సహచరుడు  మాథ్యూ ఎబ్డెన్ జోడీ.. 7-6 (7-3), 6-2 తేడాతో  ఫ్రెంచ్ ధ్వయం  నికోలస్ మహుత్, పెర్రీ హ్య‌ూగ్స్ హర్బర్ట్‌లను ఓడించి యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. 

ఈ గేమ్‌లో భాగంగా ఆట ఆరంభం కాగానే తొలి సెట్‌ను  4-2తో కోల్పోయిన  బోపన్న జోడీ.. టై బ్రేకర్‌లో పుంజుకుంది.  65 నిమిషాల పాటు సాగిన తొలి   గేమ్‌ను తక్కువ మార్జిన్‌తో నెగ్గింది. అయితే రెండో గేమ్‌లో మాత్రం ఈ జోడీ జూలు విదిల్చింది.  ఫ్రెంచ్ జోడీకి ఏమాత్రం అవకాశం చిక్కకుండా ఆటను వారి నుంచి దూరం చేసింది.  రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన బోపన్న - ఎబ్డెన్‌లు ఫైనల్‌‌కు దూసుకెళ్లారు. ఈ జోడీ  రెండో సెమీస్‌లో గెలుపొందిన  జో సలిస్‌బురి (యూకే) - రాజీవ్ రామ్ (యూఎస్ఎ)లను ఫైనల్‌లో ఢీకొననుంది. 

బోపన్న రికార్డు.. 

టెన్నిస్‌లో ఓపెన్ ఎరా ప్రారంభమయ్యాక  గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడుతున్న అత్యంత పెద్ద వయసున్న ప్లేయర్‌గా బోపన్న తన పేరును  చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించాడు.   ప్రస్తుతం బోపన్న వయసు  43 ఏండ్ల ఆరు నెలలు.   గతంలో ఈ రికార్డు కెనడాకు చెందిన  డానియల్ నెస్టర్ (43 ఏండ్ల 4 నెలలు) పేరిట ఉండేది. 2010లో బోపన్న ఇదే యూఎస్ ఓపెన్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఐసాముల్ హక్ ఖురేషితో కలిసి ఫైనల్ ఆడాడు. 

 

కోకో కేక.. 

అమెరికా యువ సంచలనం కోకో గాఫ్  సాధించింది. మహిళల ఓపెన్‌లో విలియమ్స్ సిస్టర్స్ తర్వాత  ప్రభ కోల్పోయిన అమెరికా టెన్నిస్‌లో  ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చిన కోకో గాఫ్.. తన కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడనుంది. గురువారం రాత్రి గాప్..   6-4, 7-5 తేడాతో పదో సీడ్  చెక్ ప్లేయర్ కరోలినా ముచోవాను ఓడించింది. తద్వారా గాఫ్..  1999 తర్వాత యూఎస్ ఓపెన్‌ ఫైనల్‌లో అడుగిడిన అత్యంత పిన్న వయస్కురాలైన  అమెరికా క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.  1999లో సెరెనా విలియమ్స్ 17 ఏండ్ల వయసులోనే  యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరింది.  ప్రస్తుతం గాఫ్ వయసు -19  సంవత్సరాలు. ఫైనల్‌లో ఆమె కీస్-సబలెంకల మధ్య జరిగే రెండో సెమీస్ పోరులో విజేతతో తలపడనుంది. 

 

ఇక పురుషుల సెమీస్ మ్యాచ్‌లు శనివారం  మొదలవుతాయి.  తొలి సెమీస్‌లో అమెరికాకే చెందిన బెన్ షెల్టన్.. సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‌ను ఢీకొంటాడు.  రెండో సెమీస్‌లో  స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్.. రష్యాకు చెందిన డానియల్ మెద్వెదెవ్‌తో తలపడతాడు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bhuvi Comeback Storm: భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
భారీగా పరుగులు ఇచ్చినా వెనకేసుకొచ్చిన మోర్కెల్.. భువీ పసలేని బౌలింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Gambhir Special Mantra: మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే
మ్యాచ్ కు ముందు గంభీర్ చెప్పిన మాటతో రగిలిపోయిన తిలక్ వర్మ.. కివీస్ పై సంచలన ఇన్నింగ్స్ వెనుక అసలు సీక్రెట్ ఇదే

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
మూడున్నర లక్షల అమ్మకాలు దాటిన Tata Altroz.. ధర, మైలేజీ, ఫీచర్లు తెలిస్తే మీకూ కొనాలనిపిస్తుంది!
ఈ కారుకు దేశవ్యాప్తంగా ఫుల్‌ డిమాండ్‌.. టాటా అమ్మే ప్రతి 3 కార్లలో ఒకటి ఇదే!
Hero Xtreme 250R Standard - Carbon మధ్య తేడాలివే! కేవలం రూ.14,000 ఖర్చుకు దక్కే అదనపు ఫీచర్లు ఏంటి?
Hero Xtreme 250R లో కొత్త వేరియంట్‌.. ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Pushpaka Vimanam Series OTT : లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
లిఫ్ట్‌లో ఒక్కసారి గతంలోకి వెళ్తే! - ఓటీటీలోకి టైమ్ ట్రావెల్ సిరీస్ 'పుష్పక విమానం'... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget