అన్వేషించండి

Wrestler Ravi Kumar enters final: రెజ్లింగ్‌లో ఫైనల్ చేరిన రవి దహియా... తొమ్మిదేళ్ల తర్వాత... గెలిస్తే స్వర్ణం... ఓడితే రజతం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా అద్భుతం చేశాడు. రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరుకున్నాడు. దీంతో భారత్‌కు కనీసం రజత పతకం ఖాయం చేశాడు. ప్రత్యర్థి తనపై ఆధిపత్యం చలాయిస్తున్న వేళ.. అనూహ్యంగా పుంజుకున్న రవి ‘విక్టరీ బై ఫాల్‌’ పద్ధతిలో పసిడి పోరుకు అర్హత సాధించాడు. హోరాహోరీ పోరులో 7-9 తేడాతో కజకిస్థాన్‌ ఆటగాడు సనయెవ్‌ నురిస్లామ్‌ను ఓడించాడు.

తొలి రెండు మ్యాచుల్లో ప్రత్యర్థులపై అద్భుతమైన విజయాలు అందుకున్నాడు రవి. కానీ, సెమీస్‌లో రవికి కఠినమైన సవాలే ఎదురైంది. నురిస్లామ్‌ మొత్తంగా ఆధిపత్యం చెలాయించాడు. తొలుత రిఫరీ నిర్దేశించిన 30 సెకన్లలో రవి పాయింటు తేకపోవడంతో ప్రత్యర్థి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అంతలోనే పుంజుకున్న రవి ప్రత్యర్థిని పడగొట్టి 2 పాయింట్లు సాధించి 2-1తో ఫస్ట్ పిరియడ్‌ను ముగించాడు.

ఇక కీలకమైన రెండో పిరియడ్‌ ప్రారంభంలో పోరు ఇద్దరి మధ్యా నువ్వా నేనా అన్నట్లు సాగింది. రవి రెండు కాళ్లను గట్టిగా పట్టుకున్న నురిస్లామ్‌ అతడిని మెలికలు తిరిగేలా చేశాడు. దీంతో వరుసగా 2, 2, 2, 2 పాయింట్లు సాధించాడు. దీంతో ప్రత్యర్థి నురిస్లామ్ 9-2తో అందనంత ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. మ్యాచ్ చూస్తున్న వాళ్లందరూ ఇక రవి గెలవడం కష్టమే అనుకున్నారు.

ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రవి ఫైనల్‌కి వెళ్లడం ఖాయం అనుకున్నారు. సరిగ్గా అప్పుడే అభిమానులు కోరుకున్నట్లు గానే అద్భుతం జరిగింది. వెంటనే పుంజుకున్న రవి ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. వెంటనే అతని ఖాతాలోకి 1, 2 ,2 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో ప్రత్యర్థి ఆధిపత్యాన్ని 7-9కి తగ్గించాడు. ఇప్పుడు కదా అసలు మజా. సర్వత్రా ఉత్కంఠ. చివరి నిమిషం వరకు పోటీలో ఎవరు గెలుస్తారా అని? సరిగ్గా అదే సమయంలో ప్రత్యర్థి నురిస్లామ్‌ గాయపడ్డాడు. ఇది మన రవికి కలిసొచ్చింది. ఇదే అదనుగా భావించిన రవి ప్రత్యర్థిని 30 సెకన్లపాటు పూర్తిగా లేవకుండా ఉక్కిరిబిక్కిరి చేసి రింగులోనే అడ్డుకోగలిగాడు. విక్టరీ బై ఫాల్‌ పద్ధతిలో ఫైనల్‌కు చేరుకున్నాడు. 

భారత్‌ నుంచి రెజ్లింగ్‌లో ఫైనల్‌ చేరిన రెండో ఆటగాడు రవి కుమార్‌ దహియా. అంతకు ముందు సుశీల్‌ కుమార్‌ 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకొని రజతం సొంతం చేసుకున్నాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో సుశీల్ కాంస్యం గెలిచాడు. 2012లో యోగేశ్వర్‌ కాంస్యం గెలిచాడు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత రవి రూపంలో మరో భారత రెజ్లర్‌ ఫైనల్‌ చేరాడు. 

టాప్ హెడ్ లైన్స్

Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
Cricket Legend Sir Garfield Sobers Demise: వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూత, ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల వీరుడి ప్రస్థానం! 
Milei Cabala Magic: వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్లనని అర్జెంటీనా ప్రెసిడెంట్ షాకింగ్ అనౌన్స్ మెంట్, ఆ మూఢ న‌మ్మ‌కాల కార‌ణంగానే ఈ నిర్ణ‌యం!
Hitman Records Alert: రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!
రోహిత్ ఖాతాలో అన్‌బిలీవబుల్ వరల్డ్ రికార్డులు.. హిట్‌మ్యాన్ క్రేజీ 264 రన్స్ వ‌న్డే ఇన్నింగ్స్ అమోఘం, టీమిండియా మాజీ కెప్టెన్ అరుదైన మైల్‌స్టోన్స్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget