అన్వేషించండి

Shubman Gill: కోహ్లీకి కింగ్ - సచిన్‌కు మాస్టర్‌బ్లాస్టర్ - మరి గిల్? - సునీల్ గవాస్కర్ పెట్టిన పేరేంటో తెలుసా?

శుభ్‌మన్ గిల్‌కు సునీల్ గవాస్కర్ ‘స్మూత్‌మన్ గిల్’ అని ముద్దు పేరు పెట్టాడు.

Sunil Gavaskar On Shubman Gill: భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తో చాలా ఆకట్టుకున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. శుభమాన్ గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఈ ఘనత సాధించారు.

అదే సమయంలో ఈ యువ ఆటగాడు తన బ్యాటింగ్‌తో భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ను బాగా ఆకట్టుకున్నాడు. సునీల్ గవాస్కర్ కామెంటరీలో ఉన్న సమయంలో టీమ్ ఇండియా యువ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌ను తరచుగా ప్రశంసించాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే సందర్భంగా సునీల్ గవాస్కర్ శుభ్‌మన్ గిల్‌కు ఒక పేరు పెట్టాడు. హైదరాబాద్ వన్డే మ్యాచ్‌లో వ్యాఖ్యానిస్తున్న సమయంలో సునీల్ గవాస్కర్ శుభ్‌మన్ గిల్‌కు 'స్మూత్‌మన్ గిల్' అనే పేరును ఇచ్చాడు. హైదరాబాద్ వన్డే తర్వాత సునీల్ గవాస్కర్ ‘నేను మీకు కొత్త మారుపేరు పెట్టాను’ అని శుభమాన్ గిల్‌తో చెప్పాడు. దీని తర్వాత శుభమాన్ గిల్ ముఖంలో చిరునవ్వు మెరిసింది. అలాగే ఈ పేరు తనకు నచ్చిందని యువ ఓపెనర్ తెలిపాడు.

హైదరాబాద్ వన్డేలో శుభ్‌మన్ గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ సాధించి భారీ రికార్డు సృష్టించాడు.

డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 23 ఏళ్ల 132 రోజుల్లో శుభ్‌మన్ ఈ ఘనత సాధించాడు. అతనికి ముందు ఈ రికార్డు ఇషాన్ కిషన్ పేరిట ఉంది. 24 ఏళ్ల 145 రోజుల వయసులో బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో, ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరు మూడో స్థానంలో ఉంది.

ఈ అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాక తనపై జట్టు సభ్యులు ప్రశంసల వర్షం కురిపించారు. 'అద్భుతం', 'అవుట్ ఆఫ్ ది వరల్డ్', 'చాబుక్', 'ప్యూర్ క్లాస్', 'ట్రీట్ టు వాచ్'... ఇవీ భారత క్రికెట్ జట్టు సభ్యులు శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీని వర్ణించడానికి ఉపయోగించిన పదాలు. 

మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్ కు డ్రెస్సింగ్ రూమ్ లో ఘన స్వాగతం లభించింది. జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది గిల్ చేత కేక్ కట్ చేయించారు. అతని స్పెషల్ ఇన్నింగ్స్ కు గుర్తుగా స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అలాగే జట్టు సహచరులు అతని ఇన్నింగ్స్ గురించి మాట్లాడారు.

'నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్సుల్లో ఇది ఒకటి. అతను డబుల్ సెంచరీ అందుకోకపోయినా ఇది ఉత్తమ ఇన్నింగ్సుల్లో ఒకటిగా నిలిచేది. అతను ఆడిన షాట్లు అద్భుతంగా ఉన్నాయి. సాధారణంగా నేను ఉద్వేగానికి లోనవను. అయితే గిల్ ఇన్నింగ్స్ చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి.' అని భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. 

టాప్ హెడ్ లైన్స్

IND VS NZ Result Update: :  టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
టీమిండియా స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. కివీస్ పై తొలి టీ20లో ఘ‌న విజ‌యం.. స‌త్తా చాటిన సంజూ, శ్రేయ‌స్, న‌మ‌న్,  
Mega Jersey Deal: MI జెర్సీపై ఇక ఆ ఐకానిక్ లోగో.. నైకీతో రిలయన్స్ స్పోర్ట్స్ చారిత్రక ఒప్పందం, 2027 సీజన్ నుంచి కొత్త కిట్లలో MI ఆటగాళ్ల మెరుపులు
MI జెర్సీపై ఇక ఆ ఐకానిక్ లోగో.. నైకీతో రిలయన్స్ స్పోర్ట్స్ చారిత్రక ఒప్పందం, 2027 సీజన్ నుంచి కొత్త కిట్లలో MI ఆటగాళ్ల మెరుపులు
Women U19 T20 World Cup Schedule: హ్యాట్రిక్ ట్రోఫీ వేటలో టీమిండియా.. ఐసీసీ అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, తొలి మ్యాచ్ ఎవ‌రితోనంటే..?
హ్యాట్రిక్ ట్రోఫీ వేటలో భారత అమ్మాయిలు.. ఐసీసీ అండర్ 19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల, తొలి మ్యాచ్ ఎవ‌రితోనంటే..?
Umpire Exchange Twist: రంజీ బరిలోకి ఆస్ట్రేలియా అంపైర్.. బీసీసీఐ సరికొత్త ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్
రంజీ బరిలోకి ఆస్ట్రేలియా అంపైర్.. బీసీసీఐ సరికొత్త ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఇండియన్ ఐడల్ సింగర్ పరాశర్ జోషికి ఆస్ట్రేలియాలో లక్కీ ఛాన్స్

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayashanti : రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
రాములమ్మ వ్యూహాత్మక మౌనం - ఎమ్మెల్సీ పదవి వచ్చినా కాంగ్రెస్‌లో విజయశాంతి ఎందుకు సైలెంట్?
Pawan Kalyan Chandrababu Naidu Meeting : నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
నో కన్వాయ్, నో సెక్యూరిటీ - చంద్రబాబు వద్దకు పవన్.. సుప్రీం తీర్పు వేళ సంచలన భేటీ!
AP Odisha Cyclone Alert: తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
తీవ్ర తుఫాను హెచ్చరిక - అక్టోబర్ 27-30 మధ్య కోస్తాంధ్ర-ఒడిశాపై ప్రతాపం - తెలంగాణలోనూ వర్షాలుంటాయా?
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
Embed widget