అన్వేషించండి

Sunil Chhetri Last Match: ముగిసిన ఓ వీరుడి శకం, సునీల్‌ ఛెత్రీ ! ఓ రియల్‌ హీరో

Sunil Chhetri: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ చరిత్రలోనూ ఓ శకం ముగిసింది. ఉబికి వస్తున్న కన్నీళ్ళు, కుటుంబ సభ్యులు, వేలాదిమంది అభిమానుల మధ్య సునీల్‌ ఛెత్రి తన ఇరవై ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

Sunil Chhetri's final game ends in 0-0 draw: భారత ఫుట్‌బాల్‌ చరిత్రలోనే కాక అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ చరిత్రలోనూ ఓ శకం ముగిసింది. భారత ఫుట్‌బాల్‌కు చిరునామాగా నిలిచి.. జట్టు సభ్యులకు పోరాటాన్ని నేర్పిన సునీల్‌ ఛెత్రి(Sunil Chhetri) శకం ముగిసింది. ఉబికి వస్తున్న కన్నీళ్ల మధ్య... కుటుంబ సభ్యులు.. వేలాదిమంది అభిమానుల మధ్య సునీల్‌ ఛెత్రి తన ఇరవై ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాలుగా ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు విజయాలను అందించిన ఓ వీరుడి విజయ ప్రస్థానం ఇక ముగిసింది. సునీల్ ఛెత్రీ భారత్‌ త‌ర‌ఫున ఆఖ‌రి మ్యాచ్ ఆడేశాడు. కోల్‌క‌తాలో కువైట్‌(India vs Kuwait Match)తో జ‌రిగిన ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 క్వాలిఫ‌య‌ర్స్‌( FIFA WC Qualifier) మ్యాచ్‌లో బరిలోకి దిగి ఛెత్రి చివరి మ్యాచ్‌ ఆడేశాడు. కువైట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ హోరాహోరీగా సాగి డ్రా అయింది. 

గార్డ్‌ ఆఫ్‌ హానర్‌
చివరి మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్‌ సభ్యులు సునీల్ ఛెత్రికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. సునీల్‌ ఛెత్రి చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కిక్కిరిసిన స్టేడియంలోని ప్రతీ అభిమాని లేచి నిలబడి ఛెత్రికి  స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ సమయంలో కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణ కనిపించింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం సునీల్ ఛెత్రి కన్నీరు మున్నీరయ్యాడు. ఛెత్రీ మాత్రమే కాకుండా స్టేడియంలోనే ఉన్న ఛెత్రీ తల్లిదండ్రులు, భార్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. 68000 సామర్థ్యమున్న సాల్ట్ లేక్ స్టేడియంలో ఛెత్రి తన తల్లిదండ్రులు ఖర్గా-సుశీల, భార్య సోనమ్ భట్టాచార్య, పలువురు అధికారులు, మాజీ ఆటగాళ్ల మధ్య అంతర్జాతీయ కెరీర్‌కు ఉద్వేగభరితంగా వీడ్కోలు పలికారు. భారత ఫుట్‌బాల్‌ జట్టు తరపున 151వ మ్యాచ్ ఆడేసిన తర్వాత  మైదానంలో సునీల్, సునీల్ అనే నినాదాలు ప్రతిధ్వనిస్తుండగా, ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ సునీల్‌ ఛెత్రీ మైదానాన్ని వీడాడు.  అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినా మరో రెండేళ్లపాటు సునీల్‌ ఛెత్రీని మైదానంలో చూడవచ్చు. వచ్చే ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ జట్టు తరపున ఆడేందుకు ఛెత్రీ ఒప్పందం చేసుకున్నాడు.
 
మీ వల్లే ఇదంతా: ఛెత్రీ
తన 19 ఏళ్ల అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ కెరీర్‌లో సహకరించిన వారందరికీ ఛెత్రీ ధన్యవాదాలు తెలిపాడు. టీవీల్లో చూసి నన్ను అభిమానించిన వారు... మైదానంలో నాకు మద్దతుగా నిలిచిన వారు... ఆటోగ్రాఫ్‌లు తీసుకున్న వారు, ఎప్పటినుంచో అండగా నిలిచినవారు అందరికీ ధన్యావాదాలు అని ఛెత్రీ తెలిపారు. మీరందరూ లేకుండా ఈ 19 ఏళ్ల ప్రయాణం సాధ్యం కాదని... సునీల్‌ ఛెత్రి భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా చెత్రీని సత్కరించింది.
 
రికార్డులకు మారుపేరు
పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (128), ఇరాన్ లెజెండ్ అలీ డేయ్ (108), అర్జెంటీనా స్టార్‌ లియోనెల్ మెస్సీ (108) తర్వాత 39 ఏళ్ల ఛెత్రీ 94 గోల్స్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన నాలుగో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget