Rishabh Pant: రిషభ్ పంత్‌కు ఆ ఆఫర్ ఇవ్వాలని మాజీ క్రికెటర్ డిమాండ్!!
Rishabh Pant: యువ బ్యాటర్ రిషభ్ పంత్‌ను ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఒకరు అంటున్నారు. ఆ స్థానంలో అతడు మెరుగ్గా రాణించగలడని అంచనా వేశాడు.
Rishabh Pant Wasim Jaffer thinks Rishabh Pant can blossom as an opener : యువ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఓపెనింగ్ చేయిస్తే బాగుంటుందని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ అంటున్నాడు. ఆ స్థానంలో అతడు మెరుగ్గా రాణించగలడని అంచనా వేశాడు. టీ20 ఫార్మాట్లో అతడు దుమ్మురేపుతాడని పేర్కొన్నాడు.
'టీ20ల్లో రిషభ్ పంత్‌తో ఓపెనింగ్ చేయించడం గురించి ఆలోచించాలి. అతడు కచ్చితంగా రాణించే స్థానం అదే' అని వసీమ్ జాఫర్ బుధవారం ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీసులో పంత్ ప్రదర్శనను బట్టి అతడిలా పోస్టు చేశాడు.
Indian think tank should think about opening with Rishabh Pant in T20Is. I think that's the spot where he can blossom. #ENGvIND
— Wasim Jaffer (@WasimJaffer14) July 6, 2022
రిషభ్ పంత్ ఇప్పటి వరకు 31 టెస్టులు ఆడాడు. 43.32 సగటుతో 2,123 పరుగులు చేశాడు. పది సెంచరీలతో అదరగొట్టాడు. అత్యధిక స్కోరు 150 నాటౌట్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశాల్లో అతడు శతకాలు బాదడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో పంత్ వరుసగా శతకం, అర్ధశతకం కొట్టేశాడు. దాంతో కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంకుకు ఎగబాకాడు. ఇక 2022లో ఆడిన ఐదు టెస్టుల్లో 66 సగటుతో 532 రన్స్ సాధించడం ప్రత్యేకం.
వాస్తవంగా టీ20 క్రికెట్ ద్వారానే రిషభ్ పంత్ వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో ధారాళంగా పరుగులు సాధించాడు. ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారడంతోనే అతడిని టీమ్‌ఇండియాలోకి తీసుకున్నారు. అయితే అంచనాల మేరకు అతడు పొట్టి ఫార్మాట్లో రాణించలేదు. 48 మ్యాచుల్లో 23.15 సగటు, 123 స్ట్రైక్‌రేట్‌తో 741 పరుగులు కొట్టాడు. మూడు అర్ధశతకాలు సాధించాడు. నిజం చెప్పాలంటే ఇది అతడి స్థాయికి తగిన ప్రదర్శన కాదు. నిమిషాల్లోనే మ్యాచుల గమనాన్ని మార్చే అతడు మరిన్ని పరుగులు చేయగలడు.
Also Read: 18 నెలల్లో కోహ్లీ రన్స్ కన్నా 25 రోజుల్లో బెయిర్‌స్టో కొట్టిందే ఎక్కువట!
Also Read: టాప్-5లోకి బుల్లెట్‌లా వచ్చేసిన పంత్! పడిపోయిన కోహ్లీ ర్యాంక్
Target has moved little farther but the focus is still intact. We will be back stronger. 🎯🏆👀🇮🇳 pic.twitter.com/6UFxWuCsIZ
— Rishabh Pant (@RishabhPant17) July 5, 2022