అన్వేషించండి

Virat Kohli vs Jonny Bairstow: 18 నెలల్లో కోహ్లీ రన్స్‌ కన్నా 25 రోజుల్లో బెయిర్‌స్టో కొట్టిందే ఎక్కువట!

Virat Kohli vs Jonny Bairstow: ఐదో టెస్టులో జానీ బెయిర్‌స్టో రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు కొట్టాడు. అతడి ఫామ్‌ను అడ్డం పెట్టుకొని విరాట్‌ కోహ్లీని ఇంగ్లాండ్‌ బార్మీ ఆర్మీ అనవసరంగా కవ్విస్తోంది.

Virat Kohli vs Jonny Bairstow: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. సిరీస్‌ 2-2తో సమమైంది. నిర్ణయాత్మక చివరి టెస్టులో ఇంగ్లిష్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో వరుసగా రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీలు కొట్టాడు. ఈ ఏడాది తిరుగులేని ఫామ్‌ కనబరుస్తున్నాడు. అయితే అతడి ఫామ్‌ను అడ్డం పెట్టుకొని విరాట్‌ కోహ్లీని ఇంగ్లాండ్‌ బార్మీ ఆర్మీ అనవసరంగా కవ్విస్తోంది. అవమాన పరిచేలా ట్వీట్లు పెడుతోంది.

గత 18 నెలల్లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) చేసిన పరుగుల కన్నా చివరి 25 రోజుల్లో జానీ బెయిర్‌ స్టో  (Jonny Bairstow) చేసినవే ఎక్కువని బార్మీ ఆర్మీ ట్వీట్‌ చేసింది. ఒక రకంగా అతడిని ఎగతాళి చేసింది! ప్రస్తుతం విరాట్‌ అంచనాలకు మించి రాణించడం లేదు. రెండున్నరేళ్లుగా ఒక్క సెంచరీ కొట్టలేదు. అతడి పేలవ ఫామ్‌ను గుర్తుచేస్తూ ఆంగ్లేయులు ట్వీట్లు చేయడం టీమ్‌ఇండియా అభిమానులను బాధిస్తోంది. ఒకప్పుడు ఇంగ్లాండ్‌ బౌలర్లను అతడెలా ఊచకోత కోశాడో మర్చిపోవద్దని ఫ్యాన్స్‌ గుర్తు చేస్తున్నారు. అతడు టన్నుల కొద్దీ పరుగులు చేసేటప్పుడు బెయిర్‌స్టో పరిస్థితేంటో చూసుకోవాలని ఫైర్‌ అయ్యారు.

Also Read: ఓటమికి తోడు టీమ్‌ఇండియాకు మరో షాక్‌! WTC ఫైనల్‌ అర్హతకు ప్రమాదం!

Also Read: బాజ్‌ బాలా? అదేంటో తెలియదంటున్న రాహుల్‌ ద్రవిడ్‌

విరాట్‌ కోహ్లీ 2011లో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 102 మ్యాచులాడి 49.53 సగటు, 55.68 స్ట్రైక్‌రేట్‌తో 8,074 పరుగులు సాధించాడు. 27 సెంచరీలు, 28 అర్ధ శతకాలు అందుకున్నాడు. ఇక ఇంగ్లాండ్‌ గడ్డపై 16 మ్యాచులాడితే 33.32 సగటు 51 స్ట్రైక్‌రేట్‌తో 1033 రన్స్‌ కొట్టాడు. భారత్‌లో 46 మ్యాచులాడి 61 సగటు, 59 స్ట్రైక్‌రేట్‌తో 3847 పరుగులు చేశాడు. 2016, 2017, 2018లో 1000+ రన్స్‌ చేశాడు. 2012 నుంచి 2019 వరకు కనీసం 600కు తక్కువ కాకుండా విజృంభించాడు. 2020లో 3 టెస్టులాడి 116, 2021లో 11 మ్యాచులాడి 536, 2022లో 4 టెస్టుల్లో 220 సాధించాడు.

జానీ బెయిర్‌స్టో 2012లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 87 టెస్టులాడి 37 సగటు, 57 స్ట్రైక్‌రేట్‌తో 5415 రన్స్‌ చేశాడు. 12 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు అందుకున్నాడు. విరాట్‌ చేసిన 27 సెంచరీలతో పోలిస్తే ఓ లెక్కే కాదు! భారత గడ్డపై జానీ 8 మ్యాచుల్లో 29 సగటు, 49 స్ట్రైక్‌రేట్‌తో 389 పరుగులు చేశాడు. విరాట్‌తో పోలిస్తే ప్రత్యర్థి గడ్డపై సగమైనా కొట్టలేదు. సొంతదేశం ఇంగ్లాండ్‌ గడ్డపై 48 టెస్టుల్లో 39 సగటు, 61 స్ట్రైక్‌రేట్‌తో 3076 పరుగులు సాధించాడు.  అంటే సొంతగడ్డపై కోహ్లీ కన్నా ఎక్కువ మ్యాచులాడి తక్కువ రన్స్‌ కొట్టాడన్నమాట. అతడి జీవితకాలంలో 1000+ రన్స్‌ కొట్టింది 2016లో మాత్రమే. 600+ రన్స్‌ చేసింది కేవలం నాలుగేళ్లే.  2016లో మూడు, 2017లో  ఒకటి, 2018లో 2 సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత 2022లో 6 కొట్టాడు. 

అందుకే బార్మీ ఆర్మీ ఒకసారి చరిత్రను చూసుకుంటే బెటరని కింగ్‌ కోహ్లీ అభిమానులు స్పందిస్తున్నారు. ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చాడంటే అతడినెవరూ ఆపలేరని సవాల్‌ చేస్తున్నారు. అనవసరంగా ఇలాంటి పోలికలు పెట్టొద్దని సూచిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget