అన్వేషించండి

ICC Test Rankings: టాప్-5లోకి బుల్లెట్‌లా వచ్చేసిన పంత్‌! పడిపోయిన కోహ్లీ ర్యాంక్‌

ICC Test Rankings టీమ్‌ఇండియా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్ పంత్‌ (Rishabh Pant) దూసుకుపోతున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో (ICC Test Rankings) టాప్‌-5లో అడుగుపెట్టాడు.

ICC Test Rankings Virat Kohli drops out of top-10 after Edgbaston failure, Rishabh Pant storms to No.5 : టీమ్‌ఇండియా వికెట్ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్ పంత్‌  (Rishabh Pant) దూసుకుపోతున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో (ICC Test Rankings) టాప్‌-5లో అడుగుపెట్టాడు. మరోవైపు కింగ్‌ కోహ్లీ ర్యాంకు మరింత దిగజారింది. టాప్‌-10లో చోటు కోల్పోయాడు. 13వ స్థానానికి చేరుకున్నాడు.

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచులో విరాట్‌ కోహ్లీ రెండు ఇన్నింగ్సుల్లో వరుసగా 11, 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక రిషభ్ పంత్‌ తొలి ఇన్నింగ్సులో 111 బంతుల్లోనే 146 రన్స్‌ కొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో 57తో అర్ధశతకం అందుకున్నాడు. చివరి 6 టెస్టు ఇన్నింగ్సుల్లో పంత్ రెండు శతకాలు, మూడు అర్ధశతకాలు బాదేశాడు. దాంతో ఆరు ర్యాంకులు మెరుగై కెరీర్‌ బెస్ట్‌ టాప్‌-5 అందుకున్నాడు.

Also Read: 18 నెలల్లో కోహ్లీ రన్స్‌ కన్నా 25 రోజుల్లో బెయిర్‌స్టో కొట్టిందే ఎక్కువట!

భీకరమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ (Joe Root) అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 923 రేటింగ్‌ పాయింట్లతో తిరుగులేని పటిష్ఠ స్థితిలో ఉన్నాడు. పైగా ఐదో టెస్టు రెండో ఇన్నింగ్సులో 142తో అజేయంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఐసీసీ అత్యధిక రేటింగ్‌ పొందిన టాప్‌-20 బ్యాటర్ల జాబితాలో ప్రవేశించాడు. రెండు ఇన్నింగ్సుల్లోనూ రెండు సెంచరీలు కొట్టిన జానీ బెయిర్ స్టో (Jonny Bairstow) 11 స్థానాలు ఎగబాకి 10వ ర్యాంకుకు ఎగబాకాడు. అతడు కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు.

బౌలింగ్‌ జాబితాలో ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. 900 రేటింగ్‌ పాయింట్లతో ఉన్నాడు. టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 842 రేటింగ్‌తో రెండో ర్యాంకులో ఉన్నాడు. పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా 828 రేటింగ్‌తో మూడులో కంటిన్యూ అవుతున్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడ్డూ, యాష్ వరుసగా 1, 2 స్థానాల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్‌ జాబితాలో మయాంక్‌ అగర్వాల్‌ 22, చెతేశ్వర్‌ పుజారా 26లో ఉన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Bail Petition: మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Mohan Babu Bail Petition: మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP DesamAttack on Allu Arjun House | అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి | ABP Desam8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Bail Petition: మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Mohan Babu Bail Petition: మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ -  అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు
Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
Sunny Leone: బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
బాలీవుడ్ నటి సన్నీలియోనికి నెలకు రూ.1000 - ప్రభుత్వ పథకం కింద అకౌంట్లోకి డబ్బులు, అధికారులు షాక్
Manu Bhaker News: మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
మను భాకర్ కు షాక్- ఖేల్ రత్న నామినేషన్లలో తన పేరు గల్లంతు, అశ్విన్ కోసం తమిళ ఎంపీ లాబీయింగ్!
Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌
హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌
Embed widget