![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
French Open 2022: మట్టికోర్టుపై వార్ వన్‌సైడ్ - రూడ్‌ను చిత్తు చేసిన నాదల్ - 14వ ఫ్రెంచ్ ఓపెన్ కైవసం!
రఫెల్ నాదల్ 14వ ఫ్రెంచ్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 6-3, 6-3, 6-0 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు.
![French Open 2022: మట్టికోర్టుపై వార్ వన్‌సైడ్ - రూడ్‌ను చిత్తు చేసిన నాదల్ - 14వ ఫ్రెంచ్ ఓపెన్ కైవసం! Rafael Nadal Defeats Casper Ruud in 2022 French Open Final French Open 2022: మట్టికోర్టుపై వార్ వన్‌సైడ్ - రూడ్‌ను చిత్తు చేసిన నాదల్ - 14వ ఫ్రెంచ్ ఓపెన్ కైవసం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/05/0c4723a229ec26717cbfe70af5923d5e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
క్లే కోర్టు కింగ్ రఫెల్ నాదల్ తన ఖాతాలో మరో ఫ్రెంచ్ ఓపెన్ వేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో కాస్పర్ రూడ్‌పై 6-3, 6-3, 6-0 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించాడు. ఇది రఫెల్ నాదల్‌కు 14వ ఫ్రెంచ్ ఓపెన్ కావడం విశేషం. ఓపెన్ శకంలో ఒకే ఆటగాడు ఒకే గ్రాండ్ స్లామ్‌ని ఇన్ని సార్లు గెలవడం ఇదే ప్రథమం.
మ్యాచ్‌లో నాదల్ ధాటికి ఎక్కడా ఎదురు లేకుండా పోయింది. మొదటి రెండు సెట్లను సులభంగా 6-3, 6-3తో గెలుచుకున్న నాదల్ చివరిసెట్‌లో విశ్వరూపం ప్రదర్శించాడు. రూడ్‌కు ఒక్క పాయింట్ కూడా గెలిచే అవకాశం ఇవ్వలేదు. ఏకంగా 6-0తో ఈ సెట్‌ను నాదల్ గెలుచుకున్నాడు. కేవలం రెండున్నర గంటల్లోనే ఈ మ్యాచ్ ముగిసిపోయింది. మొదటి గ్రాండ్ స్లామ్ గెలవాలనుకున్న రూడ్ కల అలానే మిగిలిపోయింది.
మొత్తంగా చూసుకుంటే ఇది నాదల్‌కు 22వ గ్రాండ్ స్లామ్. పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు గెలిచింది కూడా రఫెల్ నాదలే. నాదల్ తర్వాతి స్థానాల్లో రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిక్ ఉన్నారు. వీరిద్దరూ చెరో 20 గ్రాండ్ స్లామ్‌లు గెలిచారు.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)