Yusuf Dikec: హ్యాంగర్‌కి ఉన్న టీ షర్ట్ వేసుకొచ్చి మెడల్ కొట్టేశాడు- ప్రపంచాన్నే షేక్ చేసిన యూసుఫ్ డికెక్
Paris Olympics 2024: హ్యాంగర్‌కి ఉన్న షర్ట్ వేసుకొచ్చి ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని మెడలో వేసుకొని వెళ్లిపోయిన పెద్దాయన కథ ఇది. హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా అంటే సింపుల్‌గా వచ్చి ఆశ్చర్యపరిచాడు.
Viral News: ఒలింపిక్స్‌కి అంత క్రేజ్ ఎందుకంటే కొన్ని అన్ బిలీవబుల్ టాలెంట్స్‌ను చూసే అవకాశం దక్కుతుంది. అలాంటి టాలెంటెడ్ ప్లేయర్లను గమనించేందుకు ఇదొక్కటే విశ్వవేదిక. అలాంటి టాలెంటెడ్ ప్లేయరే నిన్నొకాయన ఒలింపిక్స్‌లో కనిపించారు. ఒలింపిక్స్ ఆడటానికి మీకు రకరకాల సరంజామా కావాలేమో నేను మాత్రం హ్యాంగర్ కున్న షర్ట్ వేసుకుని వచ్చేస్తా అన్నట్లు... ఎలా వచ్చామని కాదన్నాయా బుల్లెట్టు దిగిందా లేదా అన్నట్లు సినిమా హీరో మాదిరి సింపుల్ స్టైల్ అండ్ స్వాగ్‌తో సిల్వర్ మెడల్ కొట్టుకుని వెళ్లిపోయాడు.
ఆయన పేరే యూసుఫ్ డికెక్. టర్కీ దేశానికి చెందిన షూటర్ ఈయన. టర్కీ ఆర్మీలో సైనికుడిగా పనిచేసిన యూసుఫ్ వయస్సు 51 ఏళ్లు. 10మీటర్ల ఎయిర్ పిస్టర్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో పాల్గొని రజత పతకం సాధించారు యూసుఫ్. ఎందుకింత ప్రత్యేకం అయ్యారంటే సాధారణంగా షూటర్లు చాలా సరంజామాతో వస్తారు. కళ్లకు టార్గెట్ కనిపించేలా లెన్స్‌లు వాడతారు. బుల్లెట్స్ సౌండ్ వినపడకుండా దృష్టి మరలకుండా చెవులకు మంచి ఇయర్ ఫోన్స్ వాడతారు. హెడ్ సెట్స్, వైజర్‌లు కాస్ట్‌లీ కళ్లద్దాలు అబ్బో ఓ రేంజ్‌లో ఉంటుంది హడావిడి.
అలాంటిది ఈయనేదో రిటైర్డ్ హెడ్ మాస్టర్ లా జస్ట్ నార్మల్ కళ్లజోడు. చెవుల్లో రెండు ఇయర్ బడ్స్ అంతే. టీ షర్ట్ వేసుకుని ఓ ట్రాక్ ప్యాంట్‌తో వచ్చేశాడు. ఓ చేత్తో గన్ పట్టుకుని మరో చేతిని ప్యాంట్ జేబులో పెట్టుకుని ఏదో నీలోఫర్ కేఫ్‌లో ఛాయ్ తాగటానికి వచ్చిన సీనియర్ సిటిజన్‌లా చాలా కూల్‌గా నింపాదిగా వచ్చేసి పతకం కొట్టుకుని వెళ్లిపోవటం క్రేజీ అసలు. అందుకే కంటెంట్ ఉన్నోడి కటౌట్ చాలు ఉన్నట్లు ఈయన ఫోటో ఈ స్వాగ్ అండ్ స్టైల్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Also Read: పారిస్ ఒలింపిక్స్‌లో ఓడిపోయిన సింధు - పరాజయానికి కారణాలివే!
ఇప్పుడే కాదు గతంలో కూడా ఈయన ఆట తీరు మామూలుగా లేదు. చాలా సార్లు టర్కిష్ ఛాంపియన్‌గా జెండా ఎగరేశాడు. 2006లో నార్వేలోని రెనాలో జరిగిన CISM మిలిటరీ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 25 మీటర్ల సెంటర్-ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో యూసుఫ్ డికేక్ 597 పాయింట్లతో ప్రపంచ రికార్డునే బ్రేక్ చేశాడు. థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన 2012 ISSF ప్రపంచ కప్ ఫైనల్‌లో డికేస్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని ఎగరేసుకుపోయాడు.
2012 ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల ఈవెంట్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. కానీ పతకం సాధించకుండానే వెనుదిరిగాడు. క్రొయేషియాలోని ఒసిజెక్‌లో జరిగిన 2013 యూరోపియన్ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లలో డబుల్ గోల్డ్ మెడల్ సాధించాడు. హైదరాబాద్‌లో జరిగిన మిలటరీ వరల్డ్ గేమ్స్‌లో 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో రెండో స్థానంలో సాధించాడు.
Also Read: రైఫిల్ షూటింగ్‌లో స్వప్నిల్‌కు కాంస్యం; 3కి చేరిన భారత్ పతకాల సంఖ్య