అన్వేషించండి

MI vs SRH Match Highlights: పాండ్యా వికెట్లు తీస్తే, సూర్య వాతలు పెట్టాడు - ఉప్పల్‌లో మోత మోగిస్తామంటున్న కమిన్స్‌

Telugu News: ముంబైకి రెండు మ్యాచులు ఉన్నాయి కాబట్టి ట్రోలింగ్ సంగతి మర్చిపోయి పాండ్యా బ్యాటింగ్‌లోనూ ఇచ్చిపడేస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. అటు హైదరాబాద్‌ కూడా హోంగ్రౌండ్‌లో దుమ్మురేపాలి.

IPL 2024: ఛేజ్ చేయాల్సింది 174పరుగుల టార్గెట్. కళ్ల ముందు 31పరుగులకే 3 వికెట్లు పడిపోయాయి. సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లు ఓడిపోయారు. ఇప్పుడు హోం గ్రౌండ్ వాంఖడేలో ఓడిపోతే ఇంకా పరువు పోతుంది. కానీ ఇలాంటి అడ్డంకులు లేవి ఆ ఆటగాడిని అపలేకపోయాయి. రెచ్చిపోయాడు. టీ20 వరల్డ్ కప్‌లో తన సెలక్షన్‌కు న్యాయం చేసేలా.. ప్రపంచ నెంబర్ 1 టీ20 బ్యాటర్‌గా తన స్థాయిని నిరూపించుకునేలా దొరికిన బౌలర్‌ను దొరికినట్లు బాది పారేశాడు. 

సన్ రైజర్స్ అస్తమించేలా సూర్య కుమార్ యాదవ్ నిన్న అర్థరాత్రి ఉదయించిన తీరు ఇది. తిలక్ వర్మను అటు వైపు పెట్టుకుని మ్యాగ్జిమం స్ట్రైక్ తనే తీసుకుంటూ 360డిగ్రీస్ షాట్లతో రెచ్చిపోయాడు. 51 బంతుల్లో 12ఫోర్లు 6సిక్సర్లతో 102పరుగులు బాది సూపర్ సెంచరీ కొట్టడమే కాదు క్వాలిఫైయర్స్ ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. 

సూర్య ధాటికి 174పరుగుల లక్ష్యాన్ని 17.2ఓవర్లలోనే చేధించింది ముంబై ఇండియన్స్. అసలు మరో వికెట్టే కోల్పోకుండా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముంబై పాయింట్ల పట్టికలో గుజరాత్ ను వెనక్కి నెడుతూ 9వస్థానానికి చేరుకుంది. క్వాలిఫైయర్స్ ఛాన్సెస్ దాదాపుగా లేకపోయినా మరో 2 మ్యాచుల్లోనూ ముంబై గెలుపు కోసం ట్రై చేసే స్థాయిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పించాడు సూర్యకుమార్ యాదవ్. టీ20 వరల్డ్ కప్ ముందు సూపర్ ఫామ్ చాటుకుంటూ టీమిండియా ఫ్యాన్స్ ను సంతోష పెట్టాడు.

వికెట్లను వేటాడిన పాండ్యా 

చేతులారా చేసుకున్నాడో..లేదా కెరీర్ బాగుంటుంది కదా అని కమిట్ అయ్యాడో తెలియదు. ముంబైకి పాండ్యా కెప్టెన్ అవ్వటమో ఈ సీజన్‌లో వాళ్లకు పాపంలా మారిపోయింది. వాళ్లకే కాదు తన మాజీ జట్టు గుజరాత్ టైటాన్స్‌కి కూడా. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదోస్థానంలో ఉంటే..ఆడిన రెండుసీజన్లలో ఓ సారి ఛాంపియన్‌గా మరోసారి ఫైనలిస్ట్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలబడింది. ఈ రెండు టీమ్స్ ఫర్ ఫార్మెన్స్‌కి తప్పంతా పాండ్యాదేనన్నట్లుగా భారీ ట్రోలింగే సాగింది. 

వీటన్నింటినీ తట్టుుకుని నిలబడ్డాడు హార్దిక్. టీ20వరల్డ్ కప్ కు సెలెక్ట్ అయ్యానన్న ఉత్సాహమో ఏంటో తెలియదు కానీ రెండు మూడు మ్యాచులుగా రెచ్చిపోతున్నాడు. సన్ రైజర్స్‌తో మ్యాచ్‌లోనూ చాలా బాగా బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 33 పరుగులు ఇచ్చినా 3 వికెట్లు తీశాడు. సన్ రైజర్స్‌కి కీలకమైన ఆలౌరౌండర్లు నితీశ్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సన్‌లను ఈ ముంబై ఆల్ రౌండర్ పెవిలియన్‌కు పంపించాడు. పాండ్యా దూకుడుకు సన్ రైజర్స్ 124 పరుగులకే 7వికెట్లు కోల్పోయినా...ప్యాట్ కమిన్స్ బ్యాట్‌తో పోరాడటంతో సన్ రైజర్స్ 173పరుగులు చేయగలిగింది. మొత్తంగా టీ20 వరల్డ్ కప్‌కి కొద్ది రోజుల ముందు ఇలా ఫామ్ ను దొరబుచ్చుకోవటంతో టీమిండియా ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. 

మోత మోగిస్తామంటున్న ప్యాటీ

ముంబైతో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. సూర్యకుమార్ యాదవ్ విజృంభించి ఆడటంతో సన్ రైజర్స్ క్వాలిఫైయర్స్ ముందు అనూహ్యంగా ఓటమిని చవిచూసింది. దీంతో ప్లే ఆప్స్ సమీకరణాలు కాస్త కష్టంగా మారినా ఇప్పటికీ సన్ రైజర్స్ క్వాలిఫైయర్స్ కి వెళ్లటానికి చాలా మంచి ఛాన్సులే ఉన్నాయి. అందులో ప్రధానమైంది హైదరాబాద్ కి ఇక మిగిలిన మ్యాచులన్నీ హోం గ్రౌండ్ ఉప్పల్ లోనే.

హైదరాబాద్ సన్ రైజర్స్ కి మిగిలిన మూడు మ్యాచులకు హైదరాబాదే వేదిక కానుంది. లక్నో, గుజరాత్, పంజాబ్ ను సొంతగడ్డపైనే ఢీకొట్టనున్నారు ఆరెంజ్ ఆర్మీ. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఇక తనకు మిగిలి ఉన్న మూడు మ్యాచుల్లో ఏవైనా రెండు గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్ ఆడటం పక్కా. మూడూ గెలిచేస్తే ఇంకా హ్యాపీస్. ముంబై తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా అదే చెప్పాడు.

టీ20 అంటే ఓ అన్ ప్రెడిక్టబుల్ గేమ్ అన్న ప్యాటీ...సూర్యకుమార్ యాదవ్ రఫ్పాడించాడు కాబట్టి ఓడిపోయామన్నాడు. ఇంకో 20-30పరుగులు బోర్డు మీద ఉంటే బాగుండేదన్న కమిన్స్...ఇంకా మ్యాచులు మిగిలి ఉన్నాయని పైగా అవన్నీ హైదరాబాద్ లోనే కాబట్టి Hopefully A few More Fire Works అన్నాడు. అంటే ఈ ఐపీఎల్ లోను 277, 287 అంటూ సన్ రైజర్స్ ఎలా పరుగులు పెట్టించిందో అలా మిగిలిన మూడు మ్యాచుల్లోనూ ఒక్కోడికి మోత మోగించేయటమే అన్నమాట. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget