By: ABP Desam, Rama Krishna Paladi | Updated at : 12 Apr 2023 10:06 PM (IST)
జోస్ బట్లర్ ( Image Source : Twitter, IPL )
IPL 2023, CSK vs RR:
చెపాక్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అదరగొట్టింది. స్లో టర్నర్.. బ్యాటర్లకు అనుకూలించని పిచ్‌పై డిఫెండబుల్ స్కోరే చేసింది. 8 వికెట్ల నష్టానికి చెన్నై సూపర్ కింగ్స్‌కు 176 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఓపెనర్ జోస్ బట్లర్ (52; 36 బంతుల్లో 1x4, 3x6) హాఫ్ సెంచరీ కొట్టాడు. దేవదత్ పడిక్కల్ (38; 26 బంతుల్లో 5x4), రవిచంద్రన్ అశ్విన్ (30; 22 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. ఆఖర్లో షిమ్రన్ హెట్‌మైయిర్ (30*; 10 బంతుల్లో 1x4, 2x6) మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఆకాశ్ సింగ్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Innings Break!
— IndianPremierLeague (@IPL) April 12, 2023
5⃣2⃣ for @josbuttler & some valuable batting contributions from @devdpd07, @SHetmyer & @ashwinravi99 👌
2⃣ wickets each for @imjadeja, @TusharD_96 & Akash Singh 👍
The #CSK chase coming up shortly!
Scorecard ▶️ https://t.co/IgV0Ztjhz8#TATAIPL | #CSKvRR pic.twitter.com/xwTSM2RXLJ
మూమెంటమ్ విడవలేదు!
తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 11 వద్దే ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (10) ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (38) తెలివిగా బ్యాటింగ్ చేశాడు. బట్లర్‌తో కలిసి బౌండరీలు బాదాడు. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి రాయల్స్ 57/1తో నిలిచింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 41 బంతుల్లో 77 పరుగుల భాగస్వామ్యం అందించారు. స్కోరు వేగం పెంచే క్రమంలో భారీ షాట్ ఆడిన పడిక్కల్... రవీంద్ర జడేజా వేసిన 8.3వ బంతికి ఔటయ్యాడు. మరో రెండో బంతులకే కెప్టెన్ సంజూ శాంసన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అప్పటికి స్కోరు 88.
వికెట్లు పడుతున్నా రాయల్స్ దూకుడు తగ్గించలేదు. అశ్విన్, బట్లర్ కలిసి నాలుగో వికెట్‌కు 37 బంతుల్లో 47 పరుగుల భాగస్వామ్యం అందించారు. సీఎస్కే బౌలర్లపై యాష్ ఎదురుదాడి చేశాడు. కీలక సమయంలో అతడిని ఆకాశ్ సింగ్ ఔట్ చేశాడు. 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందున్న బట్లర్‌ను మొయిన్ అలీ పెవిలియన్ పంపించాడు. అయితే ఆఖర్లో విండీస్ వీరుడు హెట్‌మైయిర్ మంచి హిట్టింగ్‌తో స్కోరును 175/8కి చేర్చాడు.
WICKET!
— IndianPremierLeague (@IPL) April 12, 2023
A huge wicket for @ChennaiIPL as Moeen Ali strikes! 👌 👌
Jos Buttler departs after a well-compiled 52.
Follow the match ▶️ https://t.co/IgV0ZtiJJA#TATAIPL | #CSKvRR pic.twitter.com/jR5TfGOtvX
చెన్నై సూపర్ కింగ్స్ : డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, మహీశ్ థీక్షణ, ఎంఎస్ ధోనీ, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవదత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మైయిర్, ధ్రువ్ జురెల్, జేసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ సేన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్
For his yet another impressive show with the bat, @josbuttler becomes the top performer from the first innings of the #CSKvRR clash 👌 👌#TATAIPL | @rajasthanroyals
— IndianPremierLeague (@IPL) April 12, 2023
Here's his batting summary 🔽 pic.twitter.com/fThxyrj4ud
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
IPL 2023: ఈ ట్రోఫీ అతడికే అంకితం! ధోనీకి కాదన్న రుతురాజ్ గైక్వాడ్!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !