IND vs NZ: ఇలా అయితే కష్టమే - అర్ష్‌దీప్ సింగ్‌పై భారత మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్!
అర్ష్‌దీప్ సింగ్ పరుగులు ఇస్తుండటంపై భారత మాజీ పేసర్ బాలాజీ ఆందోళన వ్యక్తం చేశాడు.
India vs New Zealand Ranchi: భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ తొలి మ్యాచ్ రాంచీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మ్యాచ్ తర్వాత భారత జట్టు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ చాలా ట్రోల్స్‌కు గురి అయ్యాడు. తను ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. అర్ష్‌దీప్ సింగ్‌పై భారత మాజీ క్రికెటర్, బౌలర్ లక్ష్మీపతి బాలాజీ ఆందోళన వ్యక్తం చేశారు. అతను అర్ష్‌దీప్‌లోని లోపాలను ప్రస్తావించాడు. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ కూడా చాలా నో బాల్స్ కూడా విసిరాడు.
దీనిపై లక్ష్మీపతి బాలాజీ మాట్లాడుతూ, ‘అతని రిథమ్‌లో లోపం ఉంది. దీనిని త్వరగా పరిష్కరించాలి. ఇలానే తనపై తను విశ్వాసాన్ని కోల్పోతారు. దీంతో పాటు రిథమ్, మొమెంటం కూడా పోతుంది. అతను కేవలం తన లోటుపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడంపై పని చేయాలి.’
అర్ష్‌దీప్‌లోని లోటుపాట్ల గురించి బాలాజీ మాట్లాడుతూ, ‘రన్నింగ్ మార్క్స్ ఎక్కడ ఉన్నాయో అతనికి ఖచ్చితంగా తెలుసు. ఒత్తిడికి గురైన తర్వాత అతను స్పందించడం ప్రారంభిస్తాడు. అతను నో బాల్స్ విసిరే విధానం ఆందోళన కలిగించే విషయం. అతను ముందు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. మ్యాచ్‌లో బౌలింగ్ కోచ్ సహాయం తీసుకోవాలి. రాబోయే మ్యాచ్‌లలో అతను బాగా రాణిస్తాడని ఆశిస్తున్నాను.’ అన్నాడు.
ముఖ్యంగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సమర్థవంతంగా రాణించలేకపోయాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా 51 పరుగులు ఇచ్చాడు. కేవలం చివరి ఓవర్‌లో మాత్రమే 27 పరుగులు సమర్పించుకున్నాడు.
రాంచీలో జరిగిన తొలి టీ20లో టీమిండియాపై న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది. దీంతో సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
177 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మొదట్లోనే షాక్ తగిలింది. లోకల్ బాయ్ ఇషాన్ కిషన్ (4), శుభ్‌మన్ గిల్ (7), రాహుల్ త్రిపాఠి (0) ముగ్గురూ ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో భారత్ 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే నాలుగో వికెట్‌కు సూర్యకుమార్ యాదవ్ (47), హార్దిక్ పాండ్యా (21) 68 పరుగులు జోడించి ఆశలు రేకెత్తించారు.
అయితే వీరిద్దరూ కేవలం నాలుగు బంతుల వ్యవధిలోనే అవుటయ్యారు. అనంతరం వాషింగ్టన్ సుందర్ పోరాడినా తనకు మరో ఎండ్‌లో మద్దతు లభించలేదు. దీంతో భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులకు పరిమితం అయింది.
అంతకు ముందు న్యూజిలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే శుభారంభం అందించారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ 4.2 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. ఫిన్ అలెన్ 23 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక డ్వేన్ కాన్వే 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీని తర్వాత చాలా మంది బ్యాట్స్‌మెన్ ఎక్కువగా రాణించలేక పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే చివర్లో డేరిల్ మిచెల్ 30 బంతుల్లో అజేయమైన 59 పరుగుల ఇన్నింగ్స్‌తో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.