అన్వేషించండి

Hockey Men's Junior World Cup: ముగిసిన యువ భారత్‌ పోరాటం , జూనియర్‌ హాకీ వరల్డ్‌కప్‌లో పరాజయం

Hockey Men's Junior World Cup: జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత పోరాటం ముగిసింది. మూడోసారి కప్పు అందుకోవాలన్న యువ భారత్‌ ఆశలు కలలుగానే మిగిలిపోయాయి.

జూనియర్‌ హాకీ వరల్డ్‌ కప్‌లో భారత పోరాటం ముగిసింది. మూడోసారి కప్పు అందుకోవాలన్న యువ భారత్‌ ఆశలు కలలుగానే మిగిలిపోయాయి. అద్భుత విజయాలతో సెమీస్‌ వరకు వచ్చిన టీమిండియా... కీలకమైన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. సెమీఫైనల్లో పటిష్టమైన జర్మనీ ముందు నిలవలేక పోయింది. కప్పు కలను నెరవేర్చుకునే క్రమంలో అడుగు దూరంలోనే ఆగిపోయింది. పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో దారుణంగా విఫలమైన టీమిండియా.. సెమీస్‌లో 1-4తో జర్మనీ చేతిలో చిత్తుగా ఓడింది. 

ఆట ఆరంభమైన కాసేపటికే జర్మనీ ఆటగాడు బెన్‌ హస్బాచ్‌ గోల్‌ చేశాడు. దీంతో జర్మనీ 0-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ భారత ఆటగాడు సుదీప్‌ చిర్మకో 11 వ నిమిషంలో గోల్‌ సాధించి భారత్‌కు శుభారంభం అందించాడు. ఈ గోల్‌తో స్కోర్లు 1-1తో సమం అయ్యాయి. కానీ 30 వ నిమిషంలో జర్మనీ తరఫున బెన్‌ హస్బాచ్‌ మరో గోల్‌ చేయగా... పాల్‌ గ్లాండెర్‌ 41వ నిమిషంలో.. ఫ్లోరియన్‌ స్పెర్లింగ్‌ 58వ నిమిషంలో గోల్స్‌ చేశారు. ఈ గోల్స్‌తో జర్మనీ 4-1తో తిరుగులేని విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లు భారత్‌కు 12 పెనాల్టీ కార్నర్‌లు లభించగా ఒక్క కూడా గోల్‌ కూడా కొట్టలేకపోయారు. కానీ జర్మనీ తనకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలిచింది. జర్మనీ జట్టు ప్రత్యర్థికి బంతి దొరక్కుండా వ్యూహాత్మకంగా ఆడింది. ఈ ఏడాది జర్మనీతో ఆడిన ఐదో మ్యాచ్‌లోనూ భారత్‌కు ఓటమే ఎదురైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ముచ్చటగా మూడోసారి కప్పు సాధించాలన్న భారత కల కలగానే మిగిలిపోయింది. 

జూనియర్‌ వరల్డ్‌కప్‌ హాకీలో ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో పటిష్టమైన నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో యువ భారత్‌ ప్రదర్శన అబ్బురపరిచింది. ఆరంభంలో నెదర్లాండ్స్‌ దూకుడు ముందు తేలిపోయిన భారత యువ ఆటగాళ్లు కీలక సమయంలో పుంజుకుని 4-3తో విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో యువ భారత్‌ విజయం కష్టమని చాలామంది అంచనా వేయగా... బలమైన నెదర్లాండ్స్‌ను టీమిండియా ఓడించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణి ఎంత బలంగా ఉన్నా చొచ్చుకుపోయే సత్తా కలిగిన జట్టు నెదర్లాండ్స్‌ను ఓడించిన యువ భారత్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్‌లో యువ భారత్‌- నెదర్లాండ్స్‌ హోరాహోరీగా తలపడ్డాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన నెదర్లాండ్స్‌ అయిదో నిమిషంలోనే గోల్‌ చేసి టీమిండియాకు షాక్‌ ఇచ్చింది.

నెదర్లాండ్స్‌ స్ట్రైకర్‌ బోయర్స్‌ గోల్‌ చేశాడు. అనంతరం 16వ నిమిషంలో నెదర్లాండ్స్‌ మరో గోల్‌ చేసి 0-2 ఆధిక్యానికి దూసుకెళ్లింది. తొలి క్వార్టర్‌లో 0-2 గోల్స్‌తో నెదర్లాండ్స్‌ ముందుండడంతో యువ భారత్‌ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 34వ నిమిషంలో అదిత్య గోల్‌ చేయడంతో భారత్‌ ఖాతా తెరిచింది.
అనంతరం మరో రెండు నిమిషాలకో పెనాల్టీ కార్నర్‌ను అరైజిత్‌ సింగ్‌ గోల్‌గా మలచడంతో స్కోరు 2-2తో సమమయ్యాయి. కానీ 44వ నిమిషంలో నెదర్లాండ్స్‌ ఆటగాడు ఒలివర్‌ గోల్‌ చేయడంతో డచ్‌ జట్టు మళ్లీ 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత మరో ఎనిమిది నిమిషాలకు సౌరభ్‌ కుష్యాహా చేసిన అద్భుత గోల్‌తో భారత్‌ స్కోరును 3-3తో సమం చేసింది. ఇక సమయం ముగుస్తుందనుకున్న దశలో భారత కెప్టెన్‌ ఉత్తమ్‌సింగ్‌ గోల్‌ చేసి టీమిండియాను 4-3తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఈ గోల్‌ తర్వాత నెదర్లాండ్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా మరో గోల్‌ సాధించలేకపోయింది. ఓటమి ఖాయమనుకున్న దశలో జూనియర్‌ హాకీ జట్టు అద్భుత విజయంతో సెమీస్‌లోకి చేరింది. కానీ సెమీస్‌లో బలమైన జర్మనీ చేతిలో పరాజయం పాలైంది.

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Pak Asia Clash: సెమీస్ చేరినా టీమిండియా తగ్గేదేలే.. దాయాదిని చిత్తు చేసేందుకు ఉత్సాహంగా హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌
సెమీస్ చేరినా టీమిండియా తగ్గేదేలే.. దాయాదిని చిత్తు చేసేందుకు ఉత్సాహంగా హ‌ర్మ‌న్ ప్రీత్ సేన‌
ODI Series Talks: సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
సౌతాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌కు బీసీసీఐ స్కెచ్.. గిల్, గంభీర్ స్పెషల్ రిక్వెస్ట్‌తో స్పెష‌ల్ ఫోక‌స్
India In Semis : సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్..లీగ్ మ్యాచ్ లో హాంకాంగ్ పై బంపర్ విక్టరీ.. స్మృతి  రికార్డు సెంచరీ
సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్..లీగ్ మ్యాచ్ లో హాంకాంగ్ పై బంపర్ విక్టరీ.. స్మృతి  రికార్డు సెంచరీ
Smriti Record Century: మిథాలీ, మెగ్ లానింగ్ రికార్డ్ బ్రేక్.. హాంకాంగ్‌పై స్మృతి మంధాన విధ్వంసకర శతకంతో సరికొత్త ప్రపంచ రికార్డు
మిథాలీ, మెగ్ లానింగ్ రికార్డ్ బ్రేక్.. హాంకాంగ్‌పై స్మృతి మంధాన విధ్వంసకర శతకంతో సరికొత్త ప్రపంచ రికార్డు

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget