News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Tokyo Olympics Boxer Protest: రిఫరీపై కోపం... రింగ్ పై కూర్చొని బాక్సర్ నిరసన. టోక్సో ఒలింపిక్స్ లో షాకింగ్ సంఘటన

టోక్యో ఒలింపిక్స్ లో సంచలన సంఘటన చోటుచేసుకుంది. బాక్సింగ్ విభాగంలో ఓ క్రీడాకారుడిపై అనర్హత వేటు పడింది. తనపై వేటు వేయడంపై ఆ బాక్సర్ రింగ్ పై కూర్చొని నిరసన తెలిపాడు.

FOLLOW US: 
Share:

టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. హెవీవెయిట్‌ బాక్సింగ్‌ విభాగంలో ఫ్రాన్స్‌ బాక్సర్‌ మౌరాద్‌ అలీవ్‌ బాక్సింగ్‌ రింగ్‌పై నిరసన వ్యక్తం చేశాడు. ఈ రోజు ఉదయం బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లర్క్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడిన సందర్భంగా మౌరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో రెండో రౌండ్‌లో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిని ఉద్దేశపూర్వకంగా తలతో కొట్టి గాయపర్చాడని రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో న్యాయనిర్ణేతలు ఈ మ్యాచ్‌లో ఫ్రేజర్‌ క్లర్క్‌ను విజేతగా ప్రకటించారు. ఈ ఘటనపై ఫ్రాన్స్‌ బాక్సర్‌ బాక్సింగ్‌ రింగ్‌ వద్ద కూర్చొని నిరసన తెలిపాడు. తర్వాత ఆ దేశ అధికారులొచ్చి అతడితో మాట్లాడి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కానీ 15 నిమిషాల తర్వాత అతడు మళ్లీ తిరిగొచ్చి అక్కడే కూర్చొని తన అసహనం తెలియజేశాడు.

అంతకుముందు జరిగిన మ్యాచ్ తొలిరౌండ్‌లో క్లర్క్‌పై మౌరాదే ఆధిపత్యం చెలాయించాడు. ఐదుగురు న్యాయనిర్ణేతల స్కోర్లలో అతడికే ఎక్కువ పాయింట్లు వచ్చాయి. కానీ రెండో రౌండ్‌లో మరింత దూకుడుగా ఆడిన ఇద్దరూ హోరాహోరీగా పోటీపడ్డారు. ఈ క్రమంలోనే మౌరాద్‌ ప్రత్యర్థిపై పలుమార్లు తలతో దాడి చేశాడు. రిఫరీ అతడిని ఆపేందుకు ప్రయత్నించినప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో కాసేట్లో మ్యాచ్‌ ముగుస్తుందనుకునే సమయంలో మౌరాద్‌ అనర్హతకు గురయ్యాడు. ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన బ్రిటిష్‌ బాక్సర్‌.. ఆ సమయంలో తాను మౌరాద్‌ను స్థిమితంగా ఉండమని చెప్పినట్లు తెలిపాడు. అతడు తనపై దాడి చేశాడని, అది ఉద్దేశపూర్వకమో లేకా అలా జరిగిపోయిందో తనకు తెలియదన్నాడు. క్రీడల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని అభిప్రాయపడ్డాడు.

1988 సియోల్‌ ఒలింపిక్స్‌లోనూ ఇలాంటి ఆసక్తికరమైన నిరసన చోటుచేసుకుంది. అప్పుడు దక్షిణా కొరియా బాక్సర్‌ బైయున్‌ జంగ్‌ ఇల్‌పై రెండు పెనాల్టీ పాయింట్లు విధించడంతో అతడు నిరసన వ్యక్తం చేశాడు. అతడు సుమారు గంటపైనే రింగ్‌లో అలాగే ఉండిపోయి అభ్యంతరం తెలిపాడు. అది అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అదే బాక్సింగ్‌ ఈవెంట్‌లో మరోసారి ఓ బాక్సర్‌ నిరసన తెలపడం గమనార్హం.

టోక్యో ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నుంచి అనర్హుడుగా నిష్క్రమించిన తర్వాత ఫ్రెంచ్ సూపర్ హెవీవెయిట్ బాక్సర్ మొరాద్ అలీవ్ ప్రముఖంగా వార్తల్లో నిలిచాడు. ఒలింపిక్స్‌లో హెవీవెయిట్‌ బాక్సింగ్‌ విభాగంలో ఫ్రాన్స్‌ బాక్సర్‌ మొరాద్ అలీవ్ బ్రిటిష్‌ బాక్సర్‌ ఫ్రేజర్‌ క్లర్క్‌తో క్వార్టర్‌ ఫైనల్స్‌లో తలపడగా, రెండవ రౌండ్‌లో మొరాద్‌పై రిఫరీ అండీ ముస్టాచియో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిపై ఉద్దేశపూర్వకంగా తలతో దాడి చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని రిఫరీ తెలిపారు. 

Published at : 01 Aug 2021 07:36 PM (IST) Tags: Tokyo Olympics 2020 abp desam AP News MouradAliev SportsNews Boxer Protest

ఇవి కూడా చూడండి

Smriti Mandhana: మరో నాలుగు రోజుల్లో వేలం, స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

Smriti Mandhana: మరో నాలుగు రోజుల్లో వేలం, స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

IND vs AUS: టీమిండియా క్రికెట్‌ ఇంతే, ఇంకెంత కాలం ఇలా?

IND vs AUS: టీమిండియా క్రికెట్‌ ఇంతే, ఇంకెంత కాలం ఇలా?

PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!

PV Sindhu: ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది, రిలేషన్ షిప్ పై పీవీ సింధు రియాక్షన్!

BCCI Secretary Jay Shah: జైషాకు అరుదైన గౌరవం , క్రీడల్లో ఇప్పటివరకూ ఎవరికీ దక్కని అవార్డు

BCCI Secretary Jay Shah: జైషాకు అరుదైన గౌరవం , క్రీడల్లో ఇప్పటివరకూ ఎవరికీ దక్కని అవార్డు

IPL 2024 : ఐపీఎల్‌కు ఆర్చర్‌ దూరం , టీ20 ప్రపంచకప్‌ కోసమే!

IPL 2024 : ఐపీఎల్‌కు ఆర్చర్‌ దూరం , టీ20 ప్రపంచకప్‌ కోసమే!

టాప్ స్టోరీస్

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
×