అన్వేషించండి

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో భారతీయులు- రెండో స్థానం ఇండియాదే!

FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్ లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారట. అదేంటి అసలు ఇండియా ఫిఫా లో ఆడడం లేదు కదా. మరి ఈ రెండో స్థానం ఏంటి అనుకుంటున్నారా! తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.

FIFA World Cup 2022:  ఫిఫా ప్రపంచకప్ 2022 ఎడిషన్ ప్రస్తుతం క్వార్టర్స్ దశలో ఉంది. ఖతార్ లో జరుగుతున్న ఈ మెగా టోర్నీ ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా అలరిస్తోంది.  మైదానాలు ప్రేక్షకులతో నిండిపోతున్నాయి. దానికి తగ్గట్లే  గ్రూపు దశలోనూ, ప్రీ క్వార్టర్స్ లోనూ పలు సంచలనాలు నమోదయ్యాయి.క్రీడాకారులు తమ ఆటతీరుతో చూసేవారిని మెప్పిస్తున్నారు. 

ఇండియా నెం. 2

భారత్ ఫిఫా ప్రపంచకప్ లో ఆడడంలేదు. అయితేనేం ఇండియాలో ఫుట్ బాల్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఆటకు లక్షల్లో అభిమానులున్నారు. ఇవన్నీ ఊరికే చెప్పడంలేదు. ఖతార్ దేశమే చెప్తోంది. అవును ఇప్పటివరకు ఫిఫా మ్యాచులను చూడడానికి స్టేడియానికి వచ్చిన వారిలో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. ఫిఫా విడుదల చేసిన డేటా ప్రకారం 48 మ్యాచులు జరిగిన గ్రూపు దశలో ఆటను చూడ్డానికి 56, 893 మంది భారతీయులు మైదానాలకు వచ్చారట. ఇది రెండో స్థానం. సౌదీ అరేబియా 77, 106 మందితో మొదటి స్థానంలో ఉంది. యూఎస్ ఏ (36,236), యూకే (30, 719) మెక్సికో (25, 533), లు మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. 

ఖతార్ నివేదిక ప్రకారం మొత్తం గ్రూప్ దశ మ్యాచులను 2.45 మిలియన్ల మంది స్టేడియాలకు వచ్చి వీక్షించారు. అంటే 96 శాతం ఆక్యుపెన్సీ ఉంది. ఇది 2018లో రష్యాలో జరిగిన ఫిఫా ఎడిషన్ కంటే ఎక్కువ. అలాగే లుసైల్ మైదానంలో అర్జెంటీనా- మెక్సికో మ్యాచ్ చూడ్డానికి మైదానానికి 88, 966 మంది హాజరయ్యారు. 1994 ఫైనల్ తర్వాత ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక హాజరు. 

ఇది మాకు మరపురాని ప్రపంచకప్

'ఇది చిరస్మరణీయమైన ప్రపంచకప్. మైదానం లోపల, వెలుపల అద్భుతమైన గణాంకాలు నమోదయ్యాయి. అభిమానులు స్టేడియాల్లో అందమైన సమయాలను గడుపుతున్నారు. ప్రపంచం మొత్తం టీవీల్లో ఆటను చూస్తూ ఎంజాయ్ చేస్తోంది.' అని ఫిఫా ప్రపంచకప్ సీఓఓ కోలిన్ స్మిత్ అన్నారు. 'కొందరు సవాలుగా భావించిన దాన్ని మేం అవకాశంగా చూశాం. జట్లు, మీడియా, ప్రేక్షకులు ఫుట్ బాల్ ను ఆనందిస్తున్నారు. అత్యాధునికి మౌలిక సదుపాయాలు, సంపూర్ణ కార్యాచరణ, ప్రణాళికల ద్వారా మేం సందర్శకులను ఆకట్టుకుంటున్నాం అని తెలిపారు. ఇది వారికి మరపురాని ప్రపంచకప్ గా మిగిలిపోతుందని' స్మిత్ అన్నారు. 

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget