MS Dhoni News: సెలెక్టర్ల అసమర్థత వల్ల ఏడుగురు క్రికెటర్లు నష్టపోయారు.. ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించకుండా తప్పు చేశారు.. మాజీ క్రికెటర్ ఫైర్
2012వ సంవత్సరం భారత టెస్టు క్రికెట్ కి పీడకలలాంటింది. ఆసీస్, ఇంగ్లాండ్ పర్యటనల్లో వరుసగా 4-0తో వైట్ వాష్ కు గురైంది. దీంతో చాలామంది క్రికెటర్లు టీమిండియా నుంచి బయటకు వెళ్లిపోయారు.

Yograj Singh Comments: భారత దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్ అయ్యాడు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటే ఒంటి కాలి మీద లేచే ఆయన, తాజాగా మాజీ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2011 వన్డే ప్రపంచకప్ విజయం తర్వాత ధోనీ, సెలెక్టర్ల కారణంగా కొంతమంది క్రికెటర్ల జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయని పేర్కొన్నాడు. వన్డo ప్రపంచకప్ గెలవడంతో కీలకపాత్ర పోషించిన ఆ ఆటగాళ్లు, తర్వాతి ఎడిషన్ వచ్చే సరికి కనుమరుగయ్యారని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఏడుగురు క్రికెటర్లు గౌతం గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ ల కెరీర్ అప్పటి సెలెక్టర్ మోహిందర్ అమర్ నాథ్ అసమర్థత వల్ల అన్ని ఫార్మాట్లలోనూ అటకెక్కిందని విమర్శించాడు.
Latest UY | Sports
— UnreadWhy (@TheUnreadWhy) June 16, 2025
Yograj Singh’s Explosive Claims on BCCI’s 2011 WC Fallout
Yograj Singh, Yuvraj Singh’s father, dropped a bombshell on June 16, 2025, accusing the BCCI selectors of ruining the careers of seven Indian cricket icons, including Gautam Gambhir, Rahul Dravid,… pic.twitter.com/XhXmyVexYG
బీసీసీఐ ప్రెసిడెంట్ ఒత్తిడితో..
నిజానికి 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత ట్రాన్షిషన్ దశలో ఉన్న టీమిండియా టెస్టుల్లో వరుస ఓటములు ఎదుర్కొంది. ముఖ్యంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో 4-0తో వైట్ వాష్ కు గురైంది. ఆ కాలంలో ఏకంగా ఐదు సిరీస్ లన కూడా కోల్పోయింది. ఆ సమయంలో గౌతం గంభీర్, యువరాజ్, భజ్జీ, జహీర్ ఖాన్ కెరీర్ మసక బారిందని, అప్పటి టెస్టు కెప్టెన గా ఉన్న ధోనీని కూడా మారుస్తారని లీకులు వచ్చాయి. అయితే అప్పటి బోర్డు ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసస్ ఒత్తిడితో చీఫ్ సెలెక్టర్ అమర్ నాథ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దీనిపై 2012లోనే అమరనాథ్ బహిరంగంగానే ప్రశ్నించాడు. అయితే చీఫ్ సెలెక్టర్ గా కేవలం ఏడాది కాలం పాటు మాత్రమే అమర్ నాథ్ బాధ్యతలు నిర్వర్తించాడు. తన హాయంలో బోర్డు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని అసంతృప్తిని వెల్లగక్కాడు.
అమర్ నాథ్ పై విసుర్లు..
జట్టు వరుస ఓటములు పాలవుతున్నప్పటికీ, సరైన నిర్ణయాలు తీసుకోలేక చాలామంది కెరీర్ మసకబారడానికి అమర్ నాథ్ కారణమయ్యాడని పేర్కొన్నాడు. ఆయన అసమర్థత వల్లే టీమిండియా చాలా నష్టపోయిందని పేర్కొన్నాడు. నిజానికి 2012లో ధోనీ కెప్టెన్సీ పోవాల్సి ఉన్నప్పటికీ బోర్డు జోక్యంతో నిలిచిందని విశ్లేషకులు చెబుతారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆస్ట్రేలియా పర్యటనలో ధోనీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, కోహ్లీ పగ్గాలు చేపట్టాడు. అలాగే 2017లో వైట్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో, కోహ్లీ వారసుడిగా బాధ్యతలు చేపట్టాడు. ఇక 2015 వన్డే ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్..క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై టోర్ని నుంచి నిష్క్రమించింది. ఆ ఏడాది ఆసీస్ విజేతగా నిలిచింది.




















