Ind Vs Eng Test Series Updates: బుమ్రాను ఆ టెస్టుల్లో మాత్రమే ఆడించండి.. అప్పుడే ఎఫెక్టివ్ గా ఉంటుంది.. మాజీ క్రికెటర్ వ్యాఖ్య
2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ను ఈ టూర్ తో ఇండియా ప్రారంభిస్తుంది. ఈ సిరీస్ లో 5 టెస్టులను ఇంగ్లాండ్ తో ఆడనుంది. భారత 37వ టెస్టు కెప్టెన్ గా గిల్ ఈ సిరీస్ ద్వారా గుర్తింపు పొందుతాడు.

Jasprit Bumrah News: ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆ టీమ్ తో తొలి టెస్టు ఆడేందుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికీ కూడా ప్లేయింగ్ లెవన్ పై ఎలాంటి అప్డేట్ లేదు. సాధారణంగా టాస్ వేసిన తర్వాత మాత్రమే ప్లేయింగ్ లెవన్ పై స్పష్టత వస్తుంది. ఈసారి కూడా అదే తరహాను టీమిండియా ఫాలో కావచ్చు. అయితే పర్యటన ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పినట్లుగా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ లో కేవలం 3 మ్యాచ్ లు మాత్రమే ఆడే అవకాశముంది. అయితే తన ఏయే టెస్టుల్లో బరిలోకి దిగాలనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతోంది. తాజాగా దినిపై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ వ్యాఖ్యానించాడు. ఫలానా టెస్టుల్లో ఆడించాలని టీమిండియాకు సూచించాడు..
ఆ టెస్టులో విశ్రాంతి..
బుమ్రాకు తొలి టెస్టులో విశ్రాంతినిచ్చి, తర్వాత జరిగే రెండు టెస్టుల్లో ఆడిస్తే బాగుంటుందని హాగ్ తెలిపాడు. ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని కూడా వివరించాడు. తొలి టెస్టులో బుమ్రా లేకపోవడం వల్ల అతనికి తగినంత విశ్రాంతి లభిస్తుందని, తొలి టెస్టు ఫలితంతో రెండో టెస్టులో బరిలోకి ఎలా ఆడాలనేదనిపై ఒక స్పస్టత వస్తుందని పేర్కొన్నాడు. ఇక బుమ్రా వరుసగా రెండు టెస్టుల్లో బరిలోకి దిగితే ఇంగ్లాండ్ జట్టు ఒత్తిడిలో పడిపోతుందని, దాంతో టీమిండిమా పని కాస్త సులభం అవుతుందని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత మిగిలిన రెండు టెస్టుల్లో ఏ టెస్టుల్లో ఆడించాలనేది టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయం అప్పటి పరిస్థితులను బట్టి తీసుకోవాలని సూచించాడు.
ఫిట్ నెస్ సమస్యలతో..
వెన్ను నొప్పి కారణంగా బుమ్రా కెరీర్ కు బ్రేక్ పడింది. చాలా కాలం పునరావసం తర్వాత తను అంతర్జాతీయ క్రికెట్లోకి బరిలోకి దిగాడు. గతేడాది ప్రారంభమైన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో ఆడి సత్తా చాటాడు. 32 వికెట్లతో ఆసీస్ ను వణికించాడు. అయితే ఐదో టెస్టులో గాయపడి దాదాపు నాలుగు నెలలపాటు క్రికెట్ కు దూరమయ్యాడు. అందుచేత అతనిపై వర్క్ లోడ్ పడకుండా, తెలివిగా కొన్ని మ్యాచ్ లలో ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ టూర్ లో మూడు మ్యాచ్ ల్లో మాత్రమే బుమ్రా ఆడనున్నాడు. ఇక ఈ టూర్ ద్వారా భారత 37వ టెస్టు కెప్టెన్ గా శుభమాన్ గిల్ నిలవనున్నాడు. రోహిత్ శర్మ నుంచి తను వారసత్వాన్ని స్వికరించనున్నాడు. రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి స్థానాలను భర్తీ చేయాలని పలువురు క్రికెటర్లు తహతహ లాడుతున్నారు. ముఖ్యంగా కరుణ్ నాయర్ లాంటి వెటరన్ క్రికెటర్ చాలా కాలం తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా యూజ్ చేసుకుని, జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావిస్తున్నాడు. అలాగే మరికొంత మంది తమ లక్కును పరీక్షించుకోనున్నారు.




















