అన్వేషించండి

Netherlands vs South Africa: ప్రపంచకప్‌లో పెను సంచలనం, నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు

ODI World Cup 2023: వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణించిన డచ్‌ జట్టు... బాల్‌తో అద్భుతం చేసింది.

 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. అది అలాంటి ఇలాంటి సంచలన కాదు. వరుస విజయాలతో ఊపు మీదున్న దక్షిణాఫ్రికాపై పసికూన నెదర్లాండ్స్‌ ఘన విజయం సాధించింది. రెండు విజయాలతో ప్రపంచకప్‌ ఫేవరెట్లలో ఒకటిగా మారిపోయిన ప్రొటీస్‌ను వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయిన నెదర్లాండ్స్‌ మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణించిన డచ్‌ జట్టు... బాల్‌తో అద్భుతం చేసింది. మొదట అనుకున్న దానికంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ప్రొటీస్‌ జట్టు ముందుంచిన నెదర్లాండ్స్‌... సఫారీ జట్టు బ్యాటర్లను  ఏ దశలోనూ క్రీజులో కుదురుకోనివ్వలేదు. వర్షం వల్ల 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. అనంతరం 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు 207  పరుగులకే కుప్పకూలింది. దీంతో 38 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి ఈ ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదు చేసింది. సమష్టిగా రాణించిన నెదర్లాండ్స్ బౌలర్లు ప్రొటీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. 


టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా... నెదర్లాండ్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అరంభంలో ప్రొటీస్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. వరుస విరామాల్లో వికెట్లు తీసి నెదర్లాండ్స్‌పై ఒత్తిడి పెంచారు. ప్రారంభం నుంచి నెదర్లాండ్స్‌ను కట్టడి చేసిన సఫారీ బౌలర్లు చివర్లో ధారళంగా పరుగులు ఇచ్చారు. దీంతో 200 పరుగుల మార్క్‌ అయినా దాటుందన్న అన్న దశ నుంచి కోలుకొని నెదర్లాండ్స్ 245 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. నెదర్లాండ్స్‌ సారధి స్కాట్ ఎడ్వర్డ్స్ ఒంటరి పోరాటంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. చివరి వరకూ అజేయంగా ఉన్న ఎడ్వర్డ్స్‌ 69 బంతుల్లో 78 పరుగులు చేశాడు. ఎడ్వర్డ్స్‌ తప్ప మరే నెదర్లాండ్స్‌ బ్యాటర్‌ కనీసం 30 పరుగుల మార్కును దాటలేకపోయాడు. చివర్లో ఆర్యన్‌ దత్త్ మెరుపులు మెరిపించాడు. కేవలం తొమ్మిది బంతుల్లోనే మూడు సిక్సర్లు బాదిన ఆర్యన్‌.... 23 పరుగులు చేశాడు. ఎడ్వర్డ్స్‌ తర్వాత ఎక్కువ పరుగులు ఎక్స్‌ ట్రాల రూపంలో నెదర్లాండ్స్‌కు దక్కాయి. ఈ మ్యాచ్‌లో ప్రొటీస్‌ బౌలర్లు 32 పరుగులు ఎక్స్‌ ట్రాల రూపంలో ఇచ్చారు.


 నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌ ఆరంభం నుంచి ఒడుదొడుకులకు లోనైంది. భారత సంతతి  ఆటగాడు విక్రమ్‌జిత్‌ను అవుట్‌ చేసి రబాడ నెదర్లాండ్స్ బ్యాటింగ్‌ పతనాన్ని మొదలుపెట్టాడు. నెదర్లాండ్స్‌ 24 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ కుదటపడుతున్న సమయంలో 40 పరుగుల వద్ద కోలిన్ అకెర్‌మాన్‌ను కాట్జే అవుట్‌ చేయగా... బాస్ డి లీడేను రబాడ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కానీ సారధి ఎడ్వర్డ్స్‌ మాత్రం పోరాటం ఆపలేదు. ఎడ్వర్డ్స్‌కు మంచి సహకారం అందించిన రోలోఫ్ వాన్ డెర్ మెర్వే 29 పరుగులు చేశాడు. అసలు నిర్ణీత ఓవర్లు నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌ చేస్తున్న అన్న స్థితి నుంచి ఎడ్వర్డ్స్‌, మెర్వే జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌తో ఆర్యన్‌ దత్త్ నెదర్లాండ్స్‌కు పోరాడే స్కోరు అందించాడు. దక్షిణాఫ్రికా  బౌలర్లలో ఎంగిడి రెండు, జాన్సన్ 2, రబాడ 2 వికెట్లు తీశారు. కాట్జే, కేశవ్‌ మహారాజ్‌ చెరో వికెట్‌ తీశారు. 


 అనంతరం 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆరంభంలో ఆచితూచి ఆడింది. కానీ 36 పరుగుల వద్ద భీకర ఫామ్‌లో ఉన్న డికాక్‌ను అవుట్‌ చేసి వాన్ డెర్‌ మెర్వే సఫారీ పతనాన్ని ప్రారంభించాడు. అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జట్టు 44 పరుగులకు చేరేలోపే నాలుగు వికెట్లు పడ్డాయి. అనంతరం క్లాసన్‌, మిల్లర్‌ సఫారీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ క్లాసన్‌ అవుట్‌ కావడంతో మళ్లీ వికెట్ల పతనం ప్రారంభమైంది. కాట్జే, మిల్లర్‌, మహరాజ్‌ కూడా పెవిలియన్‌ చేరడంతో దక్షిణాఫ్రికా విజయం ఖాయమైంది. మిల్లర్‌ ఒక్కడే 43 పరుగులతో రాణించాడు. మిగిలిన ఏ దక్షిణాఫ్రికా బ్యాటర్‌ 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. దీంతో 207 పరుగులకే సఫారీ జట్టు కుప్పకూలి... 38 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.  నెదర్లాండ్స్‌ బౌలర్లలో లాగన్‌ వెన్‌ బీక్‌ 3, మీకిరెన్‌ 2, డే మెర్వ్‌ 2, బే లీడే రెండు వికెట్లతో సత్తా చాటారు.

టాప్ హెడ్ లైన్స్

ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
BCCI Selection Twist: అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!
అగార్కర్ పై వేటు వేసేందుకు బిసిసిఐ ప్లాన్..! లక్ష్మణ్ కి చీఫ్ సెలెక్టర్ పగ్గాలు, రోహిత్ రిటైర్మెంట్ వివాదంలో ఊహించ‌ని ట్విస్ట్!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget