![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Virat Kohli: అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం
Virat Kohli And Anushka Sharma: టీమిండియా టీ 20 ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతగా అవతరించిన తరువాత కింగ్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మను ఉద్దేశించి ఇన్ స్టాగ్రామ్ లో ఓ సందేశం పోస్టు చేశాడు.
![Virat Kohli: అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం Virat Kohli thanks Anushka Sharma after T20 World Cup victory says she keeps him grounded None of this would be possible without you Virat Kohli: అనుష్క! నువ్వు లేకుండా సాధ్యమా! T20 క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తర్వాత కొహ్లీ భావోధ్వేగం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/02/adcd210de7d24fbc3cb0a51461633fb817198943360841036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kohli Pens Emotional Note To Anushka After T20 World Cup Win: టీ 20 ప్రపంచకప్(T20 World Cup) గెలిచి మూడు రోజులు అవుతున్నా... ఆటగాళ్లు, అభిమానులు ఆ ఆనందం నుంచి..భావోద్వేగ క్షణాల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. దశాబ్దాలుగా ఎదురుచూసిన క్షణం సాకారం కావడంతో ఆటగాళ్లు ఇంకా ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తూనే ఉన్నారు. ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఇంకా ఆ మధుర క్షణాలను తలుచుకుని భావోద్వేగానికి గురవుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్... మనస్సును హత్తుకునేలా ఉంది. తన విజయంలో భార్య అనుష్క శర్మ పాత్రను వివరిస్తూ కోహ్లీ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. తన విజయ ప్రస్థానం క్రెడిట్ అంతా అనుష్క శర్మ(Anushka)దే అని విరాట్ ఆ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ పోస్ట్ పెట్టిన తర్వాత అనుష్క కూడా పోస్ట్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)