అన్వేషించండి

Vaibhav Sooryavanshi Hard Work: రోజూ 8 గంటల ప్రాక్టీస్, 100 ఓవర్ల బ్యాటింగ్.. వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్ -  వండర్ కిడ్ వెనుక ఉన్న కష్టం ఇదీ!

ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి ఇండియా టీమ్‌కు సెలెక్ట్ అయిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వెనుక ఉన్న ఆరేళ్ల కఠిన శ్రమ, అతని పేరెంట్స్ చేసిన త్యాగాల గురించిన అత‌ని చిన్న‌ప్ప‌టి కోచ్ వివ‌రించాడు.

Vaibhav Sooryavanshi Gruelling Eight Hour Practice Regime: ఐపీఎల్ లాస్ట్ రెండు సీజన్లలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన యంగ్ బ్యాటర్ వైభ‌వ్ సూర్యవంశీ సక్సెస్ వెనుక ఆరేళ్ల కఠిన శ్రమ దాగి ఉంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వరల్డ్ క్రికెట్ మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటింగ్ సెన్సేషన్‌గా మారిన వైభవ్, రీసెంట్ ఐపీఎల్ సీజన్లలో 237 ప్లస్ స్ట్రైక్ రేట్‌తో 776 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ సూపర్ పర్ఫార్మెన్స్‌తో యూకే టూర్‌కు వెళ్లే ఇండియా టి20ఐ టీమ్‌కు సెలెక్ట్ అయ్యాడు. పాట్నాలోని తన అకాడమీలో ఎనిమిదేళ్ల వయసు నుంచి వైభవ్‌కు ట్రైనింగ్ ఇచ్చిన చైల్డ్‌హుడ్ కోచ్ మనీష్ ఓఝా అతని జర్నీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేశాడు.

Read Also: Deepti Sharma Milestone: దీప్తి స్పిన్ మ్యాజిక్: హిస్టారికల్ 350 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ! దాయాదిపై ఫైవ్ వికెట్ హాల్

రోజుకు 600 బంతులు, సుదీర్ఘ బ్యాటింగ్..
టెన్నిస్ బాల్ నుంచి హార్డ్‌బాల్ క్రికెట్‌కు మారినప్పటి నుంచి వైభవ్ రోజుకు కనీసం 600 బంతులు అంటే దాదాపు 100 ఓవర్లు ఫేస్ చేసేవాడని కోచ్ ఓఝా చెప్పాడు. ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నాన్‌స్టాప్‌గా ప్రాక్టీస్ సాగేది. ఫస్ట్ తానే స్వయంగా 200 నుంచి 300 బంతులు త్రోడౌన్స్ వేసేవాడినని, తాను అలసిపోతే సపోర్ట్ స్టాఫ్, వారు కూడా అలసిపోతే అకాడమీ బౌలర్లు వైభవ్‌కు బౌలింగ్ చేసేవారని తెలిపాడు. అందరూ అలసిపోయినా నెట్ సెషన్స్, బౌలింగ్ మెషిన్ల ద్వారా వైభవ్ తన బ్యాటింగ్ ప్రాక్టీస్ కంటిన్యూ చేసేవాడు. ఈ ఆరేళ్ల రిపీటెడ్ ట్రైనింగ్ వల్లే అతనిలో అద్భుతమైన మజిల్ మెమరీ, పవర్‌ఫుల్ బ్యాట్ స్వింగ్ క్రియేట్ అయ్యాయని విశ్లేషించాడు.

Read Also: T20 World Cup IND W Win VS PAK W: టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ.. చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాక్ పై డామినేష‌న్.. స‌త్తా చాటిన స్మృతి, దీప్తి, శ్రీచ‌ర‌ణి

అర్ధరాత్రి లేచి వంట చేసిన తల్లి, తండ్రి సపోర్ట్
సమస్తీపూర్ నుంచి రెండున్నర గంటల పాటు ట్రావెల్ చేసి వైభవ్ తన తండ్రి సంజీవ్‌తో కలిసి ఉదయం 5 గంటలకే పాట్నా అకాడమీకి వచ్చేవాడు. వైభవ్ కెరీర్ కోసం అతని పేరెంట్స్ ఎన్నో త్యాగాలు చేశారని కోచ్ గుర్తుచేసుకున్నాడు. వైభవ్ తల్లి ఆర్తి రోజు అర్ధరాత్రి 2 గంటలకే లేచి లంచ్ ప్రిపేర్ చేసేది. కేవలం వైభవ్, అతని తండ్రి కోసమే కాకుండా వారితో పాటు వచ్చే బౌలర్లు, అకాడమీలో పేద పిల్లల కోసం రోజు 10 నుంచి 15 మందికి సరిపోయే ఫుడ్ ప్యాక్ చేసి పంపేదని ఎమోషనల్ అయ్యాడు. పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ వల్లే వైభవ్ ఈరోజు ఛాంపియన్ ప్లేయర్ అయ్యాడని స్పష్టం చేశాడు.

ఐదేళ్ల పిల్లలతో అకాడమీల క్యూ
వైభవ్ సూర్యవంశీ సక్సెస్ గ్రాఫ్ చూసిన తర్వాత ఇప్పుడు ఇండియా అంతటా పేరెంట్స్ తమ పిల్లలను క్రికెటర్లు చేయాలని డిసైడ్ అవుతున్నారు. ప్రస్తుతం ఐదేళ్ల చిన్న పిల్లలను కూడా అకాడమీకి తీసుకొస్తూ తమ బిడ్డను 'నెక్స్ట్ వైభవ్' లా మార్చాలని కోరుతున్నట్లు ఓఝా చెప్పాడు. వైభవ్ ఇప్పుడు ఇండియాలోని యంగ్ జనరేషన్‌కు ఒక రోల్ మోడల్, ఒక బిగ్ ఇన్‌స్పిరేషన్‌గా మారాడని సంతోషం వ్యక్తం చేశాడు. సరైన టెక్నికల్ పారామీటర్స్, కఠినమైన క్రమశిక్షణతో ఆడితే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని వైభవ్ ప్రూవ్ చేశాడని కొనియాడాడు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Rahane Struggle Days: రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
రెండేళ్లపాటు వాటర్ బాయ్ గానే రహానే.. సింపథీ వద్దనుకుని బెంచ్ పై వేచి చూసిన స్టార్ ప్లేయర్, టెస్ట్ డెబ్యూ వెనుక  ట్విస్ట్!
IND vs SL:  తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
తొలి టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. వార్మ‌ప్ మ్యాచ్ లో బ‌రిలోకి దిగని గిల్.. కార‌ణం ఏంటంటే..?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget