T20 World Cup IND W Win VS PAK W: టీమిండియా గ్రాండ్ విక్టరీ.. చిరకాల ప్రత్యర్థి పాక్ పై డామినేషన్.. సత్తా చాటిన స్మృతి, దీప్తి, శ్రీచరణి..
అన్ని రంగాల్లో రాణించిన టీమిండియా.. చిరకాల ప్రత్యర్థి పాక్ పై అద్భుత విజయం సాధించింది. ముందుగా స్మృతి సత్తా చాటగా, తర్వాత దీప్తి.. పాక్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేసింది.

T20 World Cup IND W Win VS PAK W Latest Updates: అనుకున్నదే జరిగింది. ఏ మాత్రం సంచలనానికి తావివ్వకుండా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత మహిళా జట్టు అద్భుత విజయం సాధించింది. ఆదివారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా మహిళా టీ20 ప్రపంచకప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన స్టన్నింగ్ ఫిఫ్టీ (44 బంతుల్లో 68, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో పాక్ కేవలం 17 ఓవర్లలో 106 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ మునీబా అలీ (35 బంతుల్లో 41, 5 ఫోర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచింది. సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ ఐదు వికెట్లతో సత్తా చాటగా, తెలుగమ్మాయి శ్రీ చరణి మూడు వికెట్లతో ఆకట్టుకుంది. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్ లోనే బోణీ కొట్టిన టీమిండియా.. అద్భుతంగా తమ జర్నీని స్టార్ట్ చేసింది. దీప్తికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
What. A. Finish 🥳
— BCCI Women (@BCCIWomen) June 14, 2026
3️⃣ wickets in an over and Deepti Sharma has a superb 𝙁𝙄𝙁𝙀𝙍 🖐️#TeamIndia wrap a dominant 6️⃣4️⃣-run victory to kickoff our #T20WorldCup campaign 👏
Scorecard ▶️ https://t.co/1tfRc3jcrX#WomenInBlue | #T20WorldCup pic.twitter.com/vhvCoE9tXu
శుభారంభం లభించినా..
కాస్త భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్ కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు మునీబా, గుల్ ఫిరోజా (12) తొలి వికెట్ కు 38 పరుగులు జోడించి, చక్కని ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా వీరిద్దరూ బౌండరీలతో డీల్ చేయడంతో పాక్ స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఇక ఆరంభంలో పేసర్లు కాస్ట్లీగా ప్రూవ్ కావడం కూడా పాక్ కు కలిసొచ్చింది. ఇక ప్రమాదకరంగా సాగుతున్న ఈ జోడీని దీప్తి శర్మ వీడదీసింది. ఆ తర్వాత మిడిలార్డర్ కుప్పకూలింది. ఆయేషా జాఫర్ (12), సైర జబీన్ (2), నటలియా పర్వేజ్ (7) కెప్టెన్ ఫాతిమా డకౌట్ తో ఇలా వచ్చి అలా వెళ్లారు.
దీప్తి మాయజాలం..
ఇదే మ్యాచ్ లో 350 వికెట్ల మైలురాయిని కంప్లీట్ చేసిన దీప్తి.. బంతితో పాక్ బ్యాటర్లను కంగారు పెట్టింది. ఆమె స్పిన్ కు బ్యాటర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఆమెతో పాటు శ్రీచరణి కూడా సత్తా చాటడంతో పాక్ ఛేజింగ్ లో ఏ దశలోనూ గెలుస్తున్నట్లు అనిపించలేదు. మరో వికెట్ ను షెఫాలీ వర్మ తీయడంతో మొత్తం వికెట్లన్నీ స్పిన్నర్లే తీసినట్లు అయింది. ఇక అద్బుతమైన రనౌట్ తో దీప్తి సత్తా చాటింది. ఇక ఈ విజయంతో మెగా టోర్నీలో పాక్ పై తన అజేయ రికార్డును కొనసాగించడంతోపాటు, దాయాదిపై పరుగుల పరంగా భారీ విక్టరీని నమోదు చేసింది. తర్వాతి మ్యాచ్ ను నెదర్లాండ్స్ తో బుధవారం టీమిండియా ఆడుతుంది.
Come the big moments, trust Deepti Sharma to shine 🌟🔥
— BCCI Women (@BCCIWomen) June 14, 2026
An incredible 5️⃣-wicket haul earns her the Player of the Match award in our #T20WorldCup opener 🪄
Scorecard ▶️ https://t.co/1tfRc3jcrX#TeamIndia | #WomenInBlue | @Deepti_Sharma06 pic.twitter.com/bZl0tbLJQK
ట్రెండింగ్ వార్తలు



















