అన్వేషించండి

Pro Kabaddi 2023: ఇక సమరమే....నేటి నుంచే ప్రో కబడ్డీ సీజన్‌-10

pro kabaddi 2023 news in telugu: గత 9 సీజన్‌‌లుగా కబడ్డీ అభిమానులు అలరిస్తోన్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 నేడు ప్రారంభం కానుంది.

గత 9 సీజన్‌‌లుగా కబడ్డీ అభిమానులు అలరిస్తోన్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 నేడు ప్రారంభం కానుంది. తొమ్మిదేళ్లుగా అశేష అభిమానులను అలరించిన ఈ లీగ్‌ నేటి నుంచి మరో సీజన్‌కు సిద్ధమైంది. 2014లో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్రీడకు ప్రాముఖ్యత పెరిగింది. భారీ ప్రజాదరణ లభించింది. దేశంలోని క్రీడాభిమానులను సుపరిచితం అయిన కబడ్డీ.. ప్రో కబడ్డీ లీగ్‌తో దేశ, విదేశాల్లో కోట్లాది మంది అభిమానులను ఆకర్షించింది. ఈ క్రమంలో తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్న ఈ మెగా లీగ్ పదో ఎడిషన్‌లోకి అడుగు పెడుతోంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్‌లో తెలుగు టైటాన్స్‌-గుజరాత్‌ జెయింట్స్‌తో టోర్నీ మొదలు కానుంది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని అక్షర్ రివర్ క్రూజ్‌లో ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌ లాంఛనంగా ప్రారంభమైంది. మాషల్ స్పోర్ట్స్, ప్రో కబడ్డీ లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి ఈ ప్రత్యేక సీజన్‌ను తొమ్మిదో ఎడిషన్ విజేత జట్టు జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ సునీల్ కుమార్, పదో సీజన్ తొలి మ్యాచ్‌లో పోటీ పడే కెప్టెన్లు పవన్ సెహ్రావత్ (తెలుగు టైటాన్స్), ఫజెల్ అత్రాచలి (గుజరాత్ జెయింట్స్)తో కలిసి ప్రారంభించారు.
 
2014లో ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌ ఇప్పటిదాకా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. 2014, 2022 సీజన్‌లో జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, 2015లో యు ముంబా, 2016, 2017లో పట్నా పైరేట్స్‌,  2018లో బెంగళూరు బుల్స్‌, 2019లో బెంగాల్‌ వారియర్స్‌, 2021లో దబాంగ్‌ దిల్లీ  విజేతలుగా నిలిచాయి. ఈసారి  బరిలో మొత్తం 12 జట్లు ఉన్నాయి. తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌, పుణెరి పల్టాన్‌, పట్నా పైరేట్స్‌, జైపుర్‌ పింక్‌ పాంథర్స్‌, హరియాణా స్టీలర్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌, దబాంగ్‌ దిల్లీ, బెంగళూరు బుల్స్‌, బెంగాల్‌ వారియర్స్‌, యూపీ యోధ, యు ముంబా కప్పు వేటలో ఉన్నాయి. నేటి నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో లీగ్‌ దశలో మొత్తం 132 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు 2024 ఫిబ్రవరి 21న ముగుస్తాయి. ప్లేఆఫ్స్‌, ఫైనల్‌ తేదీలు తర్వాత ప్రకటిస్తారు. హైదరాబాద్‌ వేదికగా గచ్చిబౌలి స్టేడియంలో జనవరి 19 నుంచి 24 వరకు 11 మ్యాచ్‌లు జరుగుతాయి. వీటిలో తెలుగు టైటాన్స్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. 
 
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 కోసం కొత్త జట్టును తెలుగు టైటాన్స్ ప్రకటించింది. ప్లేఆఫ్ రౌండ్‌లోకి ప్రవేశించిన టాప్ సిక్స్‌తో ఇతర 11 జట్ల మాదిరిగానే తెలుగు టైటాన్స్ 22 లీగ్ దశ మ్యాచ్‌లు ఆడుతుంది. తెలుగు టైటాన్స్ సీజన్ 10కి పవన్ కుమార్ సెహ్రావత్‌ను కెప్టెన్‌గా.... పర్వేష్ భైన్‌స్వాల్‌ను వైస్ కెప్టెన్‌గా ప్రకటించింది. పదో సీజన్ తొలి మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నామని ప్రో కబడ్డీ లీగ్ లో అత్యంత ఖరీదైన ఆటగాడు, తెలుగు టైటాన్స్‌ కెప్టెన్‌ పవన్ సెహ్రావత్ తెలిపాడు. గత సీజన్‌ కు దూరంగా ఉండటం నిరాశ కలిగించిందని.. ఈ సీజన్ కోసం చాలా బాగా శిక్షణ పొందామని తెలిపాడు. గుజరాత్ జెయింట్స్‌తో మొదటి మ్యాచ్‌కు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు. ప్రో కబడ్డీ లీగ్ పదో సీజన్‌ 10 స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. డిస్నీ+ హాట్‌స్టార్‌లో ఉచితంగా ప్రసారం అవుతుందని నిర్వాహకులు తెలిపారు.
 
తెలుగు టైటాన్స్ జట్టు: 
పర్వేష్ భైన్‌స్వాల్, మోహిత్, నితిన్, అంకిత్, సి మిలాద్ జబ్బారి (విదేశీ), గౌరవ్ దహియా, అజిత్ పాండురంగ్ పవార్, మోహిత్, సందీప్ ధుల్,  రజనీష్, సంజీవి ఎస్, బి హమీద్ మీర్జాయ్ నాడర్ (విదేశీ), శంకర్ భీమ్‌రాజ్ గడై, ఓంకార్ ఆర్ మోర్, పవన్ కుమార్ సెహ్రావత్, ఓంకార్ నారాయణ్ పాటిల్, ప్రఫుల్ సుదమ్ జవారే, రాబిన్ చౌదరి.
 
ప్రధాన కోచ్: శ్రీనివాస్ రెడ్డి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Rahul Gandhi: బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
బీజేపీ ఎంపీలపై దాడి - రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana Tenth Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది!
Manchu Issue: అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
అరెస్టు నుంచి రక్షణ కల్పించలేం - మోహన్ బాబుకు తేల్చి చెప్పిన హైకోర్టు !
ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
BRS On NTR: ఎన్టీఆర్ ఘాట్ జొలిస్తే అంతే సంగతులు - కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల స్ట్రాంగ్ వార్నింగ్
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Telangana Assembly: 'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
'నువ్వేమన్నా డిప్యూటీ లీడర్‌వా?' - హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర ఆగ్రహం, అసెంబ్లీలో మాటల యుద్ధం
Embed widget