గుర్నూర్ బ్రార్ ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 10 ఓవర్లలో 97 పరుగులు ఇచ్చి, వికెట్ తీయకుండా టీమిండియా తరఫున ఒక వన్డేలో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా నిలిచాడు.
Most Expensive Bowler: వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో భారత బౌలర్ గుర్నూర్ బ్రార్.. ఫస్ట్ ఎవరు
Gurnoor Brar: గుర్నూర్ బ్రార్ ఒక వన్డేలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న మూడో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన లార్డ్స్ వన్డేలో చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు.

- గుర్నూర్ బ్రార్ లార్డ్స్ వన్డేలో 97 పరుగులు సమర్పించాడు.
- భారత్ తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో బౌలర్.
- భువనేశ్వర్, వినయ్ కుమార్ 100 పైగా పరుగులు గతంలో ఇచ్చారు.
- ఇంగ్లాండ్ లార్డ్స్‌లో అత్యధిక 387 భారీ పరుగులు చేసింది.
Most Expensive figures by Indian bowler | భారత ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ (Gurnoor Brar) ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో చెత్త రికార్డు నమోదు చేశాడు. అతడు 10 ఓవర్లలో 9.70 ఎకానమీతో ఏకంగా 97 పరుగులు సమర్పించుకున్నాడు. మరోవైపు ఈ ఇన్నింగ్స్‌లో గుర్నూర్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ గణాంకాలతో గుర్నూర్ టీమిండియా తరఫున ఒక వన్డేలో అత్యధిక పరుగులు ఇచ్చిన 3వ బౌలర్‌గా నిలిచాడు.
గుర్నూర్ లార్డ్స్‌లో తన కెరీర్‌లో కేవలం 6వ వన్డే మాత్రమే ఆడుతున్నాడని తెలిసిందే. కెరీర్ ప్రారంభ దశలోనే అతడు చాలా అసౌకర్యంగా కనిపించాడు. భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. దాంతో ఆతిథ్య ఇంగ్లాండ్ బ్యాటర్లు భారత బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. స్టార్ పేసర్ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. దాంతో ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు భారీ ఇన్నింగ్స్ ఆడి పరుగుల వరద పారించారు. ఈ టార్గెట్ భారత్ ఛేదిస్తే అద్భుతమని చెప్పవచ్చు.
భువీ పేరిట అత్యధిక పరుగుల అన్ వాంటెడ్ రికార్డు
భారత్ తరఫున ఒక వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న అన్ వాంటెడ్ రికార్డు స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేరిట నమోదైంది. స్వింగ్ కింగ్‌గా ఫేమస్ అయిన భువీ 2015లో దక్షిణాఫ్రికాపై వాంఖడే స్టేడియం (ముంబై) లో జరిగిన మ్యాచ్‌లో 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు ఇచ్చాడు. ఆ వన్డేలో భువీ కేవలం ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.
Innings Break!
— BCCI (@BCCI) July 19, 2026
England set #TeamIndia a target of 388 runs at Lord's.
Over to our batters.⏳
Scorecard ▶️ https://t.co/pLZ2PvDH5G#ENGvIND pic.twitter.com/ZhZdxpW4NW
భారత్ నుంచి ఈ జాబితాలో రెండో స్థానంలో వినయ్ కుమార్ ఉన్నాడు. పేసర్ వినయ్ కుమార్ 2013లో ఆస్ట్రేలియాపై బెంగళూరులో 9 ఓవర్లలో 1/102 పరుగులు ఇచ్చాడు. భువనేశ్వర్, వినయ్ మాత్రమే భారత్ నుంచి ఇప్పటివరకు 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఇచ్చుకున్న బౌలర్లుగా ఉన్నారు.
భారత్ తరఫున వన్డేలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్లు వీరే
భువనేశ్వర్ కుమార్ వర్సెస్ దక్షిణాఫ్రికా, వాంఖడే 2015 - 1/106 (10 ఓవర్లు)
వినయ్ కుమార్ వర్సెస్ ఆస్ట్రేలియా, బెంగళూరు 2013 - 1/102 (9 ఓవర్లు)
గుర్నూర్ బ్రార్ వర్సెస్ ఇంగ్లాండ్, లార్డ్స్ 2026 - 0/97 (10 ఓవర్లు)
భువనేశ్వర్ కుమార్ వర్సెస్ న్యూజిలాండ్, కాన్పూర్ 2017 - 1/92 (10 ఓవర్లు)
లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ అత్యధిక స్కోరు
లార్డ్స్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో ఆడుతున్న ఇంగ్లిష్ జట్టు దూకుడు కొనసాగించింది. 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు చేసింది. లార్డ్స్ మైదానంలో వన్డే క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్ బెన్ డకెట్ అద్భుత శతక ఇన్నింగ్స్ ఆడుతూ 135 బంతుల్లో 18 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 141 పరుగులు చేశాడు. లార్డ్స్ లో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా డకెట్ నిలిచాడు.
Before You Go
Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Frequently Asked Questions
గుర్నూర్ బ్రార్ ఏ రికార్డును నమోదు చేశాడు?
ఒక వన్డేలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్ ఎవరు?
భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఒక వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్నాడు. అతను 2015లో దక్షిణాఫ్రికాపై 10 ఓవర్లలో 106 పరుగులు ఇచ్చాడు.
భారత్ తరఫున వన్డేలో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు ఇచ్చిన బౌలర్లు ఎవరు?
భారత్ తరఫున ఇప్పటివరకు భువనేశ్వర్ కుమార్ మరియు వినయ్ కుమార్ మాత్రమే ఒక వన్డే మ్యాచ్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్న బౌలర్లు.
లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ ఎంత స్కోర్ చేసింది?
లార్డ్స్‌లో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇది వన్డే క్రికెట్‌లో లార్డ్స్ మైదానంలో వారి అత్యధిక స్కోరు.
ట్రెండింగ్ వార్తలు




















