Mayank Agarwal Becomes Father: తండ్రైన టీమిండియా క్రికెటర్- శుభాకాంక్షలు చెప్తున్న నెటిజన్లు
Mayank Agarwal Becomes Father: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తండ్రి అయ్యారు. అతని భార్య అషితా సూద్ డిసెంబర్ 8న బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈరోజు మయాంక్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు.
Mayank Agarwal Becomes Father: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తండ్రి అయ్యారు. అతని భార్య అషితా సూద్ డిసెంబర్ 8న బాబుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఈరోజు మయాంక్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. తన భార్య, కొడుకుతో ఉన్న ఫొటోను పంచుకున్నారు. బాబు పేరును కూడా నెటిజన్లతో పంచుకున్నాడు. మేం కృతజ్ఞత నిండిన హృదయాలతో మా బాబు అయాన్ష్ ను మీకు పరిచయం చేస్తున్నాం. ఇప్పుడితను మాలో ఒక భాగం. మాకు దేవుడిచ్చిన బహుమతి. అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్న మయాంక్, అషిత ఏప్రిల్ 2018లో వివాహం చేసుకున్నారు. అషిత తండ్రి కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ). అషిత న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అలాగే ఆమె వృత్తిరీత్యా న్యాయవాది. అషిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు 90 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు.
దేశవాళీల్లో ఆడుతున్న మయాంక్
గత కొన్నేళ్లుగా మయాంక్ టెస్టు క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఓపెనర్ గా బరిలోకి దిగే అతను 2022 మార్చి నుంచి టీమిండియాకు ఆడలేదు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ దేశవాళీ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడాడు. 9 ఇన్నింగ్సుల్లో 3 అర్ధసెంచరీలు సాధించాడు. ప్రస్తుతం టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి తీవ్ర పోటీ ఉండటంతో అతను జట్టులోకి తిరిగి రావడం కష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్ లో గతేడాది పంజాబ్ కింగ్స్ కు మయాంక్ నాయకత్వం వహించాడు. అయితే 2023 లో జరిగే ఎడిషన్ కు పంజాబ్ యాజమాన్యం మయాంక్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించింది. అతని స్థానంలో శిఖర్ ధావన్ ను కెప్టెన్ ను చేసింది.
మయాంక్ కు సహచర క్రికెటర్లు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విరాట్ కోహ్లీ- అనుష్క శర్మ జంట కొత్త తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
With our hearts full of gratitude, we introduce Aayansh ♥️
— Mayank Agarwal (@mayankcricket) December 11, 2022
The first Ray of light, a part of US & a Gift of God🧿🧿
08.12.2022 ♥️ pic.twitter.com/mPqW7FTSjl
Happy Birthday, @imVkohli
— Mayank Agarwal (@mayankcricket) November 5, 2022
Wishing you good health and happiness and continued success with your masterclass! pic.twitter.com/86fjnmMUpA