అన్వేషించండి
Advertisement
Afro-Asia Cup: ఈ జట్టును చూస్తే వణికిపోవాల్సిందే, అందరూ పోటుగాళ్లే
Afro-Asia Cup : 17 సంవత్సరాల తర్వాత ఆఫ్రో-ఆసియా కప్ మళ్లీ నిర్వహిస్తారనే ప్రచార నేపధ్యంలో ఈ టోర్నమెంట్‌లో ఉండే ఆసియా జట్టును ఒకసారి చూద్దామా ..
Probable Asia XI For Afro-Asia Cup : ఆఫ్రో-ఆసియా కప్(Afro-Asia Cup) మళ్లీ నిర్వహిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఐసీసీ ఛైర్మన్(ICC) గా జై షా(Jays Shah) బాధ్యతలు చేపట్టిన తర్వాత దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 17 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్‌ను నిర్వహించే అవకాశం ఉండడంతో క్రికెట్ ప్రపంచాన్ని ఈ వార్త విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లను మళ్లీ ఒకే జట్టుగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ టోర్నమెంట్‌లో ఆసియా జట్టును చూస్తే మతిపోవాల్సిందే. దిగ్గజ ఆటగాళ్లు జట్టులో ఉండే అవకాశం ఉంది. ఒక్కసారి వారెవరో చూద్దామా...
బాబర్ ఆజం (పాకిస్థాన్): టీ20ల్లో 4000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ముగ్గురు బ్యాటర్లలో పాకిస్థాన్ టీ20 కెప్టెన్ బాబర్ ఆజం ఒకరు. ఇటీవల బాబర్ ఫామ్‌లో లేకపోయినా మెరుగైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆసియా 11 జట్టులో బాబర్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
సూర్యకుమార్ యాదవ్ (ఇండియా): సూర్యకుమార్ యాదవ్ ఆల్ టైమ్ అత్యుత్తమ టీ20 బ్యాటర్లలో ఒకడు. రోహిత్ శర్మ టీ 20ల నుంచి రిటైర్ అయిన తర్వాత భారత కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటివరకు ఆడిన 71 మ్యాచ్‌లలో మొత్తం 2432 పరుగులు చేశాడు.
చరిత్ అసలంక (శ్రీలంక): శ్రీలంక వన్డే కెప్టెన్ చరిత్ అసలంక రెండేళ్లుగా తన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అసలంక నమ్మకమైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్. ఇప్పటివరకు ఆడిన 50 టీ20ల్లో 1075 పరుగులు చేశాడు.
హార్దిక్ పాండ్యా (భారత్): భారత్ తరఫున 102 టీ20లు ఆడిన అనుభవం హార్దిక్ పాండ్యాకు ఉంది. టీ 20 క్రికెట్‌లో హార్దిక్ 86 వికెట్లు తీసి 1523 పరుగులు చేశాడు.
వనిందు హసరంగా (శ్రీలంక):
శ్రీలంక మాజీ టీ20 కెప్టెన్ వనిందు హసరంగ ఇప్పటి వరకు ఆడిన 71 మ్యాచ్‌ల్లో 114 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తోనూ హసరంగా రాణించగలడు.
రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్): టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నిలిచాడు. 93 మ్యాచ్‌ల్లో రషీద్ 152 వికెట్లు తీశాడు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించాడు.
షాహీన్ షా అఫ్రిది (పాకిస్థాన్): పాకిస్థాన్ పేస్ అటాక్‌లో షాహీన్ షా అఫ్రిది కీలకం. 24 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్... ఇప్పటివరకు ఆడిన 70 టీ 20 మ్యాచ్‌లలో 96 వికెట్లు సాధించాడు.
జస్ప్రీత్ బుమ్రా (భారత్): జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలర్. ఈ ఏడాది భారత్ T20 ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకోవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2024 T20 ప్రపంచ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. బుమ్రా ఇప్పటి వరకు ఆడిన 70 టీ 20 మ్యాచుల్లో 89 వికెట్లు తీశాడు.
మతీషా పతిరాణ (శ్రీలంక):
2022 ఆగస్టు 27న దుబాయ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో శ్రీలంక తరఫున తన పతిరాణ టీ 20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తరపున ప్రాతినిథ్యం వహించాడు. లెజెండరీ లసిత్ మలింగ లాంటి బౌలింగ్ యాక్షన్ ఉన్న పతిరాణ 12 టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టాడు.
లిట్టన్ దాస్ (బంగ్లాదేశ్): లిట్టన్ దాస్ ఇప్పటివరకు ఆడిన 89 మ్యాచ్‌లలో 1943 పరుగులు చేశాడు.
యశస్వి జైస్వాల్ (భారత్): యశస్వి జైస్వాల్ ఆగస్టు 2024లో వెస్టిండీస్‌పై భారతదేశం తరపున తన T20I అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 23 T20I మ్యాచ్‌లలో723 పరుగులు చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement