అన్వేషించండి

Virat -Babar: ఒకే జట్టులో విరాట్‌ కోహ్లీ- బాబర్ ఆజమ్‌ , కల నెరవేరుతుందా?

Afro-Asia Cup: స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, బాబర్‌ అజామ్‌, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్ త్వరలో ఒకే జట్టు తరఫున ఆడే అవకాశముందా? జైషా ఏమన్నారంటే?

Virat Kohli To Partner Babar Azam For Same Team In This Tournament:  భారత్‌-పాక్(Ind Vs Pak) మ్యాచ్‌ ఆంటేనే ఇరు దేశాల అభిమానులు దాన్నో యుద్ధంలా చూస్తారు. ఆటగాళ్ల మధ్య భావోద్వేగాలు... పరస్పర కవ్వింపు చర్యలతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. విరాట్‌ కోహ్లీ(Virat Kohli)- బాబర్‌ ఆజమ్‌(Babar Azam)లలో ఉత్తమ ఆటగాడు ఎవరన్న దానిపై ఎప్పడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. షాహీన్‌ షా అఫ్రిదీ... జస్ప్రీత్‌ బుమ్రాలలో ఎవరూ అత్యుత్తమమనే దానిపైనా వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు వీరందరూ కలిసి ఒకే జట్టుకు ఆడితే ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా.. ఇది నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ, బాబర్ ఆజం ఒకే జట్టులో ఆడే అవకాశం కనిపిస్తోంది. 17 ఏళ్ల తర్వాత ఆఫ్రో-ఆసియా కప్(Afro-Asia Cup) నిర్వహించే అవకాశం ఉంది.
 
 
ఆఫ్రో-ఆసియా కప్‌
ఆఫ్రో ఆసియా కప్‌ను మొదటిసారిగా 2005లో నిర్వహించారు. ఆఫ్రికా లెవన్‌ జట్టుతో ఆసియా లెవన్‌ జట్టు తలపడింది. అప్పుడు సెహ్వాగ్, షాహిద్ అఫ్రిది, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే, ఇంజమామ్-ఉల్-హక్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, షోయబ్ అక్తర్ ఆసియా లెవన్‌ జట్టులో ఆడారు. 2007లో జరిగిన ఆఫ్రో ఆసియా కప్‌లో MS ధోని, సచిన్ టెండూల్కర్, మహేల జయవర్ధనే ఆడారు. ఆ మ్యాచ్‌లో ధోనీ ఐదు సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. ఆ తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆఫ్రో-ఆసియా కప్‌ను 2007 తర్వాత నిర్వహించలేదు. ఇప్పుడు ఈ లీగ్‌ను పునరుద్ధరించేందుకు ఐసీసీ చర్యలు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ ఛైర్మన్‌గా జై షా నియమించిన తర్వాత ఆఫ్రో-ఆసియా కప్‌ నిర్వహణపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 2023 ఆఫ్రో-ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆఫ్రో-ఆసియ కప్‌ నిర్వహించాలన్న అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తుందని ఒక అధికారి తెలిపారు.
 
జై షా చేతుల్లోనే..
డిసెంబర్‌లో ఐసీసీ ఛైర్మన్‌గా జై షా(Jay Shah) బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్రో- ఆసియ కప్‌ నిర్వహణ అంశంపై మళ్లీ తెరపైకి వచ్చింది. చివరిసారి వన్డే ఫార్మాట్‌లో ఈ కప్‌ను నిర్వహించగా... ఈ సారి టీ 20 ఫార్మట్‌లో నిర్వహించే అవకాశం ఉంది.  ఆఫ్రో-ఆసియా కప్ నిర్వహించకపోవడం వ్యక్తిగతంగా తనను చాలా బాధ పెట్టిందని... ఇప్పుడు మళ్లీ దానిని పరిశీలిస్తున్నారని ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్ సమోద్ దామోదర్ తెలిపారు. భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు ఒకే జట్టులో ఆడితే చూడాలన్న కల నెరవేరాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. విరాట్ కోహ్లి, బాబర్ అజామ్, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది, రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్ వంటి అత్యుత్తమ ఆటగాళ్ల ఒకే జట్టులో కనపడితే అదిరిపోతుందని అన్నాడు. 2023లో ఆఫ్రో- ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా.. ఆసియా క్రికెట్‌ అసోసియేషన్‌లో ని అంతర్గత గందరగోళం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మరోసారి ఇది తెరపైకి వచ్చింది.
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Revanth Reddy on Sandhya Theatre Incident: తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్! అరెస్ట్ చేస్తామంటే థియేటర్ నుంచి వెళ్లిపోయారు: రేవంత్ రెడ్డి
Credit Card Safety Tips: మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
మీ క్రెడిట్ కార్డు డిటైల్స్ సేఫ్‌గా ఉంచాలనుకుంటున్నారా? - ఆన్‌లైన్ షాపింగ్‌లో ఇలా అస్సలు చేయకూడదు!
Aus VS Ind Series: ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
ట్రావిస్ 'హెడ్' కాదు.. ఇండియాకు 'హెడేక్'- ఆసీస్ బ్యాటర్ పై భారత మాజీ కోచ్ ప్రశంసల జల్లు
Fuel Filling Tips: బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
బైక్ లేదా పెట్రోల్‌ను ట్యాంక్ ఫుల్ చేస్తున్నారా? - అయితే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే!
Embed widget