అన్వేషించండి

Kanpur Test : కాన్పూర్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో తీవ్ర కలకలం - బంగ్లాదేశ్‌ వీరాభిమానిపై దాడి!

IND vs BAN:కాన్పూర్‌లో జరిగిన భారత్‌-బంగ్లాదేశ్ 2వ టెస్ట్ మొదటి రోజు అనూహ్య పరిణామం జరిగింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన బంగ్లా వీరాభిమాని టైగర్ రాబీపై కొందరు దాడి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి.

Indian Crowd Attacks Bangladesh Fan : కాన్పూర్‌లో భారత్‌-బంగ్లాదేశ్(IND vs BAN) మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తీవ్ర కలకలం రేగింది.  భారత అభిమానులు(Indian Fans)... బంగ్లాదేశ్‌ అభిమాని(Bangladesh Fans)పై దాడి చేశారన్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి. శరీరానికి పులిలా పెయింట్ వేసుకుని బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తున్న అభిమాని టైగర్‌ రాబీ(Tiger Robi)పై దాడి జరగడం ఇప్పుడు వైరల్‌గా మారింది. టైగర్‌ రాబీ  బంగ్లాదేశ్‌ జట్టుకు వీరాభిమానిగా గుర్తింపు ఉంది. అలాంటి వీరాభిమానిపై దాడి జరగడం.. ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో తీవ్ర చర్చకు దారి తీసింది. 

Read also: మహిళల టీ 20 ప్రపంచ కప్‌? - ఈ విషయాలు మీకు తెలుసా?

అసలేం జరిగింది..?
కాన్పూర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న  టెస్టు తొలి రోజు చివర్లో.. కొందరు స్థానిక ప్రేక్షకులు తనపై దాడి చేశారని బంగ్లాదేశ్ అభిమాని టైగర్ రాబీ ఆరోపించాడు.  బంగ్లాదేశ్ అభిమాని ఢాకాకు చెందిన టైగర్ రోబీపై గ్రీన్ పార్క్ స్టేడియంలో ప్రేక్షకులు తీవ్రంగా గాయపరిచారు. దీంతో రాబీని ఆస్పత్రికి తరలించారు. టైగర్ రాబీ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అతిపెద్ద అభిమానులలో ఒకడు. కాన్పూర్‌లో జరుగుతున్న మ్యాచ్‌ను తిలకించేందుకు బంగ్లాదేశ్ నుంచి టైగర్‌ రాబీ... భారత్‌కు వచ్చాడు. ఈరోజు మ్యాచ్‌ను చూసేందుకు టైగర్‌ రాబీ స్టేడియానికి వచ్చాడు. దాడి తర్వాత టైగర్‌ రాబీని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. టైగర్‌ రాబీకి  సంబంధించిన వీడియో ఫుటేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. " కొందరు ప్రేక్షకులు నా వీపు, పొత్తి కడుపుపై కొట్టారు. ఆ దాడితో నేను ఊపిరి పీల్చుకోలేకపోయాను." అని టైగర్ రాబీ తెలిపాడు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించాడు. "  సీ బ్లాక్ ప్రవేశ ద్వారం దగ్గర ప్రేక్షకులు ఎక్కువగా ఉండడంతో టైగర్‌ రాబీ అందులో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అతను మాట్లాడేందుకు ఇబ్బందిపడ్డాడు. వైద్యుల రిపోర్ట్ కోసం మేము ఎదురుచూస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.  

Read Also: మహిళల టీ 20 ప్రపంచకప్‌లో అద్భుత పోరాటాలు చారిత్రక క్షణాలు

టైగర్‌ రాబీ ఎవరంటే..?

‘టైగర్ రాబీ... బంగ్లాదేశ్‌ జట్టు వీరాభిమాని. తన శరీరమంతా పులిలా పెయింట్ వేసుకుని బంగ్లాదేశ్‌ను సపోర్ట్‌ చేస్తుంటాడు. బంగ్లాదేశ్‌ ఎక్కడ మ్యాచులు ఆడినా అక్కడికి వచ్చి సందడి చేస్తాడు. అందుకే రాబీని బంగ్లా క్రికెట్‌ అభిమానులు అందరూ టైగర్‌ రాబీ అని పిలుస్తుంటారు. బంగ్లాదేశ్ జెండాను ఊపుతూ సందడి చేస్తుంటాడు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే కాన్పూర్‌లో భారీ వర్షం కారణంగా తొలి రోజు ఆట త్వరగా ముగిసింది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ 35 ఓవర్లలో 107 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఆకాశ్ దీప్ 10 ఓవర్లలో 34 పరుగులిచ్చి రెండు వికెట్లు, అశ్విన్ తొమ్మిది ఓవర్లలో 22 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
Tirumala laddu issue: తిరుమల లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని మేం కోరుకోవడం లేదు.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!
తిరుమల లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని మేం కోరుకోవడం లేదు.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!
Roja Comments: భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు
భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు
Devara Day 1 Collection: బాక్సాఫీస్ బరిలో 'దేవర' జాతర... మొదటి రోజు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందంటే?
బాక్సాఫీస్ బరిలో 'దేవర' జాతర... మొదటి రోజు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Second Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లతపవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్‌ సెటైర్లు, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
సీఎం పదవిపై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్, వైరల్ అవుతున్న వీడియో
Tirumala laddu issue: తిరుమల లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని మేం కోరుకోవడం లేదు.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!
తిరుమల లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని మేం కోరుకోవడం లేదు.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!
Roja Comments: భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు
భక్తి ఇల్లె, భయం ఇల్లె;మధురై మీనాక్షి టెంపుల్‌లో రోజా ఘాటు వ్యాఖ్యలు
Devara Day 1 Collection: బాక్సాఫీస్ బరిలో 'దేవర' జాతర... మొదటి రోజు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందంటే?
బాక్సాఫీస్ బరిలో 'దేవర' జాతర... మొదటి రోజు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందంటే?
35 Oka Chinna Katha OTT Release: ఓటీటీలోకి వస్తున్న నివేదా థామస్ బ్లాక్ బస్టర్ మూవీ... స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి అంటే?
ఓటీటీలోకి వస్తున్న నివేదా థామస్ బ్లాక్ బస్టర్ మూవీ... స్ట్రీమింగ్‌ ఎప్పటి నుంచి అంటే?
UNO Assembly: ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ ప్రస్తావన- పాకిస్తాన్‌కి గట్టిగా బదులిచ్చిన భారత్ ప్రతినిధి
ఐక్యరాజ్యసమితిలో కాశ్మీర్ ప్రస్తావన- పాకిస్తాన్‌కి గట్టిగా బదులిచ్చిన భారత్ ప్రతినిధి
Ponguleti :  పొంగులేటిపై ఈడీ దాడులు వెనుక రాజకీయం - కర్ణాటక తరహాలో కాంగ్రెస్ సర్కార్ చిక్కుల్లో పడబోతోందా ?
పొంగులేటిపై ఈడీ దాడులు వెనుక రాజకీయం - కర్ణాటక తరహాలో కాంగ్రెస్ సర్కార్ చిక్కుల్లో పడబోతోందా ?
Kanpur Test Match: కాన్పూర్ వేదిక సాగుతున్న బంగ్లాదేశ్, భారత్ టెస్టు మ్యాచ్‌లో ఆడుకుంటున్న వరుణుడు- రెండో రోజు ఆట రద్దు!
కాన్పూర్ వేదిక సాగుతున్న బంగ్లాదేశ్, భారత్ టెస్టు మ్యాచ్‌లో ఆడుకుంటున్న వరుణుడు- రెండో రోజు ఆట రద్దు!
Embed widget