అన్వేషించండి
Advertisement
Womens T20 World Cup: మహిళల టీ 20 ప్రపంచకప్‌లో అద్భుత పోరాటాలు చారిత్రక క్షణాలు
T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్ దగ్గర పడుతున్న నేపధ్యంలో ప్రపంచాన్ని వరల్డ్ కప్ ఫీవర్ చుట్టేసింది. ఈ సందర్భంగా గతంలో అభిమానుల మనసును దోచుకున్న కొన్ని అద్భుత ప్రదర్శనలు తెలుసుకోండి.
Greatest Moments from ICC Womens T20 World Cup history: మహిళల టీ 20 ప్రపంచకప్ (Womens T20 World Cup) థీమ్ సాంగ్‌తో క్రికెట్ ప్రపంచమంతటా మళ్లీ వరల్డ్ కప్ ఫీవర్ వచ్చేసింది. వాటెవర్ ఇట్ టేక్స్ అంటూ సాగిన పాటతో త్వరలో ప్రారంభం కానున్న పొట్టి ప్రపంచకప్ మేనియా క్రీడా ప్రపంచాన్ని కదిలిస్తోంది. అయితే మహిళల పొట్టి ప్రపంచకప్‌లో ఎన్నో పోరాటాలు.. అభిమానుల మనసును దోచుకున్నాయి. ప్రపంచ కప్‌లో అత్యుత్తమ పోరాటాల గురించి మళ్లీ ఓసారి గుర్తు చేసుకుందాం.
2010 ఫైనల్.. ఎల్లీస్ పెర్రీ అద్భుత బౌలింగ్
టీ 20 ప్రపంచకప్‌లో అది రెండో ఎడిషన్. 2010లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఈ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్ కేవలం 106 పరుగులే చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ(Ellyse Perry) మెరిసింది. దీంతో ఆస్ట్రేలియా మొదటి టైటిల్‌ను కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ సోఫీ డివైన్ బ్యాటింగ్ చేస్తోంది. కావాల్సింది చివరి బంతికి మూడు పరుగులు. క్రికెట్ ప్రపంచం మునివేళ్లపై నిలబడి చూస్తుండగా... పెర్రీ డాట్ బాల్ వేసింది. అంతే ఆస్ట్రేలియా టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది.
అలిస్సా హేలీ.. 2020 ఫైనల్
2020లో ఆస్ట్రేలియా- భారత్ మధ్య టీ 20 ప్రపంచకప్ ఫైనల్ జరిగింది. భారత్ తొలిసారి కప్పు గెలుచుకునేందుకు ఆశగా ఎదురుచూసింది. అయితే ఆస్ట్రేలియా ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. అలిస్సా హేలీ(Alyssa Healy) విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను భారత్ నుంచి దూరం చేసింది. హీలీ కేవలం 39 బంతుల్లో 75 పరుగులు చేసి విధ్వంసం సృష్టించింది. దీంతో కంగారులు 184 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత 99 పరుగులకే కుప్పకూలి మ్యాచ్‌తో పాటు ట్రోఫీని కూడా చేజార్చుకుంది. దీంతో కంగారులు అయిదోసారి టీ 20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు.
బ్రిట్నీ కూపర్-2016
వెస్టిండీస్ బ్యాటర్ బ్రిట్నీ కూపర్ 2016 టీ 20 ప్రపంచకప్‌లో తనదైన ముద్ర వేసింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో విండీస్ ఘన విజయం సాధించి కప్పును కైవసం చేసుకుంది. 149 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన విండీస్.. మరో మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి ఓవర్‌లో హేలీ మాథ్యూస్.. స్టాఫానీ టేలర్ లక్ష్యాన్ని ఛేదించారు. కూపర్ నేతృత్వంలో విండీస్ ఈ ఘనత సాధించింది. దీంతో విండీస్ తొలి టీ 20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది.
ఆయబొంగ ఖాకా
దక్షిణాఫ్రికా బౌలర్ అయిన ఆయబొంగ ఖాకా... ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంది. సెమీ ఫైనల్లో ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి బ్రిటీష్ జట్టు వెన్ను విరిచింది. ఛేజింగ్‌లో చివరి 18 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి ఉండగా, అమీ జోన్స్ ఖాకా యొక్క 18వ ఓవర్లో మూడు వికెట్లు తీసింది. దీంతో ఇంగ్లండ్ 137/4 నుంచి 140/7కి కుప్పకూలింది. ఖాకా 4/29 తో ప్రొటీస్‌కు విజయాన్ని అందించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement