అన్వేషించండి

India vs South Africa 1st T20 Match: దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టీ 20 మ్యాచ్‌- పిచ్‌ రిపోర్టు ఏంటీ? వెదర్ ఎలా ఉంది? ఎవరెవరు ఆడనున్నారు?

IND vs SA T20I: భారత్‌ vs దక్షిణాఫ్రికా (IND vs SA) మధ్య మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇవాళ డర్బన్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌ ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఎవరెవరు ఆడతారో చూద్దాం. 

India vs South Africa 1st T20 Schedule, Live Streaming, Date, Pitch Report, Weather:సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఇవాళ (శుక్రవారం) డర్బన్‌లోని కింగ్స్‌మీడ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. బార్బడోస్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ ఫైనల్ పోరు తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి ఇంటర్నేషన్ల T20 మ్యాచ్‌ ఇదే. ఆ టోర్నీ తర్వాత టీ 20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి గుడ్‌బై చెప్పేశారు. ఇప్పుడు యువ భారత్ ఆటగాళ్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వాళ్ల ఆట తీరు ఎలా ఉంటుంది. ఎలాంటి అద్భుతాలు చేస్తారనే ఆసక్తి నెలకొంది. 

అటు దక్షిణాపిర్కా కూడా మార్‌క్రమ్‌ నేతృత్వంలో పటిష్టమైన జట్టుతో భారత్‌ను ఢీ కొట్టేందుకు సిద్దమైంది. డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, ట్రిస్టన్ స్టబ్స్ భీకరమైన బ్యాటింగ్ లైనప్‌తో మయ్ాచ్‌కు రెడీ అవుతోంది. 

తుది జట్టులో చోటు ఎవరికి(IND vs SA Predicted XI)
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, విజయ్‌కుమార్, అవేశ్‌ ఖాన్, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్.
దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, న్కాబా పీటర్, ఒట్నీల్ బార్ట్‌మన్.

వీళ్ల ఆట తీరుపై అందరి ఫోకస్ 

సంజూ శాంసన్: గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో అద్భుతంగా రాణించాడు. సెంచరీతో కదం తొక్కాడు. గత నెలలో బంగ్లాదేశ్‌తో జరిగిన T20ల్లో కూడా సెంచరీ చేసి మంచి ఫామ్‌మీద ఉన్నట్టు కనిపిస్తున్నడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాపై డర్బన్‌లో ఏం చేస్తాడనే ఆసక్తి నెలకొంది.  

హెన్రిచ్ క్లాసెన్: ఐపీఎల్‌లో రాణించలేకపోయిన క్లాసెన్‌ను హైదరాబాద్ టీం 23 కోట్లకు రిటైన్ చేసింది. ఇప్పుడు డర్బన్‌లో గేరు మార్చి మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.  
పిచ్ రిపోర్ట్‌: దక్షిణాఫ్రికా వేదికల్లో డర్బన్ స్ట్రిప్ కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది, అయినా పరుగులు వరద పారే అవకాశం లేకపోలేదు. 

వాతావరణ రిపోర్టు : Accuweather.com ప్రకారం డర్బన్‌లో శుక్రవారం సాయంత్రం అక్కడక్కడ ఉరుములు, వర్షం కురిసే అవకాశం ఉంది. ఇది రిథమ్‌ను పాడు చేసే అవకాశం ఉందంటున్నారు. 

భారత జట్టు: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(w), సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, విజయ్‌కుమార్ వ్యాషాక్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, యశ్ దయాల్, రవి బిష్ణోయ్, రమణదీప్ సింగ్ , జితేష్ శర్మ.

దక్షిణాఫ్రికా జట్టు: రీజా హెండ్రిక్స్, ర్యాన్ రికెల్టన్(w), ఐడెన్ మార్క్‌రామ్(c), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, గెరాల్డ్ కోయెట్జీ, న్కాబయోమ్జి పీటర్, ఒట్నీల్ బార్ట్‌మాన్, డోనోవన్ ప్యాట్రిక్ మ్పెరీరాంగ్ క్రుగర్.

Also Read: కెప్టెన్‌తో గొడవ- మ్యాచ్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయిన విండీస్‌ బౌలర్‌

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Embed widget