IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మూడో వన్డేకు వర్షం అడ్డంకి కానుందా!
అక్టోబర్ 11న(మంగళవారం) భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో నిర్ణయాత్మక మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మొదటి మ్యాచ్ లా వర్షం అడ్డంకులను సృష్టిస్తుందా? ఢిల్లీ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం
IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ లక్నోలో జరిగింది. అక్కడ వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా ఆ మ్యాచ్ 40ఓవర్లకు కుదించి ఆడించారు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 9 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇది నిర్ణయాత్మక మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఢిల్లీ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఢిల్లీలో వర్షావరణం
ఈ రోజుల్లో ఢిల్లీలో వర్షం చితక్కొటేసింది. పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మూడో వన్డే మ్యాచ్ పై వర్షం నీడలు కమ్ముకున్నాయి. ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం మ్యాచ్ గురించి స్పష్టంగా ఏమీ చెప్పలేం కానీ... ప్రస్తుత పరిస్థితి మాత్రం అంత సానుకూలంగా కనిపించడం లేదు.
#DelhiWeather MONSOON + INDIA GATE = BEST COMBINATION 😍💙#Delhi #DelhiRains #DelhiMonsoon#monsoon #Monsoon2022 #Dilli #Dilliwale #SoDelhi #Delhite #weather @shubhamtorres09
— Delhi-NCR Weatherman ☀️🥵⛈️🥶 (@SouravSaxena_17) October 10, 2022
📸 Siddharth Jain pic.twitter.com/AkWndch2D1
మ్యాచ్ జరిగే రోజు ఇలా ఉండొచ్చు
వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం మ్యాచ్ జరిగే రోజు అంటే అక్టోబర్ 11న ఉదయం 10 గంటల వరకు ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో స్టేడియం దానిని ఎదుర్కోవటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తుతుంది.
Arun Jaitley Stadium pitch report: 3rd ODI IND vs SA Delhi stadium pitch report pic.twitter.com/ddAh0xlt2O
— Ayyat Shakeel (@AyyatShakeel) October 10, 2022
ఒకవేళ వాతావరణ శాఖ సమాచారం సరైనదే అయితే, మ్యాచ్ సమయానికి స్టేడియం ఎండిపోగలదా? మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ విషయాల రేపు(మంగళవారం) మాత్రమే స్పష్టత రానుంది. వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే సిరీస్ 1-1తో సమం అవుతుంది.