(Source: ECI/ABP News/ABP Majha)
MS Dhoni - Dinesh Karthik: డీకేను పొగిడేందుకు ధోనీపై పంచ్‌లేసిన ఆకాశ్ చోప్రా!!
Dinesh Karthik: లేటు వయసులోనూ ధాటిగా ఆడుతున్న దినేశ్ కార్తీక్‌పై (Dinesh Karthik) టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు.
Aakash Chopra Took A Dig At MS Dhoni While Praising Dinesh Karthik : లేటు వయసులోనూ ధాటిగా ఆడుతున్న దినేశ్ కార్తీక్‌పై (Dinesh Karthik) టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసలు కురిపించాడు. ఎంఎస్ ధోనీ (MS Dhoni) కన్నా ముందే అరంగేట్రం చేసినప్పటికీ ఇంకా కొనసాగుతున్నాడని పొగిడాడు. అతడిలో కసి రోజురోజుకీ మరింత తీవ్రంగా కనిపిస్తోందని పేర్కొన్నాడు. తన బాధ్యతలపై అత్యంత స్పష్టతతో కొనసాగుతున్నాడని వివరించాడు. ఆకాశ్‌వాణి యూట్యూబ్ ఛానల్లో డీకే గురించి ఆకాశో చోప్రా మాట్లాడాడు.
'దినేశ్ కార్తీక్ వస్తున్న స్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. అతడు ఆడుతున్న విధానం మాత్రం అద్భుతం. ఎంతో తెలివిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడిది సుదీర్ఘ కెరీర్. డీకే అరంగేట్రం తర్వాత వచ్చిన ఎంఎస్ ధోనీ పూర్తి అంతర్జాతీయ కెరీర్ మూడేళ్ల క్రితమే ముగిసింది. అతడు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాడు' అని ఆకాశ్ చోప్రా అన్నాడు.
Also Read: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ
'మరోసారి డీకేలోని ఆకలి బయటకు కనిపిస్తోంది. అతడి గేమ్ ప్లాన్, పోషిస్తున్న పాత్రపై ఎంతో స్పష్టత ఉంది. సంప్రదాయానికి భిన్నంగా, ఆధునిక షాట్లతో అతడు రెచ్చిపోతున్నాడు. నిజానికి డెత్ ఓవర్లలో అదే అవసరం. స్పెషలిస్టు డెత్ బ్యాటర్‌గా ఉండటం అత్యంత కష్టం. ప్రపంచంలో దానికి మించి సంక్లిష్టమైంది మరోటి లేదు' అని ఆకాశ్ అన్నాడు.
కొన్ని రోజులుగా దినేశ్ కార్తీక్ భిన్నంగా ఆడుతున్నాడు. తనలోని ఫైర్ పవర్‌ను బయటకు తీసుకొచ్చాడు. ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో వచ్చి అద్భుతంగా మ్యాచులను ముగించాడు. 183 స్ట్రైక్‌రేట్‌తో 330 పరుగులు సాధించాడు. అందులో 251 పరుగులు 207 స్ట్రైక్‌రేట్‌తో ఆఖరి నాలుగు ఓవర్లలో వచ్చినవే కావడం ప్రత్యేకం. రాజ్‌కోట్‌లో దక్షిణాఫ్రికా పైనా 27 బంతుల్లో 55 పరుగులు చేసి శెభాష్ అనిపించుకున్నాడు.
Also Read: మాస్క్‌లు మర్చిపోవద్దు- టీమిండియాకు బీసీసీఐ స్వీట్ వార్నింగ్
5⃣0⃣ for @DineshKarthik! 👏 👏
— BCCI (@BCCI) June 17, 2022
A cracking knock this is as he brings up a 26-ball half-century. 👌 👌
Follow the match ▶️ https://t.co/9Mx4DQmACq #TeamIndia | #INDvSA | @Paytm pic.twitter.com/maOXqIIOf6
Innings Break! @DineshKarthik & @hardikpandya7 starred with the bat as #TeamIndia post 169/6 on the board. 👏 👏
— BCCI (@BCCI) June 17, 2022
Over to our bowlers now. 👍 👍
Scorecard ▶️ https://t.co/9Mx4DQmACq #INDvSA | @Paytm pic.twitter.com/X3YBMFM7tV