అన్వేషించండి

Ind vs Nz T20I: సంజూ శాంసన్‌ మ్యాచ్ విన్నర్.. అతడు జట్టులో ఉండాలన్న మాజీ క్రికెటర్, నెక్ట్స్ మ్యాచ్ డిసైడ్ చేస్తుందా?

T20 World Cup | భారత జట్టులో స్థానం ఉంటుందా లేదా అని సంజూ శాంసన్‌పై చర్చ జరుగుతుండగా.. మాజీ క్రికెటర్ అజింక్య రహానే వికెట్ కీపర్ బ్యాటర్‌కు మద్దతుగా నిలిచాడు. అతడు జట్టులో ఉండాలని పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లు గెలిచి టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయినప్పటికీ, ఒక పేరు మాత్రం ఇటీవల చర్చల్లో ఉంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఈ టీ20 సిరీస్‌లో ఇప్పటివరకు పరుగులు సాధించలేదు. అందుకే అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తిరిగి జట్టులోకి రానుండటంతో, ప్లేయింగ్ ఎలెవన్ నుండి ఎవరు బయటకు వెళ్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ విషయంపై మాజీ ఓపెనర్ అజింక్యా రహానే కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

 ఫామ్‌లో లేన్నప్పటికీ సంజుపై నమ్మకం

న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత, సాధారణంగా ఏ ఆటగాడిపైనైనా ఒత్తిడి పెరుగుతుంది. కానీ సంజూ శాంసన్ విషయంలో కథ కొంచెం డిఫరెంట్‌గా ఉంది. జట్టుతో పాటు బయటి నుంచి సైతం అతనికి మద్దతు లభిస్తోంది. మాజీ భారత కెప్టెన్ అజింక్యా రహానే వికెట్ కీపర్ బ్యాటర్ శాంసన్‌కు మద్దతు తెలిపాడు. అతడు ఫాంతో సంబంధం లేకుండా భారీ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్ అని కితాబిచ్చాడు. కేవలం కొన్ని మ్యాచులలో ప్రదర్శన ఆధారంగా సంజూను అంచనా వేయకూడదని అన్నారు. టీ20 క్రికెట్‌లో విఫలం కావడం స్టార్ బ్యాటర్లకు సైతం సర్వసాధారం. ఇది ఆటగాడి సామర్థ్యాన్ని తగ్గించదంటూ సంజూకు రహానే సపోర్ట్ ఇచ్చాడు. 

సంజూకు అవకాశం ఇవ్వాలి

అజింక్యా రహానే చెప్పేది ఏంటంటే, సంజు శాంసన్ ఒక మ్యాచ్ విన్నర్ ఆటగాడు. కనుక టీ20 ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్‌లలో ఇలాంటి ఆటగాళ్లు అవసరం. మేనేజ్‌మెంట్ అతడిపై నమ్మకం ఉంచాలని, ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అతిపెద్ద బలం  అన్నారు. సంజు తనపై నమ్మకం ఉంచుకుని ఒత్తిడి లేకుండా ఆడితే, పరుగులు సాధిస్తాడని రహానే అభిప్రాయపడ్డారు.

ఇషాన్ కిషన్ కు ఛాన్స్ లభిస్తుందా..

ప్లేయింగ్ లెవన్ విషయానికి వస్తే, రహానే ఎంపిక స్పష్టంగా ఉంది. తిలక్ వర్మ తిరిగి వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్ జట్టు నుంచి బయటకు వెళ్లవలసి రావచ్చు. శాంసన్ ఫామ్‌లోకి రావడానికి మరికొంత సమయం ఇవ్వాలని రహానే అన్నారు. ప్రారంభ ఓవర్లలో జాగ్రత్తగా ఆడిన తర్వాత సంజూ తన సహజ ఆటను ఆడగలడని రహానే అన్నారు. అటువంటి పరిస్థితిలో వికెట్ కీపర్ బ్యాటర్‌కు వరుస అవకాశాలు లభించడం చాలా ముఖ్యం అన్నారు.

తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే..

భారత్ తరువాత టీ20 మ్యాచ్ జనవరి 28న విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ సంజూ శాంసన్‌కు చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడితే, ప్లేయింగ్ ఎలెవన్‌లో అతని స్థానంపై ఢోకా ఉండదు. అయితే, పరుగులు చేయడంలో మళ్లీ ఫెయిల్ అయితే మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ కఠిన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఎందుకంటే కొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ సమయంలో కోచ్, బీసీసీఐ ఎటువంటి రిస్క్ తీసుకోదు. ఫాం లేని కారణంగా శుభ్‌మన్ గిల్‌ను టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు ఎంపిక చేయలేదన్న విషయాన్ని క్రికెట్ ఫ్యాన్స్ గమనించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

BCCI Injury Crisis: సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
సీఓఈ సెంటర్ లో 13 మంది ప్లేయర్లకు ట్రీట్‌మెంట్.. బుమ్రా రీ-ఎంట్రీపై సస్పెన్స్, హార్దిక్ పాండ్యా గాయంపై అప్డేట్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Samantha : సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
సమంత లేటెస్ట్ ఫోటో షూట్ - ఆగస్ట్ ఎనర్జీ అంటూ...
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
Bikes Under 10000 Down Payment: పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
పదివేలు చేతిలో ఉంటే ఈ బైక్‌లు సొంతం చేసుకోవచ్చు! పూర్తి EMI లెక్కలు ఇవే!
Embed widget