అన్వేషించండి
Advertisement
ICC World Cup 2023: మరో విజయంపై ప్రొటీస్ కన్ను, బంగ్లాదేశ్‌తో దూకుడుగా బరిలోకి
ICC World Cup 2023 : ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయంపై కన్నేసింది. దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియాలను వందకుపైగా పరుగులతో చిత్తు చేసిన ప్రొటీస్ జట్టు... బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మరో విజయంపై కన్నేసింది. శ్రీలంక, ఆస్ట్రేలియాలను వందకుపైగా పరుగులతో చిత్తు చేసిన ప్రొటీస్ జట్టు... బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లోనూ గెలవాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. పతకాల పట్టికలో సఫారీ జట్టు మూడో స్థానంలో ఉండగా... బంగ్లా ఏడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీస్‌కు మరింత చేరువ కావాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. ప్రొటీస్‌పై గెలిచి సెమీస్ రేసులో నిలవాలని బంగ్లా కూడా ప్రణాళిక రచిస్తోంది. ఇప్పటికే నెదర్లాండ్స్ చేతిలో ఓడి షాక్ తిన్న సఫారీ జట్టు... మరోసారి అలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకూడదని చూస్తోంది. గత మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఇంగ్లాండ్‌ను 229 పరుగుల తేడాతో చిత్తు చేసి మళ్లీ గాడిలో పడిన దక్షిణాఫ్రికా... బంగ్లాదేశ్ మ్యాచ్‌తోనూ భారీ స్కోరుపై కన్నేసింది.
తేలిగ్గా తీసుకుంటే...
ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ చాలా ప్రమాదకరమైన జట్టు కావడంతో దక్షిణాఫ్రికా దానికి తగ్గట్లు వ్యూహాలు రచిస్తోంది. గత నాలుగేళ్లలో బంగ్లాదేశ్.... ఆరుసార్లు సఫారీ జట్టును ఓడించింది. 2019 ప్రపంచకప్‌లో 21 పరుగుల తేడాతో ప్రొటీస్‌ను బంగ్లా పులులు ఓడించాయి. 2007, 2011, 2015, 2019 ప్రపంచకప్‌లలో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు బంగ్లా-సౌతాఫ్రికా మధ్య జరగగా అందులో రెండుసార్లు దక్షిణాఫ్రికా ఓడిపోయింది. 2007, 2019 ప్రపంచకప్‌లలో ప్రొటీస్‌పై బంగ్లా గెలిచింది. బంగ్లా సారథి షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్ రాణిస్తే బంగ్లా గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డి కాక్ ప్రపంచకప్ ఆరంభ మ్యాచుల్లో వరుసగా రెండు సెంచరీలు చేసి ఫామ్‌లో ఉన్నాడు. అయితే తర్వాతి మ్యాచుల్లో అతడు రాణించకపోవడం ప్రొటీస్ జట్టును కలవరపరుస్తోంది. ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో కేవలం నాలుగు పరుగుకే డికాక్ అవుటయ్యాడు. అయినా ప్రోటీస్... బ్రిటీష్ జట్టు ముందు 400 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టెంబా బావుమా అనారోగ్యం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు అతడు కోలుకోవడంతో తిరిగి జట్టులోకి రానున్నాడు. బవుమా జట్టులోకి వస్తే రీజా హెండ్రిక్స్ పై వేటు పడనుంది. ఐడెన్ మార్క్రామ్, రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌లు భీకర ఫామ్‌లు ఉండడంతో ప్రొటీస్‌కు బ్యాటింగ్‌లో తిరుగులేదు. డేవిడ్ మిల్లర్ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. ఇంగ్లండ్‌పై శతకం చేసిన హెన్రిచ్ క్లాసెన్... బంగ్లాదేశ్‌పైనా రాణించాలని పట్టుదలతో ఉన్నాడు.
బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఈ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రాక్టీస్ సెషన్‌లో షకీబ్ బౌలింగ్ చేయకపోవడం బంగ్లా జట్టును ఆందోళన పరుస్తోంది. అక్టోబర్ 13న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ గాయపడ్డాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆడలేదు. బంగ్లా బ్యాటర్లు టాంజిద్ హసన్, లిట్టన్ దాస్ భారత్‌పై హాఫ్ సెంచరీలు సాధించారు. కానీ బంగ్లాదేశ్ బ్యాటర్లు భారీ స్కోరు చేయడం లేదు. బ్యాటింగ్‌కు అనుకూలమైన వాంఖడే పిచ్‌పై బంగ్లా బ్యాటర్లు రాణించే అవకాశం ఉంది.
స్క్వాడ్‌లు:
బంగ్లాదేశ్:
షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), లిట్టన్ దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో , తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిదీ హసన్ మిరాజ్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, తస్కిన్ , ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహమూద్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్.
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగీ న్గిడి, ఆండిలే ఫెహ్లుక్వాయో, కగిసో రబాడ షమ్సీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాడ్ విలియమ్స్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement