అన్వేషించండి

IND vs PAK Super 4 Match: పీసీబీకి మరో దారుణ అవమానం - భారత్, పాక్ మ్యాచ్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్

Andy Pycroft match referee for India vs Pakistan | ఆసియా కప్ 2025లో సూపర్ 4లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు సైతం రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ వ్యవహరించనున్నారు. ICCసీ ఈ నిర్ణయం తీసుకుంది

IND vs PAK Super 4 Match: దుబాయ్: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌ సమయంలో తలెత్తిన "హ్యాండ్‌షేక్‌" వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన జింబాబ్వే మాజీ క్రికెటర్‌ ఆండి పైక్రాఫ్ట్‌ (Andy Pycroft) మళ్లీ ఆదివారం దుబాయ్‌ వేదికగా జరగబోయే Super4 మ్యాచ్‌కు మ్యాచ్‌ రెఫరీగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ESPNcricinfo తెలియజేసింది. ఆసియా కప్‌లో సెప్టెంబర్‌ 14న భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ ఘోర పరాజయం అనంతరం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మ్యాచ్‌ రెఫరీ ఆండి పైక్రాఫ్ట్‌ ను వెంటనే తీసేయాలని డిమాండ్ చేసింది. వారి ఆరోపణల ప్రకారం, పైక్రాఫ్ట్‌ గ్రూప్‌ దశలో టాస్ సమయంలో కెప్టెన్లు అఘా సల్మాన్, సూర్యకుమార్ యాదవ్‌ హ్యాండ్‌షేక్‌ చేయవద్దని చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) డిమాండ్‌ను తిరస్కరించింది, దాంతో పైక్రాఫ్ట్ తన స్థానంలోనే కొనసాగారు. అయితే ఈ వివాదం అక్కడితో ఆగలేదు. యుఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌కి ముందే పాకిస్థాన్‌ జట్టు ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేయడమే కాకుండా, మ్యాచ్‌కు కూడా ఆలస్యంగా రావడంతో 1 గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 

అదే వేదిక.. అదే సీన్ రిపీట్ అవుతుందా..

ఈ ఆలస్యం కారణంగా, పాకిస్థాన్ ఆటగాళ్లను హోటల్‌లోనే ఉంచి, PCB అధికారులు ICCతో చర్చలు జరిపినట్టు సమాచారం. యుఏఈతో టాస్‌కు కొన్ని క్షణాల ముందు, పాకిస్థాన్ జట్టు యాజమాన్యం పైక్రాఫ్ట్‌ను కలవడం మరో కొత్త వివాదానికి దారి తీసింది. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను PCB సోషల్ మీడియాలో పంచగా, తర్వాత వెంటనే తొలగించారు. ఇప్పుడు ఈ రెండు జట్లు మళ్లీ అదే వేదికపై తలపడబోతున్నాయి. తొలగించాలని పాక్ కోరిన ఆండి పైక్రాఫ్ట్‌ భారత్, పాక్ మధ్య జరగనున్న సూపర్ 4 మ్యాచ్‌కు సైతం రిఫరీగా వ్యవహరించనుండటం పాక్‌కు మింగుడు పడటం లేదు. ఈసారి పాక్ మ్యాచ్ ను బాయ్‌కాట్ చేస్తుందా, లేక రిఫరీని తొలగిస్తేనే మ్యాచ్ ఆడతామని డిమాండ్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

వివాదాలకంటే మా పనిపైనే దృష్టి – సూర్యకుమార్ యాదవ్
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ప్రశాంతంగా జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "టోర్నమెంట్‌కు ముందు మా ప్రిపరేషన్‌ బాగా జరిగింది. మేము 3 మంచి మ్యాచులు ఆడాం. మేం చేయగలిగిన దానిపై దృష్టి పెట్టుతున్నాం. గత 2-3 మ్యాచ్‌లలో ఏర్పడిన మంచి అలవాట్లను కొనసాగించాలని చూస్తున్నాం. ఒక్కో మ్యాచ్‌ను గెలుచుకుంటూ వెళ్లడమే మాకు ముఖ్యం. గత మ్యాచ్ గెలవడం అడ్వాంటేజ్ కాదు. ఇది కొత్త మ్యాచ్. బాగా ఆడిన జట్టే గెలుస్తుంది’ అని అన్నాడు.

భారత జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Embed widget