అన్వేషించండి
Advertisement
Hardik Pandya : హార్దిక్‌కు గాయం, ఆందోళనలో టీమిండియా
ODI World Cup 2023: జట్టులో అన్ని విభాగాలు పటిష్టంగా రాణిస్తున్న వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడం రోహిత్ సేనను ఆందోళనకు గురిచేస్తోంది.
స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను... ఇప్పుడు హార్దిక్ పాండ్యా గాయం కలవరపెడుతోంది. జట్టులో అన్ని విభాగాలు పటిష్టంగా రాణిస్తున్న వేళ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడడం రోహిత్ సేనను ఆందోళనకు గురిచేస్తోంది. బాల్‌తో పాటు బ్యాట్‌తోనూ రాణించే సామర్ధ్యం ఉన్న హార్దిక్ గాయం తీవ్రమైనదే అయితే అది టీమిండియాకు కోలుకోలేని దెబ్బగా మారుతుందని మాజీలు విశ్లేషిస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఉపయుక్తమైన బ్యాటర్‌గానూ మిడిల్ ఓవర్లలో పేసర్‌గా హార్దిక్ పాండ్యా సేవలు జట్టుకు అవసరం. అయితే అంతా బాగుండి ముందుకు సాగుతున్న సమయంలో హార్దిక్ గాయపడ్డాడు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న హార్దిక్ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. కానీ ఇప్పుడు గాయంతో హార్దిక్ దూరమైతే జట్టు సమతూకం దెబ్బతినే ప్రమాదముంది. టీమ్‌ఇండియా రెండు పెద్ద మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ నెల 22న న్యూజిలాండ్‌తో 29న ఇంగ్లాండ్‌తో భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్ సెమీస్ చేరుతుంది. కీలకమైన ఈ మ్యాచ్‌లకు ముందు హార్దిక్ దూరమైతే టీమ్‌ఇండియాకు సవాల్ తప్పదు. అయితే హార్దిక్ గాయం ఎంత తీవ్రమైనదన్న దానిపై బీసీసీఐ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
అసలేం జరిగింది
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా... బౌలింగ్ చేస్తుండగా కుడి కాలు చీలమండకు గాయమైంది. మూడో బంతిని లిటన్ దాస్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. దీన్ని కుడి కాలితో ఆపే ప్రయత్నంలో హార్దిక్ చీలమండ బెణికింది. జారి కిందపడ్డ అతను తీవ్రమైన నొప్పితో అల్లాడాడు. సరిగ్గా నిలబడలేకపోయాడు. చికిత్స అనంతరం బౌలింగ్ చేద్దామని ప్రయత్నించినా హార్దిక్ వల్ల కాకపోవడంతో ఈ స్టార్ ఆల్‌రౌండర్ పెవిలియన్ చేరాడు. మళ్లీ మ్యాచ్‌లో హార్దిక్ బరిలో దిగలేదు. స్కానింగ్ కోసం హార్దిక్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. హార్దిక్‌కు పెద్ద గాయమేం కాలేదని మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. అయితే తర్వాత మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండేది లేని దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.
టీమిండియాకు ఆందోళనే
ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ టీమిండియా నాలుగు వికెట్ల కంటే ఎక్కువ కోల్పోలేదు. దీంతో మిగిలిన వారి ఇంతవరకు బ్యాటింగ్‌లో బరిలోకి దిగలేదు. ఒకవేళ టాప్‌ఆర్డర్ విఫలమైతే మిడిలార్డర్‌లో హార్దిక్ లాంటి బ్యాటర్ జట్టుకు అవసరం. కీలక సమయంలో హార్దిక్ ధాటిగా బ్యాటింగ్ చేయలగలడు. సంయమనంతో కూడిన ఆటతో జట్టును విజయం వైపు నడిపించగలడు. బౌలింగ్‌లోనూ బుమ్రా, సిరాజ్ లతో కలిసి హార్దిక్ పేస్ భారాన్ని మోస్తున్నాడు. పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై హార్దిక్ బౌన్సర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. బుమ్రా, సిరాజ్ తర్వాత బౌలింగ్ మార్పు కోసం రోహిత్ బంతిని హార్దిక్‌కే ఇస్తున్నాడు. ఆస్ట్రేలియాపై ఓ వికెట్ పడగొట్టిన హార్దిక్.. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌తో మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు సాధించాడు. ప్రపంచకప్‌లో రానున్నవి కీలక మ్యాచ్‌లు కావడంతో హార్దిక్ త్వరగా కోలుకుని జట్టులో చేరితే టీమిండియాకు బలం చేకూరుతుంది. ఇప్పటికే హార్దిక్ కాలుకు స్కానింగ్ తీశారు. కాబట్టి గాయం తీవ్రతమై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయవచ్చు. ఈనెల 22న న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో హార్దిక్ బరిలోకి దిగాలని మాత్రం అభిమానులు కోరుకుంటున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
సినిమా
విశాఖపట్నం
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion