అన్వేషించండి

BCCI Prize Money: టీమిండియాపై బీసీసీఐ కనకవర్షం, టీ20 వరల్డ్ కప్ నెగ్గిన జట్టుకు భారీ నజరానా

BCCI Cash Prize For Team India | టీ20 వరల్డ్ కప్ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. టీమిండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేసింది.

BCCI announces prize money for Team India | న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ కనక వర్షం కురిపించింది. టీ20 వరల్డ్ కప్ 2024 నెగ్గిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బార్బడోస్ వేదికగా శనివారం (జూన్ 29) రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీ నెగ్గిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానాతో కనకవర్షం కురిపించింది. 

‘టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఐసీసీ మెగా టోర్నీలో భారత జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఆటగాళ్లు ధృడ సంకల్పంతో ఆడి, అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన భారత ఆటగాళ్లు, కోచ్‌లతో పాటు సహాయక సిబ్బంది అందరికీ అభినందనలు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పోస్ట్ చేశారు.

T20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ - ఏ జట్టుకు ఎంత వచ్చింది వివరాలు
టీ20 ప్రపంచ కప్ మొత్తం ప్రైజ్ మనీ 11.25 మిలియన్ డాలర్లు కాగా, దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ. 93.5 కోట్లకు సమానం. T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు, అంటే రూ. 20 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా కనీసం 1.28 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.10.64 కోట్లు దక్కుతాయి. కనీసం సెమీఫైనల్స్ చేరుకున్న ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు రూ.6.56 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ లభించింది. సూపర్ 8కు చేరిన జట్లు అమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్  లకు రూ. 3.18 కోట్ల చొప్పున వస్తుంది.

9 నుంచి 12 స్థానాల్లో నిలిచిన పాకిస్తాన్, స్కాట్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక ఒక్కో జట్టుకు దాదాపు రూ.2.06 కోట్లు - 13 నుంచి 20 వరకు స్థానాల్లో ఉన్న జట్లు నెదర్లాండ్స్, నేపాల్, ఉగాండా, పాపువా న్యూ గినియా, నమీబియా, ఒమన్, ఐర్లాండ్, కెనడాలకు రూ.1.87 కోట్లు వచ్చాయి. సెమీఫైనల్స్, ఫైనల్ మినహా గెలిచిన ఇతర ఒక్కో మ్యాచ్‌కు 31,154 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.26 లక్షల చొప్పున అందుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget