అన్వేషించండి

IND vs PAK: స్పిన్ బ్లిట్జ్! వరుస బంతుల్లో వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. భారత్ కంట్రోల్‌లోనే మ్యాచ్

IND vs PAK Asia Cup 2025 | భారత్ పేస్, స్పిన్ బౌలింగ్‌తో పాక్ జట్టు మీద ఆధిపత్యం చెలాయించింది. బుమ్రా, హార్దిక్, అక్షర్, కుల్దీప్ రాణించడంతో పాక్ తక్కువ స్కోరుకే పరిమితం అయింది.

Asia Cup 2025 IND vs PAK | దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్‌ను కుల్దీప్ యాదవ్ దెబ్బతీశాడు. 3 వికెట్లు తీయడంతో భారత్ స్పిన్ దాడి ఆశించిన స్థాయిలోనే ఉంది. కుల్దీప్ దాటికి 7 వికెట్లు కోల్పోయి పాక్ కష్టాల్లో పడింది. అంతకుముందు పేసర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా తొలి రెండు ఓవర్లలోనే సాయిమ్ అయూబ్‌ను గోల్డెన్ డక్‌గా, మహ్మద్ హారిస్‌ను అవుట్ చేయడం ద్వారా భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.

తొలి బంతికే వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా..

తరువాత అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీసి పాక్ జట్టును దెబ్బకొట్టాడు. ఫఖర్ జమాన్, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాను అవుట్ చేయడంతో పాక్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. తరువాత కుల్దీప్ యాదవ్ వికెట్ల వేట మొదలైంది. కుల్దీప్ యాదవ్ ఈ ఊపును కొనసాగిస్తూ, తన ఓవర్ మూడో బంతికి హసన్ నవాజ్‌కు క్యాచ్ మిస్ చేశాడు. కానీ తర్వాతి బంతికే నవాజ్‌ను LBWగా పెవిలియన్ చేర్చాడు. రివ్యూలో బంతి లెగ్ స్టంప్‌లోకి వెళుతున్నట్లు తేలడంతో ఔటయ్యాడు. మరుసటి బంతికే హసన్ నవాజ్ గోల్డెన్ డక్‌గా 0 పరుగులు చేసి అవుట్ అవ్వడంతో పాకిస్తాన్ 6 వికెట్లు కోల్పోయింది. తరువాత 7వ వికెట్ కుల్దీప్ ఖాతాలోనే చేరింది. ఫర్హాన్ ను కూడాకుల్దీప్ ఔట్ చేశాడు. పాక్ జట్టుపై మరింత ఒత్తిడిని పెంచాడు. పాక్ ఓపెనర్ ఫర్హాన్ (44 బంతుల్లో 40 పరుగులు, 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. మరో ఓపెనర్ సయిమ్ ఆయుబ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
 చివర్లో లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆష్రఫ్ (11), షాహిన్ షా ఆఫ్రిది (16 బంతుల్లో 33 నాటౌట్), ముఖీమ్ (10) పరుగులు చేయకపోతే పాక్ స్కోరు వంద కూడా దాటేది కాదు.  కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 

బుమ్రా, పాండ్యాల ప్రారంభ వికెట్లతో పాటు అక్షర్, కుల్దీప్‌ల స్పిన్ దాడితో భారత్ వేగం, స్పిన్‌ల కలయిక ఈ పోటీని పూర్తిగా తమ వైపు తిప్పుకుంది. పాకిస్తాన్ లోయర్ ఆర్డర్ శ్రమించడంతో పాక్ వంద పరుగులు దాటించింది.

బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కెప్టెన్

టాస్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్‌లతో కూడిన తమ ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతోనే కొనసాగాలని నిర్ణయించుకుంది. IND vs PAK మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేతికి గాయమైనప్పటికీ బ్యాటింగ్ లైనప్ మారలేదు. గత మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాని సంజు శాంసన్, పాకిస్తాన్ బౌలింగ్ దాడిని ఎదుర్కోవాలని సిద్ధంగా ఉన్నాడు.

మరోవైపు, పాకిస్తాన్ కూడా ఈ హై-స్టేక్స్ ఎన్‌కౌంటర్ కోసం స్పిన్-హెవీ వ్యూహంతో ముందుకు సాగింది. హెడ్ కోచ్ మైక్ హెస్సన్ ఇటీవల ప్రస్తుత ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా పేర్కొన్న మహ్మద్ నవాజ్‌పై అందరి దృష్టి ఉంది, ఈ కీలకమైన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో భారత్‌ను సవాలు చేయడానికి జట్టు చూస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Embed widget