IND vs PAK Asia Cup 2025: భారత్, పాక్ మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం.. షేక్ హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు
Pakistan have won the toss and will bat first | ఆసియా కప్ లో గ్రూప్ స్టేజీలో భారత్ తో మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసియా కప్ 2025లో ఇది హై వోల్టేజ్ మ్యాచ్ గా మారనుంది. అయితే స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ మీద పరుగుల వర్షమా, లేక బౌలర్ల ప్రతాపమా మరికొంత సమయానికే తేలిపోతుంది. టాస్ సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. పహాల్గం ఉగ్రదాడి ఘటనే ఇందుకు కారణమని చెప్పవచ్చు.
టీమిండియా ప్లేయింగ్ 11: 1 అభిషేక్ శర్మ, 2 శుభ్‌మన్ గిల్, 3 సంజు శాంసన్ (వికె), 4 సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), 5 తిలక్ వర్మ, 6 శివమ్ దూబే, 7 హార్దిక్ పాండ్యా, 8 అక్షర్ పటేల్, 9 కుల్దీప్ యాదవ్, 10 జస్ప్రీత్ బుమ్రా, 11 వరుణ్ చక్రవర్తి
Asia Cup 2025. Pakistan won the toss and elected to Bat. https://t.co/D7cDABHqaf #INDvPAK #AsiaCup2025
— BCCI (@BCCI) September 14, 2025
పాకిస్థాన్ ప్లేయింగ్ 11: 1 సాహిబ్జాదా ఫర్హాన్, 2 సైమ్ అయూబ్, 3 ఫఖర్ జమాన్, 4 సల్మాన్ అఘా (కెప్టెన్), 5 హసన్ నవాజ్, 6 మహ్మద్ హరీస్ (వికెట్), 7 మహ్మద్ నవాజ్, 8 ఫహీమ్ అష్రఫ్, 9 షాహీన్ షా ఆఫ్రిది, 10 సుఫియాన్ ముఖీమ్, అహ్మద్ ముఖీమ్
టోర్నీ ఘనంగా ఆరంభించిన భారత్, పాక్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆసియా కప్ లో 6వ మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ తలపడుతున్నాయి. టోర్నీలో రెండు జట్లు తమ ప్రదర్శనను ఘనంగా ప్రారంభించాయి, భారతదేశం 9 వికెట్ల తేడాతో యూఏఈపై విజయం సాధించగా.. పాకిస్తాన్ ఒమన్‌ను 93 పరుగుల తేడాతో ఓడించింది.
రోకో ద్వయం.. బాబర్, రిజ్వాన్ ద్వయం లేకుండా మ్యాచ్..
భారత్, పాక్ అభిమానులకు ఈ మ్యాచ్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. దాదాపు దశాబ్దం తరువాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇటు బాబర్-రిజ్వాన్‌ల ద్వయం లేకుండా మ్యాచ్ ఆడుతున్నారు. పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ ద్వయం కట్టడి చేయడం కీలకం కానుంది. ఫఖర్ జమాన్, మహ్మద్ హారిస్ పాకిస్తాన్ బ్యాటింగ్ కు వెన్నెముకగా మారారు. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం పాక్ జట్టుకు ప్లస్ పాయింట్.
ఆసియా కప్ T20 ఫార్మాట్‌లో భారతదేశం స్వల్ప ఆధిక్యంలో ఉంది. పాకిస్తాన్ ను భారత్ రెండుసార్లు ఓడించగా, పాకిస్తాన్ ఒకసారి గెలిచింది. T20I లలో ముఖాముఖి పోరు గమనిస్తే.. రెండు జట్ల మధ్య జరిగిన 13 మ్యాచ్‌లు జరగగా భారతదేశం 10 విజయాలతో ఆధిపత్యం చెలాయించింది, పాకిస్తాన్ కేవలం 3 విజయాలు సాధించింది.
No handshake between Salman Ali Agha and SKY at the toss. 👀 pic.twitter.com/ue33JeGxPC
— Sheri. (@CallMeSheri1_) September 14, 2025
సల్మాన్ అఘా (పాకిస్తాన్ కెప్టెన్)
"మేము ముందుగా బ్యాటింగ్ చేయాలని భావించాం. టీం బాగా ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మంచి క్రికెట్ ఆడటంపైనే మా దృష్టి ఉంది. పిచ్ నెమ్మదిగా కనిపిస్తుంది, కాబట్టి బిగ్ స్కోరు చేసి, ఆపై భారత బ్యాటర్లను కట్టడి చేయాలని అనుకుంటున్నాం. మేము అదే ప్లేయింగ్ ఎలెవెన్‌తో ఆడుతున్నాం. దుబాయ్‌లో స్పిన్ ఎల్లప్పుడూ కీలకం అవుతుంది. ఈ పరిస్థితులు మాకు బాగా తెలుసు. అందుకోసం మేము సిద్ధంగా ఉన్నాం."
సూర్యకుమార్ యాదవ్ (భారత కెప్టెన్):
"మేము ముందుగా బౌలింగ్ చేయాలని భావించాం. కనుక పాక్ టాస్ గెలవడంతో ఏ ఇబ్బంది లేదు. ఈ పోటీ కోసం మా ఆటగాళ్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది చాలా తేమగా ఉంది. సాయంత్రం తరువాత మంచు వస్తుందని మేము ఆశిస్తున్నాము. గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. ఏ మార్పులు లేవు."





















