IND vs PAK: ఇండియా–పాక్ మ్యాచ్‌ను ప్రదర్శిస్తే హోటళ్లను ధ్వంసం చేస్తాం: శివసేన నేతల హెచ్చరిక
ఇండియా–పాక్ మ్యాచ్‌ను హోటళ్లలోని టీవీల్లో ప్రదర్శించవద్దని శివసేన లీడర్లు కోరారు. ఒకవేళ్ల స్ట్రీమింగ్ చేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు.

India Pak Match: టీమిండియా నేడు పాకిస్థాన్‌తో ఢీకొనబోతోంది. ఏసియా కప్‌లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌కు గతంలోలాగ మద్దతు లభించడం లేదు. భారత అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పహల్గాం ఉగ్రదాడి చేసిన దేశంతో క్రికెట్ మ్యాచ్‌లు అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పాక్‌తో ఏ విధమైన క్రికెట్ సంబంధాలు కూడా కొనసాగించొద్దని కోరుతున్నారు. అయితే మరికొందరేమో మ్యాచ్ ఆడి పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని కోరుకుంటున్నారు. ఇలా పాక్‌తో మ్యాచ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మ్యాచ్‌ను ప్రదర్శించవద్దని హెచ్చరికలు
ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన శివసేన (UBT) లీడర్ శరద్ కోలీ రాష్ట్రంలోని హోటళ్ల ఓనర్లకు హెచ్చరికలు జారీ చేశారు. హోటళ్లలోని టీవీల్లో మ్యాచ్‌ను ప్రదర్శించవద్దన్నారు. ఒకవేళ్ల స్ట్రీమింగ్ చేస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియా రిలీజ్ చేశారు. అందులో శరద్ కోలీ బ్యాట్ పట్టుకొని హోటల్ యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. హోటళ్ల యజమానులు ఈ మ్యాచ్‌ను ప్రదర్శించవద్దని కోరారు. మహారాష్ట్రతోపాటు దేశ ప్రజలు ఈ మ్యాచ్‌ను చూడొద్దని విజ్ఞప్తి చేశారు. పాకిస్థాన్‌ను పాపాలు చేసే దేశంగా అభివర్ణించారు.
ఈ బ్యాట్‌తో పగులగొట్టేస్తాం
వీడియోలో హోటల్ యజమానులను ఉద్దేశించి శరద్ కోలీ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్రలోని అన్ని హోటల్ యజమానులను నేను అభ్యర్థిస్తున్నా. మన సోదరీమణుల సింధూరాన్ని చెరిపేయడానికి ప్రయత్నించింది పాకిస్తాన్. పాకిస్తాన్ మ్యాచ్‌ను మహారాష్ట్రలోని ఏ హోటల్‌లోనూ ప్రదర్శించవద్దు. దేశాన్ని ప్రేమిస్తే మీరు ఈ మ్యాచ్‌ను ప్రసారం చేయరు. ఏదైనా హోటల్ యజమాని లేదా ఆపరేటర్ భారత్–పాక్ మ్యాచ్‌ను ప్రదర్శిస్తే.. మేము ఆ హోటల్‌ను ఈ బ్యాట్‌తో పగులగొట్టేస్తామని గుర్తుంచుకోండి. హోటల్ యజమాని, డైరెక్టర్ దీనికి బాధ్యత వహిస్తారు’ అని పేర్కొన్నారు.
Sharad Koli On Ind-Pak Match: 'स्क्रीनवर मॅच दाखवली तर बॅटने स्क्रीन फोडणार' शरद कोळींचा इशारा#Reels #Reelsfeed#LokshahiMarathi #SharadKoli #IndPakMatch #news #newsupdate #lokshahinews pic.twitter.com/kgJ4b8vKTy
— Lokshahi Marathi (@LokshahiMarathi) September 14, 2025
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే మ్యాచ్ ప్రదర్శనపై నిబంధనల గురించి శివసేన పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
మ్యాచ్ ఆడాల్సిందే.. తప్పదు
భారత్–పాక్ మ్యాచ్‌ను బ్యాన్ చేయాలని డిమాండ్లు వస్తున్న వేళ క్రీడాశాఖ మాజీ, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC), ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించే మ్యాచ్‌ను బహిష్కరించలేమని వెల్లడించారు. ACC, ICC ఆధ్వర్యంలో జరిగే మల్టీనేషనల్ టోర్నమెంట్లో వారికి కేటాయించిన మ్యాచుల్లో కచ్చితంగా పాల్గొనాలని అన్నారు. ఒకవేళ ఆడకుంటే ఆ దేశాలను టోర్నీ నుంచి ఎలిమినేట్ చేస్తారని పేర్కొన్నారు.
#WATCH | Maharashtra: Women workers of Shiv Sena (UBT) stage a protest in Mumbai with 'sindoor', opposing the India vs Pakistan match in Asia Cup 2025, scheduled today.
— ANI (@ANI) September 14, 2025
Party chief Uddhav Thackeray had said yesterday that Shiv Sena (UBT) women workers will come out on the… pic.twitter.com/1P1Ws9Hr5Q
ద్వైపాక్షిక సిరీస్‌లు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆడదు
కానీ పాక్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆడదని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ‘భారత్‌పై పాక్ ఉగ్ర దాడులు ఆపేసే వరకు టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకూడదని మేము చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నాం’ అని మంత్రి మీడియా సమావేశంలో తెలిపారు.





















